• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రాప్తాడు ఘటన'కు...

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

| రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడిని ‘యానిమల్’ సినిమా సీన్‌తో పోలుస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు రావడం తెలిసిందే. దీనిపై ఆయన ఇప్పటికే ఘాటుగా స్పందించారు. తాజాగా సంగీత దర్శకుడు అమాల్ మల్లిక్ కూడా సినిమాలనే నేరాలకు బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఐటమ్ సాంగ్స్, అభ్యంతరకర ర్యాప్ పాటలపై కూడా చర్చ జరగాలని సూచించారు. ఏ సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకూడదని తల్లిదండ్రులకు గుర్తుచేశారు.

By - Sivaji Kontham
Update: 2026-11-06 03:55 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై హేమంత్ అనే యువకుడు ఎలక్ట్రిక్ చైన్‌-సాతో జరిపిన దారుణ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన విష‌యం తెలిసిందే. ప్రేమను తిరస్కరించిందనే నెపంతో పాఠశాల గదిలోకి చొరబడి క్రూరమైన దాడికి పాల్ప‌డ‌టం విద్యార్థుల భద్రతపై ఆందోళన రేకెత్తించింది. అయితే ఈ విషాదకర ఘటనను 2023లో వచ్చిన `యానిమల్` చిత్రంలోని క్లాస్‌రూమ్ సీన్‌తో పోలుస్తూ... సందీప్ రెడ్డి వంగా తీసే హింసాత్మక సినిమాలే సమాజాన్ని చెడగొడుతున్నాయంటూ కొందరు విమర్శకులు సోషల్ మీడియాలో వివాదాన్ని రాజేశారు.

ఈ తరహా విమర్శలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తూ ఎదురుదాడి చేశారు. నేరం జరిగినప్పుడు దానికి సినిమాలను బలిపశువును చేయడం సరికాదని ఖండించారు. ఎక్కడైనా దారుణమైన నేరం జరిగినప్పుడు బాధితుల పట్ల సానుభూతి చూపించడం.. ఆ సమస్య వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదటి బాధ్యత కావాలి. అంతే తప్ప తమకు వీలైన రీతిలో సినిమాను బలిపశువును చేయడం కాదు. ఒక ఘోరమైన విషాదాన్ని కొందరు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి డర్టీ ఎక్స్‌క్యూజ్‌గా వాడుకుంటున్నారు. కొందరు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న నటులు, దర్శకులు, నిర్మాతలు ఇతరుల పనిని తక్కువ చేసి మాట్లాడేందుకు సామాజిక సంస్కర్తల్లా అవతారం ఎత్తుతారు! అంటూ విమర్శకులకు అత్యంత ఘాటుగా బుద్ధి చెప్పారు.

ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అమాల్ మల్లిక్ ఈ అంశంపై త‌న‌దైన విశ్లేష‌ణ చేసారు. ఒక నేరానికి కేవలం సినిమాలను లేదా సంగీతాన్ని మాత్రమే నిందించడం సరైన విధానం కాదని అమాల్ వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. ``వినోదం అనేది మనుషులను ప్రభావితం చేయవచ్చు. కానీ ఒక నేరం జరిగినప్పుడు దానికి ఒక సినిమానో, పాటనో లేదా ఒక దర్శకుడినో బాధ్యులను చేయడం సరికాదు. సినిమాలు, పాటలు చూసి కొందరు పిల్లలు అనుకరించడానికి ప్రయత్నిస్తారు.. దానిపై దర్శకులు ఆలోచించాలి. కానీ ఒక వ్యక్తి చేసే దారుణమైన పనికి కేవలం సినిమాలను మాత్రమే నిందించలేము`` అని విశ్లేషించారు.

ఇదే క్రమంలో అమాల్ మల్లిక్ సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను నిలదీస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు యానిమల్, కబీర్ సింగ్, కేజీఎఫ్, దురంధ‌ర్ వంటి సినిమాలు నచ్చాయని చెబుతూనే.. కేవలం సినిమాలపైనే కాకుండా సమాజంలో ప్రాచుర్యం పొందుతున్న ఐటమ్ సాంగ్స్ - ర్యాప్ సాంగ్స్‌పై ఎందుకు సీరియస్‌గా చర్చించరని ప్రశ్నించారు. పాపుల‌ర్ ఐటమ్ సాంగ్స్.. అభ్యంతరకరమైన సాహిత్యం ఉన్న పాటలు రియాలిటీ షోలలో ప్రదర్శించేప్పుడు.. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత పదజాలం వాడే ర్యాప్ పాటలు ఉన్నప్పుడు.. ఒక్క సినిమాను లేదా దర్శకుడిని మాత్రమే విమర్శించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

రాప్తాడు పాఠశాలలో జరిగిన ఘటన అత్యంత ఘోరమైనది.. దానికి బాధ్యుడైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఇద్దరూ కూడా కోరారు. అలాగే ఏజ్ రేటింగ్స్ ను క‌చ్చితంగా పాటించాలని...A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకూడదని తల్లిదండ్రులకు సూచించారు. సమాజంలో ఒక నేరం జరిగినప్పుడు దాని వెనుక ఉండే కుటుంబ పెంపకం, మానసిక, సామాజిక కారణాలను పరిశీలించకుండా.. ప్రతీ విషయాన్ని సినిమాలకు ముడిపెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమాత్రం తగదని వీరిద్దరి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    
  • amalmallik 
  • sandeepreddyvanga 
  • animalmovie 
  • rapthaduincident 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS