• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీరాముడు కూడా 14 ఏళ్లే...

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

| పవన్ కళ్యాణ్‌తో విడిపోయి 14 ఏళ్లు గడిచినా, తెలుగు ప్రేక్షకులు తనను ఇప్పటికీ ఆయన గత సంబంధంతోనే గుర్తిస్తున్నారని రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత సినిమాలు నిర్మించడం, దర్శకత్వం వహించడం, కవితలు రాయడం, డ్యాన్స్ షోల్లో పాల్గొనడం వంటి పనులు చేసినా తనకంటూ గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. తన 14 ఏళ్ల వనవాసం ఎప్పుడు ముగుస్తుందని పాడ్‌కాస్ట్‌లో ప్రశ్నించారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-06 09:18 GMT

సినిమా రంగంలో సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో, ఆ గుర్తింపును వ్యక్తిగత జీవితానికి సంబంధం లేకుండా కాపాడుకోవడం కూడా అంతే కష్టం. రేణు దేశాయ్ ప్రస్తుతం ఇది సమస్య ఎదుర్కొంటుంది.

పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య ఉన్నారు. విడాకుల తర్వాత రేణూ దేశాయ్ తన జీవితంలో ఎన్నో కొత్త పనులు ప్రారంభించారు. సినిమాలు నిర్మించడం, దర్శకత్వం వహించడం, కవితలు రాయడం, టీవీ షోల్లో పాల్గొనడం వంటి అనేక రంగాల్లో తన ప్రతిభను చూపించారు. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో కొందరు తనను పవన్ కళ్యాణ్‌తో ఉన్న గత సంబంధం ద్వారానే గుర్తిస్తున్నారని ఆమె చెప్పారు.

తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణూ దేశాయ్ తన మనసులోని బాధను బయటపెట్టారు. తన జీవితాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా చూస్తున్నారో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"తెలుగు వాళ్లకు నా జీవితం గురించి ఒక విషయం చెప్పాలి. నేను 1999 జూన్‌లోనే పుట్టినట్లు చాలామంది భావిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమా కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచే నా జీవితం మొదలైనట్లు చూస్తున్నారు. అంతకుముందు నాకు ఎలాంటి జీవితం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు" అని అన్నారు.

అంతేకాదు, తన పరిస్థితిని శ్రీరాముడి వనవాసంతో పోల్చారు. "ఇప్పటికే 14 ఏళ్లు గడిచిపోయాయి. శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసంలో ఉన్నారు. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?" అంటూ ప్రశ్నించారు.

విడాకుల తర్వాత తాను సాధించిన విజయాలను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.

"2012లోనే మాకు విడాకులు అయ్యాయి కదా! ఆ తర్వాత నేను ఒక మరాఠీ సినిమాను నిర్మించాను. అది మంచి విజయాన్ని అందుకుంది. మరో సినిమాకు కథ రాసి, నిర్మించి, దర్శకత్వం కూడా వహించాను. డ్యాన్స్ షోలో పాల్గొన్నాను. కవితలు రాశాను. ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నాను. నేను ఎవరూ కాకపోతే నన్ను పనుల కోసం ఎందుకు పిలుస్తారు?" అని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల గురించి కూడా రేణూ మాట్లాడారు. జంతువుల పట్ల ప్రేమ చూపిస్తూ వాటిని రక్షించడానికి ప్రయత్నించినా కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పారు.

"నేను ఒక కుక్కను కాపాడితే కూడా నన్ను తిడుతున్నారు. అతను లేకపోతే ఆమెకు బతకడానికి ఏమీ లేదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు" అని తన బాధను వ్యక్తం చేశారు.

Tags:    
  • renudesai 
  • pawankalyan 
  • renudesaicomments 
  • telugucinema 
  • celebritynews 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS