• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు మాట ఇచ్చారు సరే.....

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

| చిరంజీవితో ఆగిపోయిన సినిమా గురించి దర్శకుడు వెంకీ కుడుముల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్‌తో సినిమా మిస్ అవ్వడం తనకు వ్యక్తిగతంగా పెద్ద రిగ్రెట్ అని తెలిపారు. మంచి కొత్త కథతో వస్తే మళ్లీ సినిమా చేద్దామని చిరంజీవి చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఈ కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కాలంటే వెంకీ బలమైన స్క్రిప్ట్‌తో మెగాస్టార్‌ను మెప్పించాల్సి ఉంటుంది.

By - M Prashanth
Update: 2026-11-10 18:30 GMT

మెగాస్టార్ చిరంజీవి డేట్స్ సంపాదించడం ఒక ఎత్తైతే, చేతిదాకా వచ్చి జారిపోయిన ప్రాజెక్ట్‌ను మళ్ళీ ట్రాక్ ఎక్కించడం అంతకంటే పెద్ద టాస్క్. చలో, భీష్మ విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న టైంలో డైరెక్టర్ వెంకీ కుడుములకు మెగా ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది. అధికారిక ప్రకటన దాకా వెళ్ళిన ఆ సినిమా తర్వాత సైలెంట్‌గా డ్రాప్ అయిపోయింది. ఇక లేటెస్ట్ గా tupaki.comకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆగిపోయిన సినిమాపై వెంకీ ఓపెన్ కామెంట్స్ చేయడం వైరల్ అవుతోంది

చిరంజీవికి తాను వీరాభిమానినని, ఆయనతో సినిమా మిస్ అవ్వడం పర్సనల్ గా పెద్ద రిగ్రెట్ అని వెంకీ ఒప్పుకున్నారు. ఎప్పుడు కలిసినా చిరు ఎంతో పాజిటివ్‌గా మాట్లాడతారని, ఫ్రెష్ ఐడియా ఏదైనా తడితే మళ్ళీ వచ్చి చెప్పమని అన్నారని గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ ఇచ్చిన ఆ ఒక్క మాటే ఇప్పుడు వెంకీలో కొత్త ఆశలు రేపుతోంది. సరైన స్టోరీ కుదిరితే మరోసారి మెగా కాంపౌండ్ తలుపు తట్టేందుకు తాను రెడీగా ఉన్నానంటూ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు.

కానీ టాలీవుడ్ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా ఉంటుంది. ఇండస్ట్రీలో పెద్ద హీరోలు స్క్రిప్ట్ చర్చలు ఆగిపోయినప్పుడు ఇలాంటి ధైర్యం చెప్పడం చాలా కామన్. 'మంచి కథతో రా చేద్దాం' అనేది ఎక్కువగా మర్యాదపూర్వకమైన స్టేట్‌మెంట్‌గానే మిగిలిపోతుంటుంది తప్ప, అది మళ్ళీ ప్రాజెక్ట్‌గా మారిన సందర్భాలు చాలా తక్కువ. ఒక్కసారి సెట్ అవ్వని కాంబినేషన్ వైపు స్టార్ హీరోలు వెంటనే మళ్ళీ దృష్టి పెట్టడం అరుదుగా జరుగుతుంది.

ఇక్కడ అసలైన మైనస్ మొమెంటమ్. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన టైంలో వెంకీ ట్రాక్ రికార్డ్ వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. నితిన్‌తో చేసిన రాబిన్ హుడ్ రిజల్ట్ ఆయన మార్కెట్ గ్రాఫ్ మీద గట్టి ప్రభావమే చూపించింది. ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నప్పుడే ఏ హీరో అయినా ఈజీగా డేట్స్ ఇస్తారు. ఒక ఫెయిల్యూర్ తర్వాత వెంటనే బౌన్స్ బ్యాక్ అవ్వకుండా, మెగాస్టార్ లాంటి టాప్ లీగ్ హీరోను ఒప్పించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

మరోపక్క చిరంజీవి లైనప్ కూడా ఇప్పుడు ఫుల్ టైట్‌గా ఉంది.

విశ్వంభర తర్వాత ఆయన ఎంచుకుంటున్న ప్రాజెక్టులు చూస్తే రూట్ స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం కామెడీ లేదా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాను నమ్ముకోకుండా, సరికొత్త నేరేషన్ ఉన్న డైరెక్టర్ల వైపు మెగాస్టార్ మొగ్గు చూపుతున్నారు. వెంకీ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ వర్కవుట్ అవ్వాలంటే, రొటీన్ ఫన్ కాకుండా ఎవరూ ఊహించని ఒక ఫ్రెష్ పాయింట్ స్క్రిప్ట్‌లో ఉండాల్సిందే.

ఇది వెంకీ కుడుములకు తనను తాను రీప్రూవ్ చేసుకునే పెద్ద టెస్ట్. చిరంజీవి పాజిటివ్‌గా స్పందించారు కదా అని క్యాజువల్ గా వెళ్తే పని జరగదు. చిరు ఇమేజ్‌ను ఎలివేట్ చేస్తూనే, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ ఇచ్చే పక్కా బౌండ్ స్క్రిప్ట్ పట్టుకెళ్తేనే ఈ డ్రీమ్ కాంబో సెట్స్‌పైకి వెళ్లే స్కోప్ ఉంటుంది. ఇక లేటెస్ట్ గా వెంకీ నిర్మాతగా మారి ఇట్లు అర్జున అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపు అందుకుంటారో చూడాలి.



చిరంజీవి గారికి మీరు స్టోరీ చెప్పారు... కానీ సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు. #Chiranjeevi గారితో భవిష్యత్తులో సినిమా చేస్తారా? #ItlluArjuna #VenkyKudumula #Thaman #ItlluArjunaOnNov13 #Aniesh #AnaswaraRajan #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official https://t.co/41FRuE3RSm

— Tupaki (@tupaki_official) November 10, 2026
Tags:    
  • chiranjeevi 
  • venkykudumula 
  • megastar 
  • tollywood 
  • robinhood 
  • itluarjuna 

Similar News

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS