• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

| రావూరి వెంకటేష్ అలియాస్ ఆర్వీ (అరుణ్ దేవ్) సిటీ పిల్లాడు. అతడి తండ్రి (హర్షవర్ధన్) చాలా స్ట్రిక్ట్. ఆయన దృష్టిలో మార్కులు, ర్యాంకులే ముఖ్యం.

By - Tupaki Desk
Update: 2026-11-06 07:23 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

నటీనటులు : రోహన్ - అరుణ్ - జయసుధ - వాసుకి - రాజీవ్ కనకాల - హర్షవర్ధన్ - ఖుషి - హర్షిని తదితరులు..

సంగీతం: శింజిత్ ఎర్రమిల్లి

ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్

నిర్మాత: ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శ్రీకర్ నయన్

‘గర్ల్ ఫ్రెండ్’ సహా మరి కొన్ని చిత్రాలతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నాడు ధీరజ్ మొగిలినేని. ఈసారి ఆయన ‘సమ్మర్ హాలిడేస్’ పేరుతో చిన్నపిల్లల సినిమా తీశారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ : రావూరి వెంకటేష్ అలియాస్ ఆర్వీ (అరుణ్ దేవ్) సిటీ పిల్లాడు. అతడి తండ్రి (హర్షవర్ధన్) చాలా స్ట్రిక్ట్. ఆయన దృష్టిలో మార్కులు, ర్యాంకులే ముఖ్యం. తండ్రి వల్ల విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆర్వీని అతడి తల్లి వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరికి తీసుకెళ్తుంది. అక్కడ ఆర్వీకి కాశీ వెంకటేశ్వర్లు అలియాస్ కేవీ పరిచయం అవుతాడు. ఇంట్లో ఎన్ని కష్టాలున్నప్పటికీ.. సరదాగా బతికే నైజం కేవీది. తండ్రి చనిపోవడంతో చిన్న వయసులోనే బాధ్యతలు నెత్తిన వేసుకున్న అతను ఒక మామిడి చెట్టును లీజుకి తీసుకుని సాగు చేస్తుంటాడు. మరి ఆర్వీ-కేవీ కలయిక తర్వాత వీళ్లిద్దరి జీవితంలో ఎదురైన అనుభవాలేంటి.. వీళ్లిద్దరి వేసవి సెలవులు ఎలా గడిచాయి.. అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ: అమ్మమ్మ ఊరు.. వేసవి సెలవులు అనగానే చాలామందికి నోస్టాల్జిక్ ఫీల్ వచ్చేస్తుంది. ఎక్కువ మంది జీవితాల్లో ఇదొక ప్రత్యేక అధ్యాయం. దీంతో ముడిపడ్డ జ్ఞాపకాలను తలుచుకుని ఉద్వేగానికి గురవుతారు. ఆ అనుభవాలు ఉన్న వారినే కాదు.. వాటిని మిస్సయిన వాళ్లను కూడా కదిలించే సినిమా ‘సమ్మర్ హాలిడేస్’. ఇప్పుడు రోజులు మారిపోయాయి కాబట్టి జెన్జీ ఈ సినిమా చూసి ఎలా ఫీలవుతారో కానీ.. నైంటీస్ కిడ్స్, అంతకుముందు తరం వాళ్లు ‘సమ్మర్ హాలిడేస్’ బాగా కనెక్టవుతారు. ఇలాంటి స్లైస్ ఆఫ్ లైఫ్ స్టోరీలు ఇంతకుముందు కూడా చూసినప్పటికీ.. రొటీన్ స్టయిల్లోనే భావోద్వేగాలను తట్టిలేపడంలో ‘సమ్మర్ హాలిడేస్’ విజయవంతం అయింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేయడంతో పాటు స్నేహ బంధాల్లోని మాధుర్యాన్ని చూపించే ఈ చిత్రం.. ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతోనే ప్రేక్షకులను కదిలిస్తుంది

‘సమ్మర్ హాలిడేస్’ చిన్నపిల్లలు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన సినిమానే అయినప్పటికీ.. పెద్దలు కూడా దీంతో కనెక్ట్ అవుతారు. అందుక్కారణం.. పెద్దలు కూడా బాల్యాన్ని దాటి వచ్చినవాళ్లే. వాళ్ల జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి కాబట్టి. ర్యాంకులే ముఖ్యం అనుకునే తండ్రి వల్ల ఒత్తిడికి గురయ్యే కుర్రాడు.. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చి అక్కడ కష్టాలను మరిచి సదరాగా జీవితాన్ని గడిపే కుర్రాడి స్నేహంతో ఎలా జీవిత సారాన్ని తెలుసుకున్నాడనే నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. నెమ్మదిగా మొదలయ్యే ఈ సినిమా ఇద్దరు కుర్రాళ్లు కలిసి ఊరిలో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాక ఊపందుకుంటుంది. క్రికెట్ ఆడడం.. ఈత కొట్టడం.. అల్లరి చేయడం.. ఇలాంటి సన్నివేశాలతో హుషారుగా నడుస్తుంది ‘సమ్మర్ హాలిడేస్’. చాలా సీన్లు నోస్టాల్జిక్ ఫీల్ కలిగిస్తూ ఆహ్లాదకరంగా సాగుతాయి. ఫస్టాఫ్ లో వినోదానికి ఢోకా లేదు. కొంత ఎమోషన్ కూడా వర్కవుట్ అయింది.

కానీ సెకండాఫ్ లో మాత్రం ‘సమ్మర్ హాలిడేస్’ ఎమోషన్లతో పిండే ప్రయత్నం చేసింది. కానీ మెలోడ్రామా మరీ ఎక్కువైపోవడంతో కొంత ఇబ్బంది తప్పదు. తల్లికి కొడుకు చీర కొనివ్వడం మీద డ్రామా మరీ హద్దులు దాటేసినట్లు అనిపిస్తుంది. అమ్మ ఎమోషన్ మరీ సాగదీశారు. తొందరగా ఆ చీర ఏదో కొని ఇచ్చేస్తే అయిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. అమ్మమ్మ ఎమోషన్ మాత్రం బాగానే వర్కవుట్ అయింది. జయసుధతో ఆ పాత్ర చేయించడంతో దానికి ఒక నిండుదనం వచ్చింది. జయసుధ వల్ల కథలో బలం పెరిగింది. సినిమాకు వెయిట్ వచ్చింది. స్లైస్ ఆఫ్ లైఫ్ స్టోరీలన్నింట్లో ముందు నెగెటివ్ గా ఉండే పాత్రలన్నీ తర్వాత పాజిటివ్ గా మారడం మామూలే. సినిమా ముగింపును ఊహించడం కష్టమేమీ కాదు. వినోదానికి తోడు భావోద్వేగాలు కూడా ఉన్న ‘సమ్మర్ హాలిడేస్’కు జెన్జీ ఏమేర కనెక్ట్ అవుతారో కానీ.. ముందు తరం వాళ్లకు మాత్రం ఇది నోస్టాల్జిక్ ఫీల్ ఇస్తుంది. స్టోరీ రొటీన్ అనిపించినా.. అక్కడక్కడా మెలోడ్రామా ఎక్కువైనట్లు అనిపించినా.. కామెడీ, ఎమోషన్స్ బాగానే పండిన ‘సమ్మర్ హాలిడేస్’ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అవుతుంది.

నటీనటులు: ఇప్పటికే ‘35: చిన్న కథ కాదు’ సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన అరుణ్ దేవ్.. ఇందులో కూడా ఎమోషనల్ క్యారెక్టర్లో మెప్పించాడు. తనలోని అమాయకత్వమే పాత్రకు బలం. కీలక సన్నివేశాల్లో అతను హావభావాలు చక్కగా పలికించాడు. ఇక చలాకీ కుర్రాడి పాత్రలో రోహన్ కూడా ఆకట్టుకున్నాడు. చాలా వరకు నవ్వించిన అతను.. ఎమోషనల్ సీన్లలో కూడా మెప్పించాడు. స్ట్రిక్ట్ ఫాదర్ పాత్రలో హర్షవర్ధన్ బాగా సెట్ అయ్యారు. తల్లిగా వాసుకి మెప్పించింది. అమ్మమ్మ పాత్రలో జయసుధ చక్కగా ఒదిగిపోయారు. మామిడి తోట యజమాని పాత్రలో రాజీవ్ కనకాల ఓకే. రోహన్ తల్లి పాత్రలో హర్షిని కోడూరి బాగానే సెట్ అయ్యారు. మహేష్ ఆచంట.. చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి.. రమణ భార్గవ.. జబర్దస్త్ అశోక్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం: కెమెరామన్ సాయి ప్రకాష్ విజువల్స్ బాగున్నాయి. పాతికేళ్ల ముందు వాతావరణాన్ని చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. శింజిత్ యెర్రమిల్లి పాటలు యావరేజ్ గా అనిపించినా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సన్నివేశాల్లో ఫీల్ పెంచడంలో స్కోర్ కీలక పాత్ర పోషించింది. ధీరజ్ మొగిలినేని నిర్మాణ విలువల్లో మంచి ప్రమాణాలు పాటించాడు. రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీకర్ నయన్.. కథలో కొత్తదనం లేకపోయినా.. కథనంతో మ్యాజిక్ చేశాడు. ఇటు వినోదాన్ని, అటు భావోద్వేగాలను బాగా పండించాడు.

చివరగా: సమ్మర్ హాలిడేస్.. రొటీన్ అయినా కదిలిస్తుంది

రేటింగ్- 2.75/5

Tags:    
  • summerholidays 
  • summerholidaysmoviereview 
  • summerholidaysreview 
  • summerholidayspublictalk 
  • arundev 
  • rohan 
  • tupakireview 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS