• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామాయణంలో భాగం కావడం...

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

| ‘రామాయణ: పార్ట్ 1’లో శూర్పణఖగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్రకు వస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఇతిహాసంలో భాగం కావడం గర్వంగా ఉందంటూ షూటింగ్ ఫొటోలను షేర్ చేసి దర్శకుడు నితీశ్ తివారీ, సహనటీనటులు, హెయిర్ అండ్ మేకప్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెరపై కొద్దిసేపే కనిపించినా తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

By - Madhu Reddy
Update: 2026-11-06 10:46 GMT

ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామాయణ: పార్ట్ 1’కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ తన లుక్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే రకుల్ సోషల్ మీడియాలో షూటింగ్ నాటి ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాశారు. మన దేశపు సంస్కృతిలో భాగమైన ఈ కథలో నటించడం తన అదృష్టమని ఆమె చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు ఇలా వున్నాయి..

 

శూర్పణఖగా మారడం ఓ కొత్త అనుభవం:

రామాయణం లాంటి గొప్ప కథలో శూర్పణఖ పాత్ర చేయడానికి తాను ఎంతో కాలంగా ఎదురుచూశానని రకుల్ చెప్పారు. తరతరాలుగా మన జీవితాల్లో భాగమైన ఈ ఇతిహాసంలో నటించడం ప్రతిరోజూ దొరికే అవకాశం కాదని ఆమె అన్నారు. ఇక ముఖ్యంగా రామరావణ యుద్ధానికి ప్రధాన కారణమైన శూర్పణఖ పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయని, ఆ పాత్రను సరిగ్గా చూపించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రకుల్ పేర్కొన్నారు.

 

మేకర్స్, కో-స్టార్స్‌కు రకుల్ థ్యాంక్స్:

 

భారతీయ కథను ఇంత భారీ స్థాయిలో ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు నితీశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాలకు రకుల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాముడిగా చేసిన రణ్‌బీర్ కపూర్, సీతగా నటించిన సాయిపల్లవి, రావణుడిగా కనిపించిన యశ్‌తో పాటు కాజల్ అగర్వాల్, శోభన, రవి దూబేల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక వీరందరూ ఎంతో కష్టపడి ఈ మ్యాజిక్‌ను స్క్రీన్ పైకి తెచ్చారని ఆమె అభినందించారు.

 

హెయిర్ అండ్ మేకప్ టీమ్ కష్టం:

శూర్పణఖ పాత్రకు తగ్గట్టుగా తన లుక్‌ను తీర్చిదిద్దిన హెయిర్ అండ్ మేకప్ టీమ్‌కు రకుల్ క్రెడిట్ ఇచ్చారు. ట్రైలర్ వచ్చినప్పటి నుంచే తన గెటప్‌కు మంచి రెస్పాన్స్ రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఒక భారతీయురాలిగా గర్వపడే క్షణమని రకుల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

 

సినిమాలో లీడ్ రోల్స్ ఎంత బాగా చేసినా, కొన్నిసార్లు సైడ్ క్యారెక్టర్లు లేదా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలేన అవి ఆడియన్స్ చాల కాలం గుర్తుంచుకుంటారు. ఇక ఇప్పుడు 'రామాయణ' సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చేసింది అదే జాబితాలోకి వస్తుంది. స్క్రీన్ మీద ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా, ఆ తక్కువ టైంలోనే తన అద్భుతమైన హావభావాలతో థియేటర్లలో ఉన్నవాళ్లందరినీ కట్టిపడేసింది. ఇప్పటివరకు సినిమాల్లో వచ్చిన శూర్పణఖ పాత్రలన్నింటికంటే రకుల్ చాలా డిఫరెంట్‌గా, మోస్ట్ బ్యూటిఫుల్ రాక్షస పాత్రలా కనిపించిందని ఫాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

 

ఇక మొత్తానికి శూర్పణఖ పాత్రతో రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెరపై ఆమె కనిపించిన తీరు, ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన షూటింగ్ విశేషాలు ఫాన్స్ ను మెప్పిస్తున్నాయి.

Tags:    
  • rakulpreetsingh 
  • ramayana 
  • shurpanakha 
  • ranbirkapoor 
  • indiancinema 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS