చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!
| మలయాళ చిత్రం ‘ఉయరే’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న గోవింద్ పాత్రకు ఆసిఫ్ అలీ తొలుత ఆశ్చర్యపోయారని దర్శకుడు మను అశోకన్ వెల్లడించారు. యాసిడ్ దాడి సన్నివేశం గురించి విన్నప్పుడు ఆయన షాక్‌కు గురయ్యారని తెలిపారు. ఈ పాత్ర చేయొద్దని సన్నిహితులు హెచ్చరించినా, కెరీర్ గురించి ఆలోచించకుండా నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి ఆసిఫ్ అంగీకరించారని దర్శకుడు గుర్తుచేసుకున్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. అలాంటి సినిమాల్లో 2019లో వచ్చిన `ఉయరే` ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన చిత్రంలో ఆసిఫ్ అలీ గోవింద్ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే చాక్లెట్ బాయ్ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన ఆ క్రూరమైన పాత్రలో నటించడానికి ఆసిఫ్ అలీ తొలుత ఎంతగా అవాక్కయ్యారో? దర్శకుడు మను అశోకన్ తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సాధారణంగా లవర్ బాయ్ పాత్రలు చేసే ఆసిఫ్ అలీని ఇలాంటి ప్రతినాయక పాత్ర కోసం సంప్రదించినప్పుడు యూనిట్ కూడా చాలా సార్లు పునరాలోచనలో పడిందట. ఒక విలన్ పాత్రను చేసే సాధారణ నటుడిని తీసుకుంటే ఆ పాత్రకు ఆ ప్రభావం ఉండదని.. ప్రేక్షకులకు పరిచయం లేని కోణంలో ఉండే వ్యక్తి అయితేనే బాగుంటుందని దర్శకుడు భావించారు. అయితే `సండే హాలీడే` వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా యూత్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆసిఫ్ అలీ ఈ పాత్రను అంగీకరిస్తారా లేదా అనే సందేహం తమను వందసార్లు వేధించిందని మను అశోకన్ గుర్తు చేసుకున్నారు.
కథా చర్చల సమయంలో ఆసిఫ్ అలీ ఎదుట యాసిడ్ దాడికి సంబంధించిన సన్నివేశాన్ని వివరించిన క్షణంలో ఆయన నిజంగానే షాక్‌కు గురయ్యారని దర్శకుడు తెలిపారు. కేవలం దెబ్బలు కొట్టడం లేదా సాధారణంగా కోపగించుకోవడం వంటివి ఆశిస్తారే తప్ప ఏకంగా యాసిడ్ పోసేంతటి అరాచకమైన సన్నివేశాన్ని ఆసిఫ్ అస్సలు ఊహించలేకపోయారని పేర్కొన్నారు. ఆ సన్నివేశం గురించి విన్న వెంటనే ఆసిఫ్ అలీ కొన్నిక్షణాలు స్టార్ అయిపోయారు.
ఆసిఫ్ అలీకి సన్నిహితులు ఈ పాత్రను చేయోద్దని వారించారట. ఇలాంటి నెగెటివ్ పాత్రలు చేయడం వల్ల కెరీర్‌పై ప్రభావం పడుతుందని.. భవిష్యత్తులోనూ ప్రేక్షకులకు అదే కోణంలో కనిపిస్తారని కొందరు హెచ్చరించారు. అయినా? వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక నటుడిగా తనలోని ప్రతిభను నిరూపించుకోవడానికే అసీప్ ప్రాధాన్యత ఇచ్చారని దర్శకుడు కొనియాడారు. స్టార్డమ్ గురించి ఆలోచించకుండా కేవలం పాత్ర డిమాండ్ మేరకు ముందుకు వెళ్లిన ఆసిఫ్ నిర్ణయమే ఆ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది.
ఈ ఉదంతం కేవలం హీరో ఇమేజ్ చుట్టూ తిరగకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో మలయాళ నటులు చూపించే తెగువ మరోసారి ప్రూవ్ అయింది. ఆసిఫ్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమే నేడు అతడిరని నటుడిగా మరింత ఉన్నతస్థానంలో నిలబెట్టింది. ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ వైవిథ్యాన్ని స్వాగతించే నటుల వల్లే ఇలాంటి గొప్ప చిత్రాలు తెరకెక్కుతాయని మరోసారి ప్రూవ్ అయింది.