• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామాయణం తీయడానికి ఇంత...

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

| రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించిన 'రామాయణం పార్ట్ 1' కోసం చిత్ర బృందం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రావణుడి బంగారు సింహాసనం కోసం రూ.కోటి, శూర్పణఖ రథం కోసం రూ.1.5 కోట్లు వెచ్చించారట. రావణుడి కోసం 4 వేల ఆభరణాలు రూపొందించడంతో పాటు ముంబై ఫిల్మ్ సిటీలో 150 సెట్లు నిర్మించినట్లు సమాచారం.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-06 13:11 GMT

రామాయణం అంటేనే ఎన్నో భావోద్వేగాలు, అద్భుతమైన పాత్రలు, గొప్ప కథ. ముఖ్యంగా రాముడు, సీత, రావణుడు వంటి పాత్రలకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ కథలోని ప్రతి సన్నివేశానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. రాముడు, సీత మధ్య జరిగే ప్రేమ కథ అపూర్వం. ఇక రాముడు క్యారెక్టర్ అంటేనే ఎలివేషన్. తనకి మళ్లీ సపరేట్ ఎలివేషన్ ఇచ్చే అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు రామాయణం సినిమా గురించి ఒక విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదే ఈ సినిమా కోసం చేసిన ఖర్చు.

రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించిన రామాయణ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చాలా భారీ స్థాయిలో నిర్మించారు. ముఖ్యంగా సినిమాలో చూపించిన రాజభవనాలు, ఆభరణాలు, రథాలు, సెట్ల కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రావణుడి పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చారు. అతడి రాజసం కనిపించేలా భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రావణుడు కూర్చునే సింహాసనాన్ని బంగారు తాపడంతో ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ ఒక్క సింహాసనం కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాదు, రావణుడి కోసం ఏకంగా 4 వేల రకాల ఆభరణాలను సిద్ధం చేశారు. ప్రతి ఆభరణం అతడి పాత్రకు తగ్గట్టుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ఇక శూర్పణఖ పాత్ర కోసం కూడా చిత్ర బృందం భారీగా ఖర్చు చేసింది. ఆమె ప్రయాణించే రథాన్ని ప్రత్యేకంగా బంగారు అలంకరణలతో రూపొందించారు. ఈ రథం తయారీకి దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టారంట.

ఈ సినిమా కోసం ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఏకంగా 150 సెట్లను నిర్మించినట్లు తెలుస్తోంది. రామాయణ కాలాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకు చిత్ర బృందం ఎంతో కష్టపడింది.

కథలోని భావోద్వేగాలే ప్రధానమైనప్పటికీ, వాటిని ఇంత భారీ విజువల్స్‌తో చూపించడానికి నిర్మాతలు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. మరి ఈ భారీ నిర్మాణం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకొని ఎలాంటి కలెక్షన్లు తెచ్చి పెడుతుందో చూడాలి.

Tags:    
  • ramayanamovie 
  • ranbirkapoor 
  • yash 
  • ravana 
  • bollywood 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS