రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!
| రామాయణం ఆధారంగా తెరకెక్కిన ప్రభాస్ ‘ఆదిపురుష్’, రణబీర్ కపూర్ ‘రామాయణ’ సినిమాల మధ్య ప్రధాన తేడా కథను చూపించిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్‌లో కనిపిస్తోంది. ఆదిపురుష్‌లో పాత్రల రూపాలు, గ్రాఫిక్స్‌పై విమర్శలు వచ్చాయి. రామాయణ మాత్రం ఇతిహాస కథకు ప్రాధాన్యత ఇస్తూనే విజువల్ గ్రాండియర్‌పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకే కథాంశమైనా మేకింగ్‌లోని ఈ వ్యత్యాసమే రెండు సినిమాలపై ప్రేక్షకుల స్పందనను ప్రభావితం చేసింది.
రామాయణం అనేది భారతీయులకు ఎంతో ఇష్టమైన ఇతిహాసం. ఈ గొప్ప కథను వెండితెరపై చూపించడానికి చాలామంది దర్శకులు ప్రయత్నించారు. అయితే ప్రతి ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీనికి మంచి ఉదాహరణ ప్రభాస్ నటించిన ఆదిపురుష్. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా చివరకు ప్రేక్షకులను నిరాశపరిచింది. మరోవైపు రణబీర్ కపూర్ నటించిన రామాయణ సినిమా మాత్రం విడుదలై పర్వాలేదు అనిపించుకుంటుంది.
నిజానికి ఈ రెండు సినిమాల కథ కూడా రాముడు, సీత చుట్టూనే తిరుగుతుంది. మరి ఒకే ఇతిహాసం ఆధారంగా వచ్చిన ఈ రెండు సినిమాల మధ్య అసలు తేడా ఏంటి.
మొదటిగా చెప్పుకోవాల్సింది కథను చూపించిన విధానం గురించి. ఆదిపురుష్ సినిమాను ఆధునిక విజువల్ స్టైల్‌లో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని పాత్రల రూపాలు, వాటిని చూపించిన విధానం ప్రేక్షకులకు నచ్చలేదు. ముఖ్యంగా రామాయణం వంటి గొప్ప ఇతిహాసాన్ని చూపించే విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు రామాయణ సినిమాలో కొత్త అంశాలను జోడిస్తూనే అసలు కథకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం వీఎఫ్ఎక్స్. ఇప్పుడు చిన్న చిన్న వీడియోల్లో కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ చూస్తున్నాం. అలాంటిది వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందించే సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తారు.
ఈ విషయంలో ఆదిపురుష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అదే సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. రామాయణం మాత్రం విజువల్ గ్రాండియర్ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కనిపించింది.
మొత్తం పైన రెండు సినిమాలు రామాయణం ఆధారంగానే వచ్చినా, వాటిని తెరకెక్కించిన విధానంలో తేడా ఉంది. అందుకే ఆదిపురుష్ సినిమాకి అన్ని విమర్శలు రాగా రామాయణ సినిమా మాత్రం కనీసం విమర్శలనుంచి తప్పించుకుంది.