• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైసన్ నాయుడు ఫస్ట్...

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

| బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట జానపద బీట్స్‌తో ఆకట్టుకుంటోంది. నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సోరట్ ఆలాపన, సురేష్ గంగుల లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీనివాస్ డాన్స్, జంట కెమిస్ట్రీ పాటకు హైలైట్‌గా నిలిచాయి.

By - M Prashanth
Update: 2026-11-06 16:03 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు సాగర్ కె చంద్ర కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ టైసన్ నాయుడు. పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ప్రమోషన్లు మొదలుపెడుతూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'మదరాసి రబ్బరు బొమ్మ' లిరికల్ సాంగ్‌ను వదిలారు. జానపద బాణీలతో మాస్ పాటలు కొట్టడంలో మంచి జోరు మీదున్న భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడంతో, ఈ సాంగ్ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ ముందు నుంచే ఉంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన ట్రాక్ పక్కా రూరల్ ఫోక్ స్టైల్‌లో అదిరిపోయే ఊపుతో సాగింది.




పాట మొదట్లోనే మంచి నాటు రిథమ్‌ హైలెట్ అయ్యింది. భీమ్స్ వాడే ట్రెడిషనల్ బీట్స్ ఇందులోనూ బాగా వినిపించాయి. ముఖ్యంగా 'మదరాసి రబ్బరు బొమ్మ' అనే హుక్ లైన్ సులువుగా గుర్తుండిపోయేలా ఉంది. వినగానే కాలు కదపాలనిపించే ఫాస్ట్ పేస్డ్ ట్యూన్ పాటకు మెయిన్ స్ట్రెంత్. ఆటోల్లో, ఫంక్షన్లలో మార్మోగే తరహాలో ఒక లోకల్ వైబ్‌ను క్రియేట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.

గాయకులు నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సోరట్ తమ గాత్రంతో పాటకు పక్కా నేటివిటీ తీసుకొచ్చారు. తెలంగాణ, రాయలసీమ జానపదాల మిక్స్ డ్ అనిపించే పల్లెటూరి యాసలో ఇద్దరూ పోటీపడి పాడారు. సురేష్ గంగుల రాసిన లిరిక్స్ పూర్తిగా చిలిపి సరసాలు, టీజింగ్ చేసేలా ఉన్నాయి. అబ్బాయి హీరోయిన్‌ను ఏడిపించడం, దానికి అమ్మాయి ఇచ్చే రివర్స్ పంచ్‌లు సరదాగా కుదిరాయి.

లిరికల్ వీడియోలో చూపించిన గ్లింప్స్ చూస్తుంటే స్క్రీన్ పై విజువల్స్ బాగానే కలర్‌ఫుల్‌గా ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ పంచెకట్టు లుక్‌లో తనదైన ఎనర్జీతో వేసిన డాన్స్ మూమెంట్స్ సాంగ్‌కు ఎట్రాక్షన్. ఆయన పక్కన నేహా శెట్టి సాంప్రదాయ చీరకట్టులో కనిపించి తన గ్లామర్‌తో స్క్రీన్ ప్రెజెన్స్ పెంచింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపై సరదాగా సాగేలా ఉంది.

భీమ్లా నాయక్ తర్వాత దర్శకుడు సాగర్ చంద్ర చేస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో ప్రాజెక్ట్‌పై ఒక రకమైన అంచనాలున్నాయి. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తోంది. మాస్ కథలకు ఆడియో ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ కోసం ఇలాంటి ఊపున్న ఫోక్ నంబర్‌ను ఎంచుకుని మేకర్స్ సేఫ్ గేమ్‌ ఆడారు. రాబోయే రోజుల్లో ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ సాంగ్ హైలెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓవరాల్‌గా చెప్పాలంటే 'మదరాసి రబ్బరు బొమ్మ' ఎలాంటి పెద్ద ప్రయోగాలు చేయకుండా, మాస్ ఆడియన్స్‌కు ఏం కావాలో అది డెలివర్ చేసిన డీసెంట్ సాంగ్. భీమ్స్ మార్క్ బీట్స్, క్యాచీ లిరిక్స్ సినిమాకు కావాల్సిన బజ్‌ను తీసుకొచ్చాయి. యూట్యూబ్‌లో రిలీజైన కొద్దిసేపట్లోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ ట్రాక్ జనాల్లోకి ఎంత బలంగా వెళ్తుందో చూడాలి.


Full View


Tags:    
  • tysonnaidu 
  • bellamkondasreenivas 
  • nehashetty 
  • madrasirabbarubomma 
  • bheemscicireleo 

Similar News

ప్రిన్స్ విలియం ముందు సైఫ్ అలీఖాన్ బోల్డ్ కామెంట్స్!

2026-11-19 05:36 GMT

కళ్ళుచెదిరే అందాలతో కియారా.. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న కూతురు!

2026-11-19 05:32 GMT

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

ట్రెండింగ్: స‌మంత త‌ర్వాత జెన్-Z లేడీ బాస్?

2026-11-19 05:01 GMT

8 కిలోల గజ్జెలతో శ్రద్ధా కపూర్ సాహ‌సం.. లావణి నృత్యం అంత క‌ష్ట‌మా?

2026-11-19 05:01 GMT

ఖ‌రీదైన ప‌చ్చ‌ల హారంతో మ‌హారాణినే త‌ల‌పించింది!

2026-11-19 05:01 GMT

టైసన్ నాయుడు టీజర్.. ఓల్డ్ సిటీలో ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్

2026-11-19 04:56 GMT

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

Copyright @2026

Powered by Blink CMS