• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైజాగ్ నుంచి హాలీవుడ్...

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

| సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజులు ఎంతో భయానకంగా ఉండేవని నటి శోభిత ధూళిపాళ గుర్తుచేసుకున్నారు. ఆడిషన్ల కోసం తిరగడం, సరైన మార్గదర్శకత్వం లేకపోవడం తనను భయపెట్టాయని తెలిపారు. పట్టుదలతో అవకాశాల కోసం ప్రయత్నించి ‘రామన్ రాఘవ్ 2.0’తో నటిగా పరిచయమయ్యారు. ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్’, ‘మంకీ మ్యాన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇతరుల ప్రశంసల కంటే ఆత్మవిశ్వాసమే కెరీర్‌కు ముఖ్యమని కొత్తవారికి సూచించారు.

By - Srikanth Kontham
Update: 2026-11-06 12:30 GMT

చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో రాణించడం ఎంతటి కఠినమైన ప్రయాణమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శోభిత ధూళిపాళ తాజాగా తొలిరోజుల కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఏటా ఎంతోమంది నూతన నటీనటులు గ్లామర్ ప్రపంచంలోకి ప్రవేశించాలని కలలు కంటున్నా? సరైన మార్గదర్శకత్వం లేని అవుట్‌సైడర్లకు పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లు చాలా భయానకంగా ఉంటాయన్నారు.

తనకు ఇండస్ట్రీలో సాయం చేయడానికి ఎలాంటి గాడ్‌ఫాదర్ లేదా గాడ్‌మదర్ లేరని, ఆ తొలి రోజుల అనిశ్చితి ఎంతో భయపెట్టిందని పేర్కొన్నారు. విశాఖపట్టణంలో పుట్టి పెరిగిన శోభిత, కాలేజీ చదువు కోసం ముంబైకి వెళ్లి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. ఆరంభంలో మ్యాగజైన్ కవర్ పేజీలపై తనను తాను చూసుకున్నప్పుడు, తనలాంటి సాధారణ నేపథ్యం ఉన్న వ్యక్తి ఈ ప్రపంచంలోకి ఎప్పటికీ వెళ్ళలేమేమోనని భావించినట్లు వెల్లడించారు. ఎలాంటి పరిచయాలు లేకుండా ఆడిషన్ల చుట్టూ తిరగడం, అవకాశాల కోసం ప్రయత్నించడం చాలా కష్టంతో కూడుకున్నదైందని తెలిపారు.

పరిశ్రమకు కొత్తగా వచ్చే వారికి సరైన సలహాలు ఇచ్చే వారు లేకపోవడం వల్ల తొలినాళ్ల ప్రయాణం ఎంతో భయానకంగా అనిపించిందని మనసులోని మాటను బయటపెట్టారు. అయితే పట్టుదలను వీడకుండా నిరంతరం ఆడిషన్లలో పాల్గొన్న శోభితకు చివరకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన `రామన్ రాఘవ్ 2.0` చిత్రంలో నటించే అదృష్టం లభించింది. ఈ సినిమాతోనే 2016లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడిచే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. అటుపై క్రమంగా ప్రతి అవకాశాన్ని లెర్నింగ్ బల్లలా మలుచుకుంటూ ముందుకు సాగారు. ఇండస్ట్రీలో ఏదైనా అద్భుతం జరిగినప్పుడు ప్రపంచమంతా ఒక సర్కస్ లాంటిదని.. మనమందరం సృజనాత్మక ఉన్మాదులమేనని తనకు అర్థమైందని సరదాగా వ్యాఖ్యానించారు.

కెరీర్ ముందుకు సాగుతున్న కొద్దీ ఎవరి నుంచి ఎలాంటి ప్రశంసలు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని తెలుసుకున్నట్లు శోభిత తెలిపారు. ఆత్మసాక్షాత్కారమే తనను మరింత స్వేచ్ఛగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా చేసిందని పేర్కొన్నారు. ఇతరుల అప్రూవల్ కోసం ఎదురుచూడటం మాని మనపై మనం నమ్మకం ఉంచితే కెరీర్‌లో ఎంతో ఆనందంగా రాణించొచ్చ‌ని.. అయితే దీనికి ఎంతో కృషి, మానసిక స్థైర్యం అవసరమని నూతన నటీనటులకు సూచించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంచుకున్న పాత్రలు శోభితను నటిగా మరింత ఉన్నత స్థాయికి చేర్చాయి.

విశ్వవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న `మేడ్ ఇన్ హెవెన్` వెబ్ సిరీస్ శోభిత‌కు ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. అటుపై తెలుగులో అడివి శేష్ సరసన `మేజర్`.. తమిళంలో మణిరత్నం తెరకెక్కించిన `పొన్నియిన్ సెల్వన్`, మలయాళంలో `కూరుప్` వంటి పలు భాషల్లో విభిన్న పాత్రలతో సత్తా చాటుకున్నారు. అలాగే గత ఏడాది హాలీవుడ్ స్టార్ దేవ్ పటేల్ దర్శకత్వంలో వచ్చిన `మంకీ మ్యాన్` చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలోనూ అడుగులు వేశారు. ప్రస్తుతం త‌మిళ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `వెట్టువం` కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags:    
  • sobhitadhulipala 
  • sobhita 
  • outsiderstruggles 
  • filmindustry 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS