ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!
| భారతీయ చిత్ర పరిశ్రమలో మొదటి లేడీ సూపర్‌స్టార్ గా చెరగని ముద్ర వేసిన శ్రీదేవి నటనా వైదుష్యం, అందం, అభినయం తరాలు మారినా సరికొత్త వెలుగులు నింపుతూనే ఉన్నాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలో మొదటి లేడీ సూపర్‌స్టార్ గా చెరగని ముద్ర వేసిన శ్రీదేవి నటనా వైదుష్యం, అందం, అభినయం తరాలు మారినా సరికొత్త వెలుగులు నింపుతూనే ఉన్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లో అగ్ర కథానాయకిగా ఏకఛత్రాధిపత్యం వహించిన శ్రీదేవి నేటితరం కథానాయికలకు నిత్య స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు. భాషలతో సంబంధం లేకుండా వెండితెరపై మెరుస్తోన్న ఎందరో ఫేమస్ హీరోయిన్లు తమ కెరీర్‌కు శ్రీదేవినే ప్రధాన ఆదర్శంగా భావిస్తుండటం అతిలోక సుందరి లెగసీకి నిదర్శనం.
శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రతి అడుగులోనూ మామ్ ఉన్నారు. `దేవర`, `పెద్ది` వంటి భారీ పాన్-ఇండియా చిత్రంతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ డ్యాన్స్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ , నటనలో తల్లి అడుగుజాడలను అనుసరిస్తున్నానని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. హ్యాలోవీన్ వేడుకల్లో `నగీనా` ఐకానిక్ లుక్‌ను రీక్రియేట్ చేయడం నుంచి `చాందిని` తరహా చీరకట్టు వరకు జాన్వీ ప్రతి లుక్‌లోనూ శ్రీదేవి అందించిన స్ఫూర్తిని గర్వంగా ప్రదర్శిస్తారు.
కూమార్తె గానే కాదు. నేటి పాన్-ఇండియా సెన్సేషన్స్ అయిన రష్మిక మందన్నా, తమన్నా భాటియా, సమంత వంటి స్టార్ హీరోయిన్లు కూడా శ్రీదేవి నటన చూసే పెరిగామని బహిరంగంగానే వెల్లడించారు. గ్లామరస్ పాత్రల్లో మెరుస్తూనే నటనకు ప్రాధాన్యమున్న రోల్స్‌ను సమర్థవంతంగా పోషించడం, గ్రేస్-క్యూట్‌నెస్ కలగలిపిన ఎక్స్‌ప్రెషన్స్ పండించడంలో శ్రీదేవి చూపించిన వైవిధ్యమే తమకు పాఠ్యాంశమని కొనియాడారు.
అలాగే నేటితరం యంగ్ అండ్ ప్రామిసింగ్ నటీమణులు సైతం తమ సినీ ప్రయాణానికి శ్రీదేవినే మూలస్తంభంగా పేర్కొంటున్నారు. ఇటీవల `దొంగ నా కొడుకు` చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసిన సుస్మితా శెట్టితో పాటు అనేకమంది వర్ధమాన నటీమణులు.. చిన్నతనం నుంచే శ్రీదేవి డ్యాన్స్, హావభావాలు చూసి స్ఫూర్తి పొంది ఇండస్ట్రీలోకి వచ్చామన్నారు. నటనలో ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎంత కీలకమో? శ్రీదేవి సినిమాలే తమకు నేర్పించాయని చెబుతుంటారు.
శ్రీదేవి ప్రత్యేకత కేవలం ఆమె అందంలోనే లేదు. కామెడీ టైమింగ్, డ్రామా, యాక్షన్, క్లాసికల్ డ్యాన్స్ ఇలా ఏ రసానైనా లీనమై నటించగలగడంలో ఉంది. నేటి హీరోయిన్లు కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు ఎంచుకునేటప్పుడు శ్రీదేవి నటించిన `మూండ్రం పిరై`, `16 వయసునిలే`, `మిస్టర్ ఇండియా`, `చాల్‌బాజ్`, `క్షణ క్షణం`, `ఇంగ్లీష్ వింగ్లీష్` వంటి చిత్రాలనే రోల్ మోడల్స్‌గా తీసుకుంటున్నారు. మల్టీ-ల్యాంగ్వేజ్ స్టార్‌గా ఎదగడానికి ఆమె వేసిన బాటనే నేటి హీరోయిన్లందరికీ దిశానిర్దేశం చేస్తోంది.
చివరిగా కాలాలు మారినా? కొత్త టాలెంట్ ఇండస్ట్రీలోకి ఎంతమంది వచ్చినా ? లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి స్థానం సుస్థిరమైనది. మామ్ అందించిన వారసత్వం, నటనలోని నైపుణ్యం నేటి తరం హీరోయిన్లకు నిరంతరం మార్గ దర్శిగా నిలుస్తూనే ఉంది. భారతీయ సినిమా ఉన్నంత కాలం ప్రతి తరంలోని హీరోయిన్లకు శ్రీదేవి ఒక ఐకాన్, ఒక చెరగని స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు.