• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆదిపురుష్, రామాయణం.. తేడా...

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

| ప్రభాస్ 'ఆదిపురుష్', రణబీర్ కపూర్ నటించిన కొత్త 'రామాయణం' సినిమాల మధ్య పోలికలు చర్చకు వస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, జటాయువు పోరాటం, యశ్ రావణుడి గెటప్‌కు కొత్త సినిమాపై ప్రశంసలు వస్తున్నాయి. అయితే పాటలు, సీతారాముల భావోద్వేగాలు ఆశించిన స్థాయిలో లేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూడు గంటలకు పైగా నిడివిపై కూడా కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

By - M Prashanth
Update: 2026-11-06 04:06 GMT

ప్రభాస్ 'ఆదిపురుష్' విడుదలైనప్పుడు ఆ సినిమాపై వచ్చిన విమర్శలు అంత సులభంగా మర్చిపోయేవి కావు. రామాయణం లాంటి గొప్ప కథను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో రణబీర్ కపూర్‌తో మరో రామాయణం తీస్తున్నారనగానే కొందరిలో అనుమానాలు మొదలయ్యాయి. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కించిన 'రామాయణం' చూసిన తర్వాత రెండు సినిమాల మధ్య తేడా గురించి కామెంట్స్ వస్తున్నాయి.

'ఆదిపురుష్'లో రావణుడి గెటప్, లంకను చూపించిన విధానం, యుద్ధ సన్నివేశాలపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. కానీ కొత్త 'రామాయణం'లో ఆ స్థాయిలో విజువల్స్‌పై విమర్శలు కనిపించడం లేదు. పైగా డీఎన్ఈజీ, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ చేసిన వీఎఫ్ఎక్స్ వర్క్ కి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా జటాయువు పోరాటాన్ని తెరకెక్కించిన విధానం గురించి ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో 'ఆదిపురుష్' కంటే కొత్త సినిమా చాలా మెరుగ్గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే పాటల విషయానికొస్తే పరిస్థితి తారుమారైంది. 'ఆదిపురుష్' సినిమా ఫలితం ఎలా ఉన్నా అజయ్ అతుల్ అందించిన సంగీతానికి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా 'జై శ్రీరామ్', 'రామ్ సీతా రామ్' పాటలు విడుదలకు ముందే ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లాయి. సినిమా మీద విమర్శలు వచ్చిన తర్వాత కూడా ఆ పాటలకు గుర్తింపు తగ్గలేదు. కానీ 'రామాయణం' కోసం ఏఆర్ రెహమాన్ పనిచేసినా పాటలు ఆ స్థాయిలో హైలైట్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక పాత్రల ఎంపికలోనూ రెండు సినిమాలను పోలుస్తున్నారు. 'ఆదిపురుష్'లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. కొత్త సినిమాలో ఆ పాత్రలను రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ పోషించారు. ముఖ్యంగా రావణుడి గెటప్ విషయంలో సైఫ్ ఎదుర్కొన్న విమర్శలకు భిన్నంగా యశ్‌కు ప్రశంసలు వస్తున్నాయి. రణబీర్ నటనకు కూడా మంచి రెస్పాన్స్ ఉండగా, సీతారాముల మధ్య భావోద్వేగాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

'ఆదిపురుష్'లో రామాయణ కథను ఒకే చిత్రంగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ నితీశ్ తివారీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దీంతో జటాయువు పోరాటం వంటి చిన్న ఘట్టాలకు కూడా ఎక్కువ సమయం కేటాయించే అవకాశం దొరికింది. అయితే ఈ నిర్ణయంతో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తున్నాయని, మూడు గంటలకు పైగా నిడివి కూడా ఇబ్బందేనని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. 'ఆదిపురుష్'కు మరో పెద్ద సమస్య డైలాగ్స్ విషయంలో ఎదురైంది. కొన్ని డైలాగులపై వివాదం రావడంతో మేకర్స్ వాటిని మార్చాల్సి వచ్చింది. కొత్త 'రామాయణం'లో మాత్రం అలాంటి వివాదం లేదు. తెలుగు వెర్షన్‌కు ఆకెళ్ళ శివప్రసాద్ అందించిన మాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.

Tags:    
  • ramayana 
  • adipurush 
  • prabhas 
  • ranbirkapoor 
  • yash 
  • saipallavi 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS