• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనిల్ రావిపూడి.. ఈసారి...

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

| అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న 'జనవరి 12 విడుదల'లో భారీ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం కజకిస్థాన్‌లో రియల్ సతీష్ ఆధ్వర్యంలో ఈ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By - M Prashanth
Update: 2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా వెంకటేష్‌తో ఆయన తీసిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బాగా వర్కవుట్ అయింది. అయితే ఇప్పుడు 'జనవరి 12 విడుదల' కోసం అనిల్ మరో సర్ ప్రైజ్ రెడీ చేస్తున్నాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా కజకిస్థాన్‌లో షూటింగ్ చేస్తుండటం విశేషం.

నిజానికి అనిల్ సినిమాల్లో యాక్షన్ కొత్తేమీ కాదు. 'పటాస్', 'సరిలేరు నీకెవ్వరు' లాంటి చిత్రాల్లో ఫైట్స్‌కు మంచి స్పేస్ ఇచ్చారు. కానీ వెంకటేష్‌తో చేసిన 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల్లో కామెడీకే ఎక్కువ స్కోప్ ఇచ్చారు. ఇప్పుడు అదే హీరోతో మరో సినిమా చేస్తూ కళ్యాణ్ రామ్‌ను కూడా కలిపి యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు. ఈసారి ఇద్దరు హీరోలతో అనిల్ ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తారనేది చూడాలి.

ప్రస్తుతం కజకిస్థాన్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో స్టంట్ మాస్టర్ రియల్ సతీష్ ఆధ్వర్యంలో భారీ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఈ సన్నివేశంలో పాల్గొంటున్నారు. అక్కడి కొండలు, మంచు ప్రాంతాలను ఉపయోగించుకుని యాక్షన్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ వింటర్ లుక్స్‌లో వీడియోలు ఫొటోలు కూడా బయటకొచ్చాయి.

మరోవైపు ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావాబావమరుదులుగా నటిస్తున్నారు. ఈ బంధం చుట్టూ కామెడీ నడిపిస్తూనే ఇద్దరినీ ఒకే యాక్షన్ ఎపిసోడ్‌లో చూపించనున్నారు. పైగా కళ్యాణ్ రామ్‌తోనే 'పటాస్' ద్వారా దర్శకుడిగా పరిచయమైన అనిల్, ఇన్నేళ్ల తర్వాత ఆయనను వెంకీతో కలిపి మల్టీస్టారర్ చేస్తున్నారు.

ఇక కజకిస్థాన్‌లో ఫైట్‌తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గతంలో అనిల్ సినిమాల్లో పాటలు, కామెడీ ఎక్కువగా ఇండోర్ సెట్స్, ఫ్యామిలీ నేపథ్యంలో కనిపించేవి. ఇప్పుడు విదేశీ లొకేషన్లను కూడా ఉపయోగించుకుంటూ సినిమా మేకింగ్‌లో కొంత మార్పు చూపిస్తున్నారు.

సాహు గారపాటి నిర్మిస్తున్న 'జనవరి 12 విడుదల'ను 2027 సంక్రాంతికి తీసుకురానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసరాల్లో ప్రధాన చిత్రీకరణ పూర్తయింది. కజకిస్థాన్ షెడ్యూల్ తర్వాత కొద్దిపాటి షూటింగ్ పనులు మిగిలి ఉండగా, నవంబర్ చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో పాటలతో ప్రమోషన్లు స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.


#January12Vidudala షూటింగ్ కజకిస్థాన్‌లో జోరుగా సాగుతోంది. విక్టరీ #Venkatesh #Nandamurikalyanram పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ గ్రాండ్ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. #AnilRavipudi #TeluguCinema #Tollywood #Tupaki Follow👉 @tupaki_official https://t.co/xo4RQKF8Du

— Tupaki (@tupaki_official) November 5, 2026


Tags:    
  • venkatesh 
  • kalyanram 
  • january12vidudala 
  • anilravipudi 
  • kazakhstanshooting 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS