• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RC17: హీరో.....

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

| రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17పై ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా, రిషికాంత్ విలన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి, 2028లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-05 16:15 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17 ఒకటి. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల కావడంతో కథ, జానర్ గురించి అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.

రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చరణ్..ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మరోసారి కొత్త పాత్రలో కనిపించి తప్పకుండా మెప్పిస్తారు అన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. సుకుమార్ ఈ సినిమాను కూడా తనదైన శైలిలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

ఇక ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ హైలైట్ గా ఉండబోతోంది అన్న వార్త కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రంలో హీరోయిన్గా అలానే విలన్ గా ఎవరినైతే ఇస్తారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. RC17 హీరోయిన్ విషయంలో ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఆ సినిమా విడుదల కాకముందే.. రామ్ చరణ్ సరసన నటించే అవకాశం ఆమెకు దక్కిందనే వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోపక్క ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం రిషికాంత్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన RC17లో విలన్‌గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ సినిమాల్లో విలన్ పాత్రలకు మంచి గుర్తింపు ఉంటుంది. అందుకే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా పెరుగుతోంది.

RC17 షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ సినిమాను 2028లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    
  • ramcharan 
  • rc17 
  • sukumar 
  • satvikaveeravalli 
  • tollywood 
  • rishikanth 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS