బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ
| ‘అర్జున్ రెడ్డి’తో గుర్తింపు తెచ్చుకున్న శాలిని పాండే తన సరికొత్త స్లిమ్ లుక్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇటీవల ఆమె షేర్ చేసిన డిజైనర్ ఫోటోషూట్ చిత్రాలు వైరల్‌గా మారాయి. అభిమానులు ఆమె గ్లామర్‌ను ప్రశంసిస్తున్నారు. ‘మహానటి’, ‘118’, ‘నిశ్శబ్దం’, ‘జయేశ్‌భాయ్ జోర్దార్’, ‘మహారాజ్’ వంటి చిత్రాల్లో నటించిన శాలిని ప్రస్తుతం విభిన్న పాత్రలతో తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన `అర్జున్ రెడ్డి` చిత్రంలో బొద్దుగా, అమాయకమైన చూపులతో లవ్లీ `ప్రీతి శెట్టి`గా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన శాలిని పాండే ఇప్పుడు గ్లామర్ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. నాడు బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ చూపించిన సైజ్ జీరో స్పూర్తితో తీవ్రంగా శ్రమించిన ఈ బ్యూటీ, బాగా స్లిమ్ అయి సరికొత్త జీరో సైజ్ అవతారంలోకి మారిపోయింది. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన డిజైనర్ డ్రెస్ ఫోటోషూట్‌లో శాలిని అందం కవ్విస్తూ.. ట్రెండీ గ్లామర్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
ఈ సరికొత్త ఫోటోషూట్ కోసం స్టైలిస్టులు గౌర్వి దేశాయ్, నూపుర్ అభయ్ పధ్యే, హెయిర్ స్టైలిస్ట్ ప్రతీక్ష ముచండికర్, మేకప్ ఆర్టిస్ట్ సిమువా, ఫోటోగ్రాఫర్ ప్రిషా చందేల బృందం కలిసి పనిచేసింది. ఈ ఫోటోలకు శాలిని సింపుల్‌గా వర్ణనగా సింబాలిక్‌గా ఎమోజీలను క్యాప్షన్‌గా జోడించింది. కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారిన ఈ పోస్ట్ కామెంట్ సెక్షన్లో అభిమానులు ఫైర్, హార్ట్ ఎమోజీలతో ప్రశంసల వర్షం కురిపించారు.``అందానికి ఒక పేరు ఉంటే అది కచ్చితంగా నీదే`` అంటూ నెటిజన్లు శాలిని స్టైలింగ్‌ను కొనియాడుతున్నారు.
అందమైన ప్రశంసలతో పాటు.. శాలిని నటించిన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కొన్ని కామెడీ డైలాగ్‌లు కూడా కామెంట్స్‌లో రీసౌండ్ చేస్తున్నాయి. ప్రత్యేకించి ``దేఖో పాపా మైనే క్యా ఉగాయా హై.. గంజా పాపా గంజా`` అనే పాపులర్ డైలాగ్‌ను గుర్తుచేసుకుంటూ.. ఆ సీన్‌తోనే తాము శాలినికి వీరాభిమానులుగా మారామని పలువురు నెటిజనులు కామెంట్లు చేశారు. మొత్తానికి.. ఈ పోస్ట్ శాలిని పాండే ఫ్యాషన్ సెన్స్, మోడర్న్ గ్లామర్ ..స్లిమ్ లుక్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరోసారి చాటిచెప్పడమే కాకుండా.. సోషల్ మీడియాలో ఈ యంగ్ బ్యూటీకి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను ప్రతిబింబిస్తోంది.
కెరీర్ ప్రయాణం - మైలురాళ్లు:
2017లో విజయ్ దేవరకొండ సరసన నటించిన `అర్జున్ రెడ్డి` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న శాలిని పాండే.. ఆ తర్వాత భిన్నమైన పాత్రలను ఎంచుకుంది. `మహానటి`లో సుశీల పాత్రలో.. కల్యాణ్ రామ్ సరసన 118 అనే హిట్ మూవీలో `మేఘ`గా, అలాగే `ఎన్.టి.ఆర్. కథానాయకుడు`, `ఇద్దరి లోకం ఒకటే`, .. అనుష్క శెట్టి ద్విభాషా చిత్రం `నిశ్శబ్దం`లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. అనంతరం తమిళంలో 100శాతం కాదల్, గోరిల్లా చిత్రాలతో అడుగుపెట్టి.. రణ్వీర్ సింగ్ సరసన `జయేశ్‌భాయ్ జోర్దార్ (2022)` చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఓటీటీ మూవీ `మహారాజ్ (2024)` లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం శాలిని పాండే కెరీర్ ఎలా ఉంది? రేసులో వెనకబడిందా?
తొలి సినిమా `అర్జున్ రెడ్డి` సాధించిన భారీ విజయం తర్వాత శాలిని పాండే టాలీవుడ్లో హీరోయిన్గా వరుస ఆఫర్లు అందుకుంది. కానీ బాలీవుడ్ లో బిజీ అయ్యాక తెలుగులో కొంతవరకు వెనకబడినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌లు చేయలేకపోయినా.. సౌత్ నుండి బాలీవుడ్ వరకు కథాబలం ఉన్న విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తన ఉనికిని చాటుకుంటోంది. ప్రస్తుతం సరికొత్త జీరో సైజ్ మేకోవర్‌తో మరింత గ్లామరస్‌గా తయారైన శాలిని పాండే.. మళ్లీ మునుపటి జోరు అందుకుంటుందో లేదో చూడాలి.