• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భార్య 10PM అల‌వాటుకు అగ్ర...

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

| బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాత్రి 10 గంటల తర్వాత కరీనా ఎవరితోనూ మాట్లాడదని సైఫ్ వెల్లడించారు. మొదట్లో ఆమె మౌనంగా ఉంటే తానే ఏదైనా తప్పు చేశానా అని కంగారు పడేవాడినని సరదాగా చెప్పారు. అది తన వ్యక్తిగత విశ్రాంతి సమయమని కరీనా వివరించారు. ఉదయం మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉంటానని తెలిపారు.

By - Sivaji Kontham
Update: 2026-11-06 01:44 GMT

ఈ న‌టికి రాత్రి 10 అయితే ఆ అల‌వాటు ఉంది.. కానీ అది భ‌ర్త‌కు విచిత్రంగా క‌నిపించేది. స‌ద‌రు హీరో త‌న‌లో తానే మ‌ద‌న‌ప‌డిపోయేవాడు. నిద్ర ప‌ట్ట‌క క‌న్ఫ్యూజ‌న్ లో ఉండేవాడ‌ట‌. ఇంత‌కీ ఎవ‌రు ఈ సెల‌బ్రిటీ క‌పుల్? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

బాలీవుడ్ స్టార్ క‌పుల్ సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ జంట గురించే ఇదంతా. ఇటీవల స్ట్రీమింగ్ అయిన `కాఫీ విత్ కరణ్ సీజన్ 9`లో ఈ జంట సందడి ప్ర‌ధానంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. సుమారు 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఈ పాపులర్ సెలబ్రిటీ చాట్ షోలో కనిపించడం విశేషం. అంతేకాకుండా.. కాఫీ విత్ కరణ్ చరిత్రలోనే రెండుసార్లు (మొదటిసారి 2010లో సీజన్ 3 లో) జంటగా పాల్గొన్న ఏకైక దంపతులుగా వీరు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ఈ ఎపిసోడ్‌లో సైఫ్ తన భార్య కరీనా ఇంట్లో అనుసరించే ఒక విచిత్రమైన అలవాటు గురించి సరదాగా బయటపెట్టారు. రాత్రి 10 గంటలు దాటి పడక గదిలోకి వెళ్లిన తర్వాత కరీనా ఎవరితోనూ మాట్లాడదని.. అది ఆమె స్వయంగా పెట్టుకున్న కఠినమైన నిబంధన అని సైఫ్ వెల్లడించారు. ``త‌న రాత్రి 10 గంటల రూల్ గురించి నాకు మొదట్లో తెలీదు. తను హఠాత్తుగా మౌనంగా ఉండిపోతే నేను ఏమైనా తప్పు చేశానా.. ఎందుకు మాట్లాడటం లేదని కంగారు పడేవాడిని. అది ఆమె పర్సనల్ టైమ్ అని తెలుసుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది`` అని సైఫ్ సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చారు.

సైఫ్ వ్యాఖ్యలపై బెబో కరీనా కపూర్ కూడా అంతే స‌ర‌దాగా స్పందించారు. రాత్రి 10 దాటాక మాట్లాడకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ, ``అది నా పర్సనల్ డౌన్‌టైమ్ (విశ్రాంతి సమయం)`` అని స్పష్టం చేశారు. అయితే రాత్రి వేళ మౌనంగా ఉండే కరీనా... ఉదయం పూట దానికి పూర్తి భిన్నంగా అత్యంత ఉత్సాహంగా ఉంటుందని సైఫ్ తెలిపారు. ``పొద్దున్నే లేవగానే కరీనాలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఫోన్లలో మాట్లాడుతూ.. నా దగ్గరకు వచ్చి విశేషాలన్నీ చెబుతుంటుంది`` అని సైఫ్ అనగా, ``నేను రోజంతా జరిగిన బాలీవుడ్ గాసిప్స్ ఇస్తుంటే ఆయన అసలు వినరు`` అని కరీనా నవ్వుతూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే... కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్ జంట మధ్య ఉన్న వయస్సు వ్యత్యాసం వారి బంధానికి ఎప్పుడూ అడ్డుగోడగా మారలేదు. తమదైన లైఫ్‌స్టైల్‌తో వీరు హిందీ చిత్రసీమలో ఒక ఆదర్శవంతమైన జంటగా అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. గతంలో సైఫ్‌పై జరిగిన కత్తి దాడి ఘటన సమయంలో సోషల్ మీడియాలో, బయటా రకరకాల రూమర్లు, వివాదాస్పద థియరీలు ప్రచారంలోకి వచ్చినా.. వాట‌న్నిటినీ పటాపంచలు చేస్తూ ఈ దంపతులు ఒకరికొకరు కొండంత అండగా నిలబడ్డారు.

సుమారు 14 ఏళ్లకు పైగా వివాహ బంధంలో ఎంతో సంతోషంగా గడిపిన‌ ఈ దంపతులకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట తమ తమ సినిమాలతో విధుల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు పిల్లల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఎంతటి వివాదాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడుతూ.. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ బాలీవుడ్‌లోనే మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ లవింగ్ కపుల్‌గా తమ లైఫ్‌ను ముందుకు నడిపిస్తున్నారు.

Tags:    
  • kareenakapoor 
  • saifalikhan 
  • coffeewithkaran 
  • bollywoodcouple 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS