• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజినీకాంత్ వల్ల తెలుగు...

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

| రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RAPO23 సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 2026 డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 40 శాతం మాత్రమే పూర్తయినట్లు సమాచారం. రజినీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ కీలక పాత్ర పోషిస్తుండటం కూడా ఆలస్యానికి కారణమని ప్రచారం జరుగుతోంది. విడుదల వాయిదా పడితే 2027లో రామ్ నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-06 01:30 GMT

టాలీవుడ్‌లో ఒకప్పుడు లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని.. ప్రస్తుతం వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ హీరోకి ఇప్పుడు ఒక మంచి విజయం చాలా అవసరం. ఇటీవల విడుదలైన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా మంచి రివ్యూలు తెచ్చుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో సత్తా చూపించలేకపోయింది.

దీంతో రామ్ తన తదుపరి సినిమాలపై మరింత దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తున్న RAPO23 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్ పోతినేని తొలిసారి దర్శకత్వం వహిస్తున్న RAPO23 సినిమాను 2026 డిసెంబర్‌లో విడుదల చేయాలని ముందుగా భావించారు. కానీ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేవలం 40 శాతం మాత్రమే పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కావడం కష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఆలస్యం కావడానికి సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్ సినిమా కూడా ఒక కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే రజినీకాంత్ సినిమాతో రామ్‌కు వచ్చిన ఈ అవకాశం ఇప్పుడు ఆయన సొంత సినిమా షూటింగ్‌పై ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కానీ నిజమై..RAPO23 సినిమా విడుదల వాయిదా పడితే, రామ్ పోతినేని నుంచి 2027లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒకవైపు రజినీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పాత్రపై ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న RAPO23 కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. వరస పరాజయాల్లో ఉన్న రామ్ కి ఈ వరస సినిమాలు ఎలాంటి విజయాన్ని సాధించి పెడతాయో.. చూడాలి.

Tags:    
  • rampothineni 
  • rapo23 
  • tollywood 
  • telugucinema 
  • dharman 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS