• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టికెట్ రేట్ల వివాదం:...

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

| తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలకు టికెట్ ధరలు భారీగా పెంచుతుండగా, తమిళనాడులో మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరలను నియంత్రిస్తున్నారు. సాధారణ టికెట్ ధరలతో విడుదలైన 'ఇరుముడి', 'మా ఇంటి బంగారం', 'లెనిన్' చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. అందుబాటు ధరలతో ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని ఈ సినిమాలు నిరూపించాయి.

By - Srikanth Kontham
Update: 2026-11-05 19:30 GMT

సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయకుడి సినిమా వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు అనేది సాధారణ ప్రక్రియగా మారిపోయింది. ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని మొదటి వారం లేదా పది రోజుల పాటు సామాన్యుడికి అందుబాటులో లేనంతగా ధరలను పెంచడం టాలీవుడ్‌లో ఆనవాయితీగా మారింది. అయితే పొరుగునున్న తమిళనాడులో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీ యాంశమవుతోంది. తమిళనాడు ప్రభుత్వం పెద్ద సినిమాలకు అభిమానుల కోసం తెల్లవారుజామున లేదా అదనపు షోలు వేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నా? టికెట్ ధరల పరిమితిపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది.

ఎంత పెద్ద సూపర్‌స్టార్ సినిమా అయినా ప్రభుత్వ నిబంధనలకు లోబడే టికెట్ ధరలు ఉండాలనే నిబంధనను అక్కడ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులు ఎలాంటి జంకు లేకుండా థియేటర్లకు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ టికెట్ ధరల కారణంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఒక కుటుంబం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే టికెట్లకే వేల రూపాయలు ఖర్చవుతుండటంతో చాలామంది కొన్ని వారాలు వేచి చూసి ఓటీటీలలో చూడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇది లాంగ్ రన్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సాధారణ టికెట్ ధరలతో విడుదలైన `ఇరుముడి`, `మా ఇంటి బంగారం`, `లెనిన్` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయాలు సరికొత్త ఆలోచనకు నాంది పలికాయి. ఎలాంటి అధనపు భారం లేకుండా రీజనబుల్ ధరలకే టికెట్లు అందుబాటులో ఉంచడంతో ఈ సినిమాలకు ఊహించని స్థాయిలో రిపీట్ ఆడియన్స్ లభించారు.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో ఈ చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టగలిగాయి. తక్కువ ధరలతో ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చనే విషయాన్ని ఈ సినిమాలు ప్రత్యక్షంగా నిరూపించాయి. టికెట్ ధరలు అందుబాటులో ఉంటేనే ప్రేక్షకులు పదే పదే థియేటర్లకు వస్తారని.. దీనివల్ల రన్ టైమ్ పెరగడమే కాకుండా థియేటర్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్లకు సుదీర్ఘకాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఈ విజయాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏది ఏమైనా టికెట్ రేట్ల పెంపు మాత్రమే లాభాలకు మార్గం కాదని తమిళనాడు తరహా విధానం లేదా సాధారణ ధరల వ్యూహమే పరిశ్రమ ఆరోగ్యానికి మంచిదని తాజా పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు, పంపిణీదారులు ఇకనైనా ఈ విషయాన్ని గుర్తించి టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేలా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    
  • telugucinema 
  • ticketprices 
  • tamilnadu 
  • tollywood 
  • boxoffice 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS