• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరిచిపోతున్న సినిమాకి...

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

| చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా విడుదల మరోసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రూ.270 కోట్లకు పైగా బడ్జెట్ చేరిన ఈ చిత్రానికి ప్రత్యేక హైలైట్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నప్పటికీ, చిరంజీవి మరో సినిమా ‘కాకా’ కూడా అదే సమయంలో విడుదలకు సిద్ధమవుతుండటంతో రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-06 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో అడుగుపెట్టిన తర్వాత ఈ మధ్యనే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరంజీవి, ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఆయన తదుపరి సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విశ్వంభర సినిమా విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.

చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర మొదట్లో భారీ అంచనాలను అందుకుంది. కానీ సినిమా విడుదల ఆలస్యం కావడం, స్క్రిప్ట్ విషయంలో వచ్చిన రూమర్లు, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తికాకపోవడం వంటి కారణాలతో ఈ సినిమాపై ఆసక్తి చాలా వరకు తగ్గిపోయింది.

ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం సినిమా వీఎఫ్ఎక్స్, డీఐ పనులు ఒకేసారి జరుగుతున్నాయి. ఈ చిత్ర బడ్జెట్ ఇప్పటికే రూ.270 కోట్లకు పైగా చేరినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన హైలైట్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు రావడం మరింత ఆశ్చర్యపరుస్తున్నాయి.. అయితే ఈ పాట షూటింగ్‌లో చిరంజీవి పాల్గొనరని తెలుస్తోంది. ఈ పాట సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్త వినిపిస్తోంది.

కానీ ఇప్పటికే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరో పాటను జోడించడం అవసరమా అనే ఆలోచన అందరిలో వస్తోంది. సినిమా విడుదల ఆలస్యం కావడంతో అభిమానుల్లో ఉన్న ఆసక్తిని తిరిగి పెంచడం మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారింది.

అంతేకాకుండా విశ్వంభరను 2027 ప్రారంభంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు వార్త చెక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా సంక్రాంతి 2027 విడుదలపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి మరో సినిమా కాకా కూడా అదే సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది.

కాకా సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశ్వంభరను సంక్రాంతికి తీసుకురావాలా? లేక మరికొంత సమయం తీసుకుని విడుదల చేయాలా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయినా అసలు ఎంత చేసినా ప్రస్తుతం అంచనాలు రాని విశ్వంభరా సినిమా కోసం మళ్లీ బడ్జెట్ పెట్టడం ఎందుకు.. మరో పక్క కాకా సినిమా సంక్రాంతి తేదీని దీనికి త్యాగం చేయడం ఎందుకు అని మెగా అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • chiranjeevi 
  • vishwambhara 
  • megastar 
  • tollywood 
  • specialsong 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS