• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెద్ద సినిమాలకు మాత్రమే...

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

| సినిమా నిర్మాణంలో పక్కా ప్రణాళిక ఎంత ముఖ్యమో తరుణ్ భాస్కర్ మరోసారి చూపిస్తున్నారు. ENE Repeat షూటింగ్‌కు ముందే ప్రతి సీన్, నటీనటులు, కెమెరా యాంగిల్స్, లెన్స్ వివరాలతో ప్రత్యేకంగా పుస్తకాలు సిద్ధం చేసుకున్నారు. ఆయన ప్రిపరేషన్‌పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల దర్శకులు కూడా ఇలాంటి ముందస్తు ప్రణాళిక పాటిస్తే రీషూట్లు, అనవసర ఖర్చులు తగ్గి నిర్మాతలకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-05 09:58 GMT

సినిమా చిన్నదైనా, పెద్దదైనా ప్రేక్షకులను మెప్పించాలంటే ముందుగా సరైన ప్రణాళిక ఉండాలి. కథ నుంచి షూటింగ్ వరకు ప్రతి విషయం పక్కాగా సిద్ధం చేసుకోవాలి. కానీ ప్రస్తుతం కొన్ని భారీ బడ్జెట్ సినిమాల విషయంలో కనిపిస్తున్న నిర్లక్ష్యం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే సమయంలో చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రం ఎంతో జాగ్రత్తగా తెరకెక్కుతున్నాయి.

దీనికి తాజాగా తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న ENE Repeat సినిమా మంచి ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం తరుణ్ భాస్కర్ చేసిన ప్రిపరేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారంట. షూటింగ్‌కు వెళ్లే ముందే ప్రతి సన్నివేశం ఎలా తీయాలి అనే విషయంపై పూర్తి స్థాయిలో ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని సిద్ధం చేశారు. అందులో ప్రతి సీన్ ఎలా షూట్ చేయాలి, ఏ నటీనటులు పాల్గొంటారు, కెమెరా యాంగిల్స్ ఎలా ఉండాలి, ఏ లెన్స్ ఉపయోగించాలి అనే వివరాలను పొందుపరిచారు.

తరుణ్ భాస్కర్ చేసిన ఈ ప్రయత్నాన్ని చూసి చాలామంది ఆయన సిద్ధం చేసిన పుస్తకాలను.. ఒకచోట చేర్చి ఫిల్మ్ మేకింగ్ గైడ్‌గా ప్రచురిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు చేసే దర్శకులు కూడా ఇలాంటి ప్రణాళికను పాటించాలి. పెద్ద సినిమాలకు ఎక్కువ సమయం, డబ్బు ఖర్చవుతున్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం. కథలో లోపాలు ఉన్నా, షూటింగ్‌లో ప్రణాళిక లేకపోయినా చివరకు నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.

సినిమా బడ్జెట్ ఎంత పెద్దదైనా, చిన్నదైనా ప్రేక్షకులకు మంచి సినిమా అందించడమే అసలు లక్ష్యం. చిన్న సినిమాలు ఇంత జాగ్రత్తగా తెరకెక్కుతున్నప్పుడు పెద్ద సినిమాల విషయంలో నిర్లక్ష్యం ఎందుకు అనేది చాలామందికి ఉన్న ప్రశ్న. ఎంతో పెద్ద బడ్జెట్ తో వస్తున్న సినిమాలో కూడా ఇప్పటికీ.. సగం సినిమా పూర్తయిన తర్వాత అయోమయంలో పడుతూ మళ్లీ రీ షూట్ లు కూడా చేసుకుంటూ ఉన్నారు. అదే నిర్లక్ష్యం లేకుండా మొత్తం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే.. పెద్ద సినిమాల నిర్మాతలకి కూడా చాలా మేలు చేసిన వాళ్లు అవుతారు.

Tags:    
  • tarunbhascker 
  • enerepeat 
  • tollywood 
  • filmmaking 
  • preproduction 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS