• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల...

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

| ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’ వంటి హిట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీనువైట్ల.. వరుస పరాజయాలతో కొంతకాలంగా ఫామ్ కోల్పోయారు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘జార్జ్ క్రిష్’తో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. పాత కామెడీ ఫార్ములాకు భిన్నంగా రెట్రో, మాస్ ఎలిమెంట్స్‌తో న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రం శ్రీనువైట్లకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

By - Sivaji Kontham
Update: 2026-11-05 10:30 GMT

తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు `శ్రీనువైట్ల మార్క్` కామెడీ అంటే థియేటర్లలో నవ్వుల పండగే. ఢీ, రెడీ, దూకుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో వినోదానికి సరికొత్త అర్ధాన్ని చెప్పిన శ్రీనువైట్ల, ఆ తర్వాత కాలంలో రొటీన్ ఫార్ములా సినిమాలతో ఫ్లాపుల బాటపట్టారు. ఒకే తరహా పాత్రలు, బ్రహ్మానందం ప్యాటర్న్ ప్రహసనాలపై ప్రేక్షకులు తీవ్ర విసుగు చెంది ఆయన శైలిని తిరస్కరించడం ప్రారంభించారు. దీంతో దాదాపు దశాబ్ద కాలంగా సరైన విజయం లేక వెనుకబడిన శ్రీనువైట్ల.. త‌న సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అవే త‌ప్పులు చేసి దొరికిపోయాడు. మాస్ రాజా వంటి వారు కూడా అత‌డిని ఆదుకోలేక‌పోయారు. కానీ ఇప్పుడు శ‌ర్వానంద్ `జార్జ్ క్రిష్` చిత్రంతో తన పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

వైట్ల మార్క్ కామెడీపై విసుగు చెందిన ప్రేక్షకులు ఇప్పుడు ఆయన నుంచి అవుట్ అండ్ అవుట్ కొత్తదనం నిండిన ఫార్ములాని, ఆధునికమైన నవ్వులను ఆశిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో దిట్ట అయిన శర్వానంద్ ఆయనకు ఈ `చివరి అవకాశం` ఇవ్వడం పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఎంటర్‌టైన్‌మెంట్ మైంటైన్ చేసే శర్వానంద్.. ఫామ్‌లో లేని దర్శకుడితో హ్యాండ్ కలపడం కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అయినా కథలోని ఫన్, పాత్రల వైవిధ్యం నచ్చి శర్వా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో శ్రీనువైట్ల తన పాత ఫార్ములాకు స్వస్తి పలికి... డిఫరెంట్ జానర్‌లో న్యూ-ఏజ్ ఫన్‌ను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. మునుపటి రొటీన్ కామెడీ భిన్నంగా రెట్రో అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన పూర్తిస్థాయి పండగ ఎంటర్‌టైనర్‌గా `జార్జ్ క్రిష్`ను తీర్చిదిద్దుతున్నారు. ఇక ఫెమినా మిస్ ఇండియా విజేత మానస వారణాసి కథానాయికగా నటించడం సినిమాకు అదనపు గ్లామర్ అట్రాక్షన్ కానుంది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో ఈ మిస్ బ్యూటీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

`జార్జ్ క్రిష్` చిత్రం సాంకేతికంగానూ ఎంతో బలంగా రూపొందుతోంది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు అందిస్తుండగా.. కె.వి. గుహన్ ఛాయాగ్రాహకుడిగా.. అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అమరనాథ్ అండ్ గ్యాంగ్ డిజైన్ చేసిన కథా కథనాలు వినోదంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన `ఫస్ట్ బూస్టర్` టైటిల్ టీజర్ వినోదాత్మకంగా ఉండటంతో సినిమాపై సానుకూల వాతావరణం ఏర్పడింది.

మొత్తానికి శ్రీనువైట్ల మళ్లీ ఫామ్‌లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారా లేదా అనేది వేచి చూడాలి. 2027 సంక్రాంతి కానుకగా (జనవరి 14న) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ `జార్జ్ క్రిష్` శర్వానంద్‌కి మరో హిట్‌ను అందించి శ్రీనువైట్లకు కోల్పోయిన గతా వైభవాన్ని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి!

Tags:    
  • sharwanand 
  • sreenuvaitla 
  • georgekrishna 
  • manasavaranasi 
  • telugucinema 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS