• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మంచు కొండల్లో వణుకుతున్న...

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

| బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం హిమాలయ ప్రాంతంలోని మంచు కొండల మధ్య ఓ కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అక్కడి తీవ్రమైన చలికి శరీరం మొద్దుబారిపోతున్నా, షూటింగ్ అనుభవాలు మాత్రం తన మనసుకు ఎంతో ఆనందాన్నిస్తున్నాయని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మంచుతో నిండిన పర్వతాల ఫొటోలను షేర్ చేస్తూ సరదా క్యాప్షన్ జోడించారు. అయితే సినిమా పేరు, షూటింగ్ లొకేషన్ వివరాలను వెల్లడించలేదు. ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By - Srikanth Kontham
Update: 2026-11-05 11:30 GMT

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రొఫెషనల్ లైఫ్‌లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ నిమిత్తం మంచు ప్రాంతానికి వెళ్లారు. హిమాలయాల అందాల మధ్య సాగుతున్న ఈ షూటింగ్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమ్మ‌డు కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను, విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఎముకలు కొరికే చలిలో షూటింగ్ జరుపు కుంటున్నట్లు జాన్వీ తెలిపారు. చలి తీవ్రతకు శరీరం మొద్దుబారిపోతున్నా? ఆ షూటింగ్ మధుర జ్ఞాపకాలు మాత్రం మనసును వెచ్చదగతో నింపుతున్నాయని పేర్కొన్నారు.

ఈ వాతావరణం ఎంత కఠినంగా ఉన్నా? చేసే పనిపై ఉన్న మమకారం ఆ ఇబ్బందిని మరిచిపోయేలా చేస్తోందని వెల్లడించారు. అలాగే పోస్ట్‌లో జాన్వీ తనదైన శైలిలో సరదాగా స్పందించారు. `ఎవరైనా నన్ను గట్టిగా చిటికె వేసి ఇది నిజమో కాదో తేల్చండి. ఎందుకంటే చలికి నా ఒళ్లంతా మొద్దుబారిపోయింది. కానీ మేం షూట్ చేసిన విధానం మాత్రం నా మనసుకు ఎంతో హాయిని.. వెచ్చదనాన్ని ఇస్తోంది` అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతం పేరైతే జాన్వీ గోప్యంగా ఉంచినా? బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న మంచుతో నిండిన కొండలు, హిమాలయ ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు ప్రదేశంపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చెట్లు లేని ఎత్తైన మంచు పర్వతాలు, శీతల వాతావరణం ఈ ప్రాజెక్ట్ విజువల్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతున్నాయి. దర్శకులు ఎంచుకున్న ఈ లొకేషన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

అలాగే జాన్వీ కపూర్ ఇటీవల సోషల్ మీడియాలో తన తల్లి, దివంగత నటి శ్రీదేవి నటించిన క్లాసిక్ మూవీ `నగీనా` చిత్రంలోని ఐకానిక్ లుక్‌ను రీక్రియేట్ చేసి హ్యులోవీన్ వేడుకల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ జ్ఞాపకాల మ్యాజిక్ నుండి బయటకు రాకముందే తాజాగా మరో విభిన్నమైన లొకేషన్‌లో సినిమా షూటింగ్‌తో అమ్మ‌డు బిజీ అయిపోయారు.

మొత్తానికి సినిమాల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శించడంతో పాటు కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా లెక్కచేయకుండా అంకితభావంతో పనిచేస్తున్న జాన్వీ కపూర్ డెడికేషన్‌ను అభిమానులు కొనియాడుతున్నారు. మంచు కొండల నడుమ అమ్మ‌డు చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ తెరపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • janhvikapoor 
  • janhvikapoorlatest 
  • himalayanshoot 
  • bollywood 
  • janhvikapoormovies 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS