సుక్కు కోసం దేవిశ్రీ-రత్నవేలు.. ఫ్రీ ఫ్రీ
సినీ రంగంలో సంబంధాలన్నీ చాలా కృత్రిమంగా ఉంటాయని అంటారు.. కానీ నాకు మాత్రం ఇండస్ట్రీలో అద్భుతమైన స్నేహితులు దొరికారు.. అంటూ మురిసిపోయాడు డైరెక్టర్ సుకుమార్. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో తాను నిర్మాతగా మారుతున్నానని తెలిసి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకు ఉచితంగా పని చేశారని వెల్లడించాడు సుక్కు. అల్లు అర్జున్ కూడా తనకు చాలా సాయం చేసినట్లు ‘కుమారి 21 ఎఫ్’ ఆడియో ఫంక్షన్ లో వెల్లడించాడు సుక్కు.
‘‘ఇంతకుముందు నన్ను, దేవిశ్రీని, రత్నవేలును కలుపుకుని త్రీ ఇడియట్స్ అనేశాను. కానీ తర్వాత తొందరపడి ఆ మాట అనేశానేమో అనిపించింది. వాళ్లిద్దరూ అంత గొప్పవాళ్లు. మా ముగ్గురు ఇడియట్స్ లో ఒకరికి తెలివి వచ్చి నిర్మాత కావాలనుకున్నాడు. అప్పుడు మిగతా ఇద్దరూ ఏం చేశారో చెబుతా. ముందు దేవిశ్రీ దగ్గరికెళ్లి ఇలా సినిమా చేయాలనుకుంటున్నా అని చెప్పా. తన దగ్గర ఎప్పుడూ డబ్బుల గురించి మాట్లాడింది లేదు. మరి రెమ్యూనరేషన్.. అని అడిగితే.. నువ్వు ముందు సినిమా చెయ్ అంటూ దాటవేసేశాడు. మళ్లీ మళ్లీ.. ఐదారుసార్లు అతణ్ని పారితోషకం గురించి అడిగాను. ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. రత్నవేలు కూడా అంతే. వీళ్లిద్దరూ పైసా తీసుకోకుండా సినిమా చేశారు. ఇండస్ట్రీలో రిలేషన్స్ చాలా కృత్రిమంగా ఉంటాయంటారు. నాకు మాత్రం అద్భుతమైన స్నేహితులు దొరికారు.
ఇక బన్నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నాకు ఏది కావాలన్నా ఏమాత్రం మొహమాటం లేకుండా అడిగే వ్యక్తి అతనే. నేను ఫోన్ చేస్తే.. హలో అనడు. ఏం కావాలి అంటాడు. ఈ సినిమాకు అతనెంతో సాయం చేశాడు. మెసేజ్ పెడితే చాలు, సమకూర్చి పెట్టేవాడు. కుమారి.. సినిమా కోసం దేవిశ్రీ, రత్నవేలు ఇంత చేశారని చెబితే.. వాళ్లు నన్ను డామినేట్ చేస్తారా అంటూ ఆడియో ఫంక్షన్ కు వచ్చాడు బన్నీ’’ అంటూ తాను సంపాదించుకున్న విలువైన స్నేహితుల గురించి చెప్పుకున్నాడు సుకుమార్.