లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్న రవి ఎవరు?
అతడు నితీష్ తివారీ రామాయణంలో లక్ష్మణుడిగా ఎంపికైన తర్వాత ఎక్కువగా పాపులరయ్యాడు. రవి దూబే టెలివిజన్ - ఓటీటీ రంగాలలో పాపులర్ నటుడిగా గుర్తింపు పొందారు;
ఇటీవలి కాలంలో రవి దూబే అనే టీవీ నటుడి పేరు సౌత్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. అతడు నితీష్ తివారీ రామాయణంలో లక్ష్మణుడిగా ఎంపికైన తర్వాత ఎక్కువగా పాపులరయ్యాడు. రవి దూబే టెలివిజన్ - ఓటీటీ రంగాలలో పాపులర్ నటుడిగా గుర్తింపు పొందారు. అతడు మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. పలు టీవీ కార్యక్రమాలతో పాపులరయ్యాడు. చాలా కాలానికి రవి పెద్ద తెరపై కనిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
నితీష్ తివారీ `రామాయణం`లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, అతడి సోదరుడు లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నారు. రవి ఎవరు? అంటే .. అతడు హిందీ నటుడిగా, మోడల్ గా, టెలివిజన్ ప్రెజెంటర్ గా- నిర్మాత గా బహుముఖ పాత్రలను పోషిస్తున్నాడు. రామాయణంలోని లక్ష్మణుడిగా నటిస్తున్న రవి దూబే ఏ మతాన్ని ఆచరిస్తాడో తెలిస్తే షాకవుతారు ఎవరైనా. రవి దూబే ఇన్‌స్టాని పరిశీలిస్తే, అతడి ఆధ్యాత్మక పంథా అర్థమవుతుంది. దేవాలయాలలో ప్రార్థనలు చేయడం, గంగా నదికి హారతి ఇవ్వడం, గురుద్వారాలతో అనుబంధం వంటివి కనిపిస్తాయి. ఓ ఇంటర్వ్యూలో అతడు కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. తన ఇంజనీరింగ్ కాలేజ్ రోజుల్లో ఓ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని వెల్లడించాడు.
రవి స్టడీస్ లో అంతంత మాత్రమే. రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టెలికాం ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు పరీక్షలలో ఫెయిలైన తర్వాత రవి దూబే వ్యక్తిగతంగా చాలా డిప్రెషన్ కి గురయ్యాడు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఆ తర్వాత ధ్యానం - బౌద్ధమతం నా జీవితంలో అంతర్భాగంగా మారాయి. అవి నిజంగా జీవితంపై నా దృక్పథాన్ని మార్చాయి. నేను చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు బౌద్ధమతాన్ని స్వీకరించడం ప్రారంభించాను. ఆ సమయంలో నేను మంత్రాలు జపించాను. రవి దూబే నిచిరెన్ బౌద్ధమతాన్ని ఆచరిస్తాడు. ఇది 13వ శతాబ్దపు జపనీస్ సన్యాసి నిచిరెన్ బోధన పాఠాలతో రూపొందించిన మహాయాన బౌద్ధమతానికి ఒక రూపం.
మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రవి దూబే 2006లో `స్త్రీ తేరి కహానీ` షోతో నటుడిగా మొదలయ్యాడు. డోలీ సజా కే, యహాన్ కే హమ్ సికందర్ వంటి షోలలో పాత్రలతో, కుటుంబ నాటక షోలైన సాస్ బినా ససురల్ , జమై రాజాలలో పెర్ఫామర్ గా నిరూపించారు. భారతదేశంలో అత్యంత పాపులర్ టీవీ నటులలో ఒకడిగా ఎదిగాడు రవి దూబే. సాస్ బినా ససురల్- జమై రాజా వంటి టీవీ షోలు అతడి పాపులారిటీని పెంచాయి. ఆ తర్వాత డ్యాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్‌లు నాచ్ బలియే 5 , ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 8 లలో కూడా రవి దూబే పాల్గొన్నాడు.
నికర సంపదలలో మేటి దంపతులు...
రవి దూబే- సర్గుణ్ మెహతా జంట డ్రీమియాట ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్థాపించారు. వారి నిర్మాణ సంస్థ సౌంకన్ సౌంక్నే టీవీ హిట్ ఉదరియాన్ ని, పలు బ్లాక్‌బస్టర్ పంజాబీ చిత్రాలను అందించింది. 2025 నాటికి ఈ జంట మొత్తం నికర ఆస్తుల విలువ రూ. 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వీటిలో ముంబై , పంజాబ్‌లోని లగ్జరీ ఆస్తులు.. జాగ్వార్ , బిఎండబ్ల్యూ కూడా ఉన్నాయి.