చైతూ ఇప్ప‌టికి మెయిన్ గేమ్‌లోకి వ‌చ్చాడా?

టాలీవుడ్‌లో హీరోల‌కు కొద‌వ‌లేదు. ఇత‌ర ఇండ‌స్ట్రీల‌తో పోలిస్తే మ‌న ద‌గ్గ‌ర హీరోలు చాలా మందే ఉన్నారు.;

Update: 2026-03-05 19:30 GMT

టాలీవుడ్‌లో హీరోల‌కు కొద‌వ‌లేదు. ఇత‌ర ఇండ‌స్ట్రీల‌తో పోలిస్తే మ‌న ద‌గ్గ‌ర హీరోలు చాలా మందే ఉన్నారు. ఇందులో స్టార్స్ కుటుంబాల వార‌సులు కూడా ఎక్కువే. అయితే చాలా వ‌ర‌కు స్టార్స్ ఫ్యామిలీ వార‌సుల్లో కొంత మంది ఇప్ప‌టి వ‌ర‌కు వారికున్న యాక్టింగ్ ప్రొటెన్షియాలిటీకి త‌గ్గ స‌క్సెస్‌ల‌ని, ఆ స్థాయి క‌థ‌ల‌ని..క్యారెక్ట‌ర్ల‌ని ఇంత వ‌ర‌కు చేయ‌లేక‌పోతున్నావారు ఇద్ద‌రు ముగ్గ‌రున్నారు. వారిలో ముందు వ‌రుస‌లో నిలుస్తున్నహీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌. అక్కినేని నాగార్జున వార‌సుడిగా అరంగేట్రం చేసినా ఇంత వ‌ర‌కు త‌న స‌త్తాకు త‌గ్గ క్యారెక్ట‌ర్‌, సినిమా చేయ‌లేక‌పోతున్నాడు.

అలాంటి క‌థ‌ల్ని ఎంచుకుని రేస్‌లో ముందుకు రాలేక‌పోతున్నాడు అనే భావన అక్కినేని అభిమానుల్లో గ‌త కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. చైతూ ఫ‌స్ట్ మూవీ `జోష్‌`. ఇందులో త‌ను ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న‌, చూపించిన హావ‌భావాలు, ప్ర‌దర్శించిన యాటిట్యూడ్ మ‌రే సినిమాలో చూపించ‌లేదు. ఫ‌స్ట్ మూవీలోనే అనుభ‌వం ఉన్న ఆర్టిస్ట్‌లా అన్ని వేరియేష‌న్స్ చూపించిన నాగ‌చైత‌న్యలో మంచి న‌టుడు ఉన్నాడ‌ని ఫ‌స్ట్ మూవీతో అంద‌రికి అర్థ‌మైంది. కానీ త‌నకు త‌గ్గ క‌థ‌ల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు నాగాచైత‌న్య‌.

న‌టుడిగా, హీరోగా అత‌నికున్న ప్రొటెన్షియ‌లిటీకి త‌గ్గ‌ సినిమా చేస్తే చూడాలని గ‌త కొన్నేళ్లుగా అక్కినేని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అది ఇప్ప‌టికి నెర‌వేర‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. నాగ‌చైత‌న్య న‌టిస్తున్న తాజా మూవీ `వృశ‌క‌ర్మ‌`. చైతూ న‌టిస్తున్న 24వ సినిమా ఇది. మీనాక్షీ చౌద‌రి క‌థానియికగా న‌టిస్తోంది. ఇదొక మిస్టిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. `విరూపాక్ష‌` ఫేమ్ కార్తిక్ దండు ద‌ర్శ‌కుడు. ట్రెజ‌ర్ హంట‌ర్‌గా నాగచైత‌న్య న‌టిస్తున్నాడు. ఈ మూవీ బ‌డ్జెట్ రూ.120 కోట్లు. చైతూ కెరీర్‌లో ఈ స్థాయి భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఫ‌స్ట్ మూవీ ఇది.

తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. గ‌త చిత్రాల‌కు భిన్నంగా చైతూ ఇందులో క‌నిపిస్తున్నాడు. కంటెంట్‌, క్యారెక్ట‌ర్ చాలా ఇంటెన్సిటీతో ప‌వ‌ర్ ఫుల్‌గా సాగుతుదని తెలుస్తోంది. గ్లింప్స్ చూసిన త‌రువాత అక్కినేని అభిమానులు ఇది క‌దా నాగ‌చైత‌న్య నుంచి ఇన్నాళ్లుగా కోరుకుంటోంద‌ని హ్యాపీ ఫీల‌వుతున్నారు. చైతూ మాత్రం అంత‌కు మించి చెబుతున్నాడు. త‌న కెరీర్‌ని మ‌లుపు తిప్పే సినిమా ఇదని బాహాటంగానే చెబుతున్నాడు. ఈ మూవ్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నా.. నా కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ మూవీ అవుతుంద‌ని గ‌ట్ ఫీలింగ్‌తో చెబుతుండ‌గం గ‌మ‌నార్హం.

గ‌తంలో దేవ క‌ట్ట‌తో చేసిన `ఆటోన‌గ‌ర్ సూర్య‌` సినిమాతో నాగ‌చైత‌న్య స్టార్ లీగ్‌లోకి ఎంట‌ర‌వుతాడ‌ని అంతా భావించారు. దానికి సంబంధించిన డైలాగ్ టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేయ‌డంతో అభిమానులు కూడా ఖుషీ అయ్యారు. కంటెంట్ మిస్‌ఫైర్ కావ‌డం, రిలీజ్ డిలే కావ‌డంతో ఆశించిన స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయింది. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు `వృశ‌క‌ర్మ‌`తో అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ చైతూకు రాబోతోంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. చైతూ కూడా చాలా స్ట్రాంగ్‌గా చెబుతున్నాడు. ఈ సారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కొట్టేస్తామ‌ని..అంతా ఆశిస్తున్న‌ట్టే `వృశ‌క‌ర్మ‌` బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయితే చైతూ కెరీర్ మ‌రో మ‌లుపు తిర‌గ‌డం ఖాయం.


Full View


Tags:    

Similar News