సీనియర్ కోసం జూనియర్.. మేఘీ పొటెన్షియల్ కు తగ్గ మూవీ అవుతుందా?
రీసెంట్ గా రిలీజ్ అయిన ఆస్మాన్ టీజర్ చూసిన యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి.
హీరోగా ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో మేఘాంశ్ శ్రీహరి.. ఆస్మాన్ తో మరో డిఫరెంట్ ప్రయత్నం చేస్తున్నారు. దివంగత నటుడు శ్రీహరి కొడుకుగా పరిచయమైన మేఘాంశ్.. ఈసారి రగ్గడ్, ఇంటెన్స్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆస్మాన్ టీజర్ చూసిన యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి.
మేఘాంశ్ తన స్కూల్ సీనియర్ అని చెప్పిన శివాత్మిక.. అతడి పొటెన్షియల్ కు తగ్గ సినిమా ఆస్మాన్ అని చెప్పడం విశేషం. టీజర్ విజువల్స్ తనకు బాగా నచ్చాయని, ముఖ్యంగా మేఘాంశ్ లుక్ అమేజింగ్ గా ఉందని ఆమె తెలిపారు. 'ఆస్మాన్ టీమ్‌కు బెస్ట్ విషెస్. టీజర్ విజువల్స్‌తో సహా అన్ని విషయాల్లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్ డే మేఘీ' అంటూ విష్ చేశారు.
'మేఘీ నా స్కూల్ సీనియర్. వాడి పొటెన్షియల్ కు తగ్గ సినిమా ఉంది. మేఘాంశ్ లుక్ అమేజింగ్ గా ఉంది. ముఖ్యంగా లాస్ట్ సీన్ లో గ్రేట్' అంటూ శివాత్మిక ప్రశంసలు కురిపించారు. ఇక ఆస్మాన్ టీజర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు మేఘాంశ్ కనిపించిన రోల్స్ కు భిన్నమైన షేడ్స్ ఇందులో కనిపిస్తున్నాయి. రగ్గడ్ లుక్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ తో ఆయన పాత్రపై ఆసక్తిని పెంచారు.
టీజర్ లో హీరోయిన్ ప్రమాదంలో పడటం, పోలీస్ స్టేషన్ సన్నివేశాలు, కాగడా పట్టుకుని హీరో చేసే రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చే సీన్ హైలైట్‌గా నిలిచింది. అక్కడ మేఘాంశ్ కనిపించే విధానం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆ సీన్స్ కు మరింత బలం ఇచ్చింది. దీంతో ఆస్మాన్ ఎలాంటి కథతో తెరకెక్కుతోందనే ఆసక్తి మొదలైంది.
దివంగత నటుడు శ్రీహరి, డిస్కో శాంతి కుమారుడే మేఘాంశ్ శ్రీహరి. ఇప్పటికే హీరోగా పలు సినిమాల్లో కనిపించిన ఆయన.. ఆస్మాన్ మాత్రం తన లుక్, పాత్ర విషయంలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశారు. అందుకే శివాత్మిక చేసిన పొటెన్షియల్ కు తగ్గ సినిమా అనే కామెంట్ వైరలవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, అరబిక్ భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఆస్మాన్ శివాత్మిక చెప్పినట్లు ఉంటుందో లేదో చూడాలి.
ఇక శివాత్మిక కెరీర్ విషయానికొస్తే.. సీనియర్ నటులు రాజశేఖర్, జీవితల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, 2019లో దొరసాని సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా సైమా అవార్డు అందుకున్న ఆమె, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ‘వివిధ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ సహా పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు.