చివరి ‘దృశ్యం'... ఒరిజినల్ కంటే ఎక్కువ సాధ్యమా?
మలయాళ సూపర్ హిట్ ప్రాంచైజీ మూవీ 'దృశ్యం' ఇప్పటి వరకు మూడు పార్ట్‌లుగా వచ్చింది. మూడో పార్ట్‌కి బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.250 కోట్లు వచ్చినట్లు బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు.
మలయాళ సూపర్ హిట్ ప్రాంచైజీ మూవీ 'దృశ్యం' ఇప్పటి వరకు మూడు పార్ట్‌లుగా వచ్చింది. మూడో పార్ట్‌కి బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.250 కోట్లు వచ్చినట్లు బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. మొదటి రెండు దృశ్యం పార్ట్‌లను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయడం జరిగింది. కానీ మూడో పార్ట్‌ను నేరుగా డబ్బింగ్ వర్షన్‌ను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. తమిళంలోనూ అదే పరిస్థితి కనిపించింది. కానీ హిందీలో మాత్రం మూడో పార్ట్‌ను సైతం రీమేక్ చేశారు. కానీ మలయాళ దృశ్యం 3 కి ఉన్నది ఉన్నట్లుగా కాకుండా కాస్త స్క్రీన్ ప్లే మార్చి రీమేక్ చేయడం జరిగిందని చెబుతున్నారు. మలయాళ దృశ్యం ఇంకా పూర్తి కాలేదు, త్వరలో నాల్గవ పార్ట్ ఉండే అవకాశం ఉంది. కానీ హిందీ దృశ్యం ముగియనుంది. మూడో పార్ట్ చివరి పార్ట్ అంటూ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. హిందీలో రాబోతున్న చివరి దృశ్యం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
అజయ్ దేవగన్ దృశ్యం 3 సినిమాలో...
అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం 3 సినిమాను అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలకు ఏర్పాట్లు దాదాపు పూర్తి అయినట్లు మేకర్స్ చెబుతున్నారు. దాదాపుగా రూ.130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు ఓటీటీ ద్వారా ఏకంగా రూ.150 కోట్లు వచ్చినట్లు బాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇక థియేట్రికల్ రైట్స్ ద్వారా కూడా భారీ మొత్తంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాను బయ్యర్లకు చూపించడంతో వారికి నచ్చి, పెద్ద మొత్తంలో అమౌంట్‌ను పెట్టేందుకు ముందుకు వస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా వరుస సెలవులు, ఇతర విషయాలు కలిసి వస్తే దృశ్యం 3 సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల మార్క్ ను క్రాస్ కావడం పెద్ద కష్టం ఏమీ కాకపోవచ్చు అనే అభిప్రాయం ను బయ్యర్లు వ్యక్తం చేస్తున్నారట.
మోహన్ లాల్ దృశ్యం 3 కలెక్షన్స్...
హిందీ దృశ్యం కు మొదటి నుంచి మంచి స్పందన దక్కిన విషయం తెల్సిందే. దృశ్యం 1 సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు దాదాపు రూ.110 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక దృశ్యం 2 కి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.340 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లు రిపోర్ట్‌లు వచ్చాయి. కనుక ఇప్పుడు దృశ్యం 3 అంతకు మించి వసూళ్లు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. కంటెంట్ సైతం ఇంతకు ముందు సినిమాల కంటే బలంగా ఉండబోతుందని ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. ఈసారి విజయ్ తన ఫ్యామిలీని ఆ కేసు నుంచి పూర్తిగా ఎలా బయట పడేశాడు, తన ఫ్యామిలీని పూర్తిగా ఎలా కాపాడుకున్నాడు, అవతలి వారి నుంచి తన ఫ్యామిలీని ఎలా రక్షించుకున్నాడు అనే కథతో దృశ్యం 3 ఉండబోతున్నట్లు చెబుతున్నారు. గత రెండు పార్ట్‌లతో పోల్చితే ఈసారి కాస్త యాక్షన్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి.
బాలీవుడ్ దృశ్యం చివరి పార్ట్...
ఇప్పటి వరకు మలయాళ దృశ్యం ను చిన్న చిన్న మార్పులు చేసి తీసుకు వచ్చిన హిందీ దృశ్యం మేకర్స్ ఈసారి మాత్రం పూర్తి విభిన్నమైన కథ, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది ప్లస్ అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ కొందరు మాత్రం స్క్రీన్ ప్లే విషయమై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తిని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమా విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా ఉంటాయనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు దక్కని భారీ ఓపెనింగ్స్‌ను ఈ సినిమా దక్కించుకుంటుంది అనే విశ్వాసంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. దృశ్యం చివరి పార్ట్ ఒరిజినల్ దృశ్యం 3 కంటే ఎక్కువ వసూళ్లను సాధిస్తే అది కచ్చితంగా రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ రికార్డ్‌ను దృశ్యం 3 నమోదు చేస్తుందా అనేది అక్టోబర్ 2, 2026న సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.