విరోష్ జంటపై గ్రామస్తుల రియాక్షన్..

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న జంట గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;

Update: 2026-03-05 18:35 GMT

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న జంట గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తోనే కాదు లవ్లీ జంటగా కూడా ఇండస్ట్రీలో టాక్ సొంతం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని.. నిండు నూరేళ్లు సంతోషంగా కొనసాగాలని "విరోష్" అని నామకరణం చేస్తూ ఈ జంటకు ప్రత్యేకమైన ఒక పేరును కూడా తగిలించారు అభిమానులు. పైగా ఎనిమిదేళ్లపాటు అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారని.. కానీ ఏ రోజు కూడా ఈ జంట బయటపడలేదు. అయితే రష్మిక మందన్న అక్కడక్కడ హింట్ ఇస్తూ వచ్చింది కానీ దానిని అధికారికం చేయలేదు.

అభిమానులు ఎప్పుడెప్పుడు తమ బంధాన్ని బహిర్గతం చేస్తారా అని ఎదురు చూడగా.. ఎట్టకేలకు ఫిబ్రవరి 22 2026న తమ తమ ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా అభిమానులు ప్రేమగా ఇచ్చిన విరోష్ అనే పదాన్ని స్వీకరిస్తూ "ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్" అంటూ ప్రకటించారు. అలా ఉదయ్ పూర్లో ఫిబ్రవరి 26 2026న 100 మంది అతిధులు, సన్నిహితుల సమక్షంలో చాలా ఘనంగా వివాహం జరుపుకున్నారు. వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన మూలాలను మర్చిపోకుండా తన సొంత గ్రామమైన తుమ్మన్ పేటకి తన భార్య రష్మిక మందన్నతో పాటు వెళ్లి తన నూతన గృహప్రవేశ కార్యక్రమం తర్వాత అక్కడే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు.

అనంతరం గ్రామస్తులకు విందు ఏర్పాటుచేసిన విజయ్ దేవరకొండ.. ఆ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉండే 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రకటించారు. అంతేకాదు ఆ ఊరి అభివృద్ధి కోసం తమవంతు సహాయం చేస్తామని చెప్పి గ్రామస్తులకు వరాల జల్లు కురిపించారు. ఇకపోతే తన సొంత గ్రామంలో అత్యంత సుందరంగా తన సొంత ఇంటిని నిర్మించుకోవడంతో అటు అభిమానులే కాదు ఆ ఊరి గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాదు అంగరంగ వైభవంగా గ్రామస్తుల కోసం విందు ఏర్పాటు చేయడంతో ఈ విషయంపై గ్రామస్తులు స్పందించారు.

ముఖ్యంగా విరోష్ జంట గురించి గ్రామస్తులు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

విరోష్ జంట తమ ఊరిని మర్చిపోకుండా వివాహమనంతరం ఇక్కడికి చేరుకొని తమ మూలాలను గుర్తు పెట్టుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడే ఆయన సొంత ఇల్లు కట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఒక సాధారణ మనిషిలా మాతో కలిసిపోవడం మమ్మల్ని అత్యంత ఆనందానికి గురిచేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గీతాగోవిందం సినిమాలో ఎలా అయితే జంటగా ఉన్నారో.. వారు నిండు నూరేళ్లు అలా విడిపోకుండా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.. అంటూ ఆ గ్రామ ప్రజలు ఆశీర్వదించారు. విరోష్ జంటపై ఆ ఊరి గ్రామస్తులు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.



Tags:    

Similar News