• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Life Style >  తెరపై గ్లామర్...

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

| పరిశ్రమలో రాణించాలంటే ఎంతో కొంత సోషలైజ్ అవ్వడం అవసరమని భావిస్తుంటారు. అయితే దిశ మాత్రం ఈ నిబంధనలకు అతీతంగా స్వభావాన్ని మార్చుకోలేదు.

By - Srikanth Kontham
Update: 2026-11-03 12:30 GMT

వెండి తెరపై మెరిసే తారల గురించి మాట్లాడుకునేటప్పుడు వారి గురించి ప్రేక్షకులకో సాధారణమైన అభిప్రాయం ఉంటుంది. తెరపై కనిపించే ధగధగలాడే గ్లామర్.. పార్టీల హడావుడి.. లైమ్‌లైట్‌లో జీవించడమే వారి నిత్య జీవితం అనుకుంటారు. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా తెరవెనుక నిశ్శబ్దమైన, సిగ్గరి స్వభావం కలిగిన సాధారణ వ్యక్తి దాగుంటాడని చాలా మందికి తెలియదు. బాలీవుడ్ గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న దిశ పటాని తన గురించి తాను చెబుతూ ప్రజలు తన గ్లామరస్ రూపాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారని.. కానీ నిజ జీవితంలో తాను ఒక పూర్తి స్థాయి హోమ్‌బాడీ అని చెప్పడం విశేషం.

 

సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో అద్భుతమైన నృత్యాలతో గ్లామరస్ లుక్స్‌తో కుర్రకారును అలరించే దిశ పటాని.. బయట ప్రపంచంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. కెమెరా ముందుకొస్తే చాలు తనలోని అద్భుతమైన నటి బయటకు వస్తుంది కానీ పబ్లిక్ ఈవెంట్లలో మాట్లాడాలంటే ఇప్పటికీ చిన్ననాటి సిగ్గు అలాగే ఉంటుందని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. పార్టీలకు దూరంగా ఉండటం, రద్దీగా ఉండే క్లబ్‌లకు వెళ్లకపోవడం ఆమె దైనందిన జీవితంలో భాగం.

 

చాలామంది సెలబ్రిటీలలాగా హై-ప్రొఫైల్ లైఫ్‌స్టైల్‌ను గడపడానికి దిశ ఇష్టపడరు. షూటింగ్స్ అవ్వ‌గానే నేరుగా ఇంటికి వెళ్లడం.. పెంపుడు జంతువులతో సమయం గడపడం.. విశ్రాంతి తీసుకోవడమే ఆమెకు ఇష్టమైన వ్యాపకం. తన ఇంటి గోడల మధ్యే తనకు అసలైన ప్రశాంతత దొరుకుతుందని నమ్ముతారు. గ్లామర్ ప్రపంచం తనపై మోపిన ఇమేజ్‌ను ఎంతో సానుకూలంగా స్వీకరిస్తూనే మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని మాత్రం అత్యంత సాధారణంగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు.

పరిశ్రమలో రాణించాలంటే ఎంతో కొంత సోషలైజ్ అవ్వడం అవసరమని భావిస్తుంటారు. అయితే దిశ మాత్రం ఈ నిబంధనలకు అతీతంగా స్వభావాన్ని మార్చుకోలేదు. తాను ఓ ఇంట్రోవర్ట్ అని.. ఎవరితోనైనా తొందరగా సంభాషణలు ప్రారంభించడం తనకు రాదని నిజాయితీగా అంగీకరిస్తారు. ఇలాంటి స్వభావం ఉన్నా? కష్టపడే తత్వంతో.. ఫిట్‌నెస్ పట్ల ఉన్న అంకితభావంతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

 

దిశ పటాని దినచర్యలో ఫిట్‌నెస్ అనేది ప్రధాన భాగం. అందంగా కనిపించడం కోసం కాకుండా తనను తాను మానసికంగా.. శారీరకంగా దృఢంగా ఉంచుకోవడానికే వర్కౌట్లు చేస్తుంటారు. జిమ్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ వంటి కఠినమైన శిక్షణ దిశ దైనందిన జీవితంలో క్రమశిక్షణను నేర్పుతాయి. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఏకాంతంగా గడపడానికే దిశ‌ ఇష్టపడతారు.

ప్రేక్షకులు ఎలా చూస్తున్నారనే దానికంటే తన అంతరాత్మకు ఎంతవరకు నిజాయితీగా ఉంటున్నాననేదే ముఖ్యమని దిశ భావిస్తారు. గ్లామరస్ హీరోయిన్ ముద్ర వెనుక ఉన్న సాధారణ అమ్మాయి ఆలోచనలు.. జీవన శైలి నేటి యువతకు భిన్నమైన కోణాన్ని పరిచయం చేస్తాయి. బయట ప్రపంచానికి కనిపించే రూపం వేరు.. మనసులో ఉండే స్వభావం వేరు అని నిరూపిస్తూ సెలబ్రిటీ హోదాలోనూ సింపుల్‌గా జీవించొచ్చ‌ని నిరూపిస్తున్నారు.

Tags:    
  • dishapatani 
  • bollywood 
  • celebritylifestyle 
  • fitnessroutine 
  • realpersonality 

Similar News

నీళ్లకు బదులు చెర్రీ కోక్.. వారెన్ బఫెట్ డైట్ సీక్రెట్ ఇదేనా?

2026-11-01 04:34 GMT

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

2026-10-27 11:22 GMT

చరిత్రలో అత్యంత ధనవంతులు వీళ్లేనా? మాన్సా మూసా నుంచి ఎలాన్ మస్క్ వరకు అసలు లెక్కలేంటి?

2026-10-23 09:30 GMT

బెంగళూరు, హైదరాబాద్‌లకు ప్రత్యామ్నాయంగా మరో నగరం దొరుకుతుందా?

2026-10-22 19:30 GMT

ఫ్రెండ్ తాగే సిగరెట్ మీ ప్రాణాలు తీస్తుంది బాస్

2026-10-04 03:42 GMT

సరిహద్దులు దాటిన ఆత్మబంధం.. గయ తీరంలో విదేశీయుల పిండప్రదానం..

2026-10-02 13:06 GMT

న్యూక్లియర్ ఫ్యామిలీస్ రైజ్.. సంప్రదాయాలకు సవాళ్లు ఏంటి?

2026-09-25 10:30 GMT

ముసుగు లేని జీవితం: స్వచ్ఛమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక!

2026-09-18 12:30 GMT

ఎడమచేతి వాటం లోపం కాదు.. సహజ లక్షణమే.. పిల్లలను మార్చొద్దంటున్న నిపుణులు

2026-08-13 06:52 GMT

అమ్మాయిల తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. అలా చేయకపోతే ఆ పసికందులకి ఇబ్బందులు తప్పవా?

2026-07-14 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS