• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమిటీ కుర్రోడికి.. ఈసారి...

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

| ఒక సినిమాలో పదిమంది కొత్త నటులు కనిపిస్తే అందరికీ ఒకే స్థాయిలో గుర్తింపు రావడం కష్టం. కొందరు మాత్రం తమ పాత్ర చిన్నదైనా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు.

By - M Prashanth
Update: 2026-11-03 10:30 GMT

ఒక సినిమాలో పదిమంది కొత్త నటులు కనిపిస్తే అందరికీ ఒకే స్థాయిలో గుర్తింపు రావడం కష్టం. కొందరు మాత్రం తమ పాత్ర చిన్నదైనా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. 'కమిటీ కుర్రోళ్లు'తో అలా గుర్తింపు తెచ్చుకున్న యువ నటుల్లో త్రినాధ్ వర్మ ఒకరు. ఆ సినిమాలో తన నటనతో మంచి మార్కులే కొట్టేసిన త్రినాధ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి నటుడిగా తనను తాను మరింత నిరూపించుకునే అవకాశం దక్కింది.

నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు'లో ఏకంగా 11 మంది కొత్త నటులకు అవకాశం ఇచ్చారు. యదు వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్, స్నేహితుల మధ్య అనుబంధం, ఎమోషన్స్‌తో మంచి విజయాన్ని అందుకుంది. అంతమంది నటులున్నప్పటికీ త్రినాధ్ వర్మ తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ నుంచి మరో సినిమా చేస్తుండటం విశేషం. 'పాకెట్ రాకెట్స్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన లీడ్ రోల్స్‌లో ఒకరిగా నటిస్తున్నారు.

రుద్ర అత్రి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కథ కూడా కాస్త భిన్నంగానే ఉంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే ఓ పేద విద్యార్థికి డబ్బు పెద్ద సమస్యగా మారుతుంది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు బెట్టింగ్ వైపు అడుగులు వేస్తాడు. కానీ అక్కడ ఓ మోసగాడి చేతిలో చిక్కుకోవడంతో పరిస్థితులు మారిపోతాయి. ఈ నేపథ్యంలో సాగే అర్బన్ డ్రామాగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే త్రినాధ్ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా బయటపెట్టలేదు.

'కమిటీ కుర్రోళ్లు'లో గ్రామీణ యువకుడిగా కనిపించిన త్రినాధ్‌కు ఈసారి పూర్తిగా వేరే నేపథ్యం ఉన్న కథ దొరికింది. మొదటి సినిమాలో చాలామందితో కలిసి స్క్రీన్ పంచుకున్న ఆయన ఇప్పుడు కథను నడిపించే నటుల్లో ఒకరిగా కనిపించబోతున్నారు. కొత్త నటులకు ఇలాంటి అవకాశాలు కెరీర్ ప్రారంభంలో చాలా అవసరం. పైగా ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. కొత్తగా పరిచయమవుతున్న నిర్మల్ మరో లీడ్ రోల్ చేస్తుండగా, 'శుభం' ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మరోవైపు 'కమిటీ కుర్రోళ్లు'కు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు రావడంతో నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు మాక్సిమం సిటీ స్టూడియోస్‌తో కలిసి 'పాకెట్ రాకెట్స్'ను తీసుకొస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు కూడా ఇందులో నటిస్తున్నారు. గ్యానీ సంగీతం అందిస్తుండగా ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు.

ఇప్పటికే 'పాకెట్ రాకెట్స్' షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే టీజర్‌తో పాటు రిలీజ్ డేట్‌పై మరింత క్లారిటీ రానుంది. 'కమిటీ కుర్రోళ్లు'లో త్రినాధ్ వర్మను గుర్తుపట్టిన ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా ఆయన నటనను మరింత దగ్గరగా చూసే అవకాశం దక్కనుంది. ముఖ్యంగా ఈసారి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్రలో ఆయన ఎంతవరకు మెప్పిస్తారనేది ఆసక్తికరం.

Tags:    
  • trinadhvarma 
  • pocketrockets 
  • niharikakonidela 
  • jdchakravarthy 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS