• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే...

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

| సినిమా ఈవెంట్లలో నటీనటులు తమ మధ్య ఉన్న పరిచయాల గురించి చాలా సరదాగా చెబుతుంటారు.

By - M Prashanth
Update: 2026-11-03 10:59 GMT

సినిమా ఈవెంట్లలో నటీనటులు తమ మధ్య ఉన్న పరిచయాల గురించి చాలా సరదాగా చెబుతుంటారు. ఒక్కోసారి స్టేజ్ మీదే ఒకరినొకరు ఆటపట్టించుకుంటారు. లేటెస్ట్ గా శివాత్మిక రాజశేఖర్ కూడా రాహుల్ విజయ్ గురించి అలాంటి విషయమే చెప్పారు. తనతో కలిసి సినిమా చేయకూడదని ఇప్పుడు అగ్రిమెంట్‌లో కూడా రాయించుకుంటున్నారంటూ ఆయనపై ఓ పంచ్ వేశారు. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందనే ఆసక్తి కలిగించేలా ఆమె మాటలు సాగాయి.

రాహుల్ విజయ్ నటించిన 'అ' సినిమా కార్యక్రమానికి శివాత్మిక అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్‌తో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ కలిసి మూడు ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం వచ్చినట్లు చెప్పారు. అయితే 'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే సినిమా చేయనని.. రాహుల్ అగ్రిమెంట్‌లో కూడా రాయించుకుంటున్నారు' అంటూ ఆటపట్టించారు. ఆమె అలా అనగానే వేదికపై ఉన్నవాళ్లు కూడా నవ్వేశారు.

నిజానికి రాహుల్ విజయ్, శివాత్మిక మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో ఇద్దరూ కలిసి 'విద్య వాసుల అహం' సినిమాలో నటించారు. ఆ పరిచయంతోనే స్టేజ్ మీద రాహుల్‌ను ఆటపట్టించారు. అదే సమయంలో ఆయన టాలెంట్ గురించి కూడా మాట్లాడారు. రాహుల్ మంచి నటుడే కాకుండా అద్భుతమైన డ్యాన్సర్ అని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు తెలిసిన మంచి వ్యక్తుల్లో రాహుల్ ఒకరని ప్రశంసించారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అర్చన అయ్యర్ గురించి కూడా శివాత్మిక మాట్లాడారు. ట్రైలర్, పాటలు చూశానని, ముఖ్యంగా థీమ్ సాంగ్‌లో అర్చన డ్యాన్స్ తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఆమె అందంగా కనిపించడంతో పాటు మంచి నటి అని పేర్కొన్నారు. రాహుల్ ఈ ప్రాజెక్టు కోసం ఎంత కష్టపడ్డారో తనకు తెలుసని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఆయన కోసమే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు కూడా చెప్పారు.

సాయి బాలి దర్శకత్వంలో తెరకెక్కిన 'అ' నవంబర్ 12న విడుదల కానుంది. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ లీడ్ రోల్స్ చేస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమా కథపై కొంత ఆసక్తి ఏర్పడింది. ఈ కార్యక్రమంలో శివాత్మిక మాట్లాడినంతసేపు రాహుల్‌తో తనకున్న స్నేహాన్ని హైలెట్ చేశారు. అయితే మధ్యలో అగ్రిమెంట్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయనను ఆటపట్టించిన తీరు మాత్రం కాస్త వెరైటీగా ఉంది. అందుకు సంబంధించిన క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Tags:    
  • shivathmika 
  • rahulvijay 
  • archanaaiyer 
  • ahmovie 
  • tollywood 

Similar News

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

Copyright @2026

Powered by Blink CMS