• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారణాసి: RRR కంటే 40...

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

| రాజమౌళి సినిమా అంటే షూటింగ్‌కు ఏళ్ల సమయం పడుతుందని అందరికీ తెలుసు. ఒక్క సీన్ కోసం రోజుల తరబడి కష్టపడటం, అనుకున్న షాట్ వచ్చేవరకు రాజీపడకపోవడం జక్కన్న స్టైల్.

By - M Prashanth
Update: 2026-11-03 18:18 GMT

రాజమౌళి సినిమా అంటే షూటింగ్‌కు ఏళ్ల సమయం పడుతుందని అందరికీ తెలుసు. ఒక్క సీన్ కోసం రోజుల తరబడి కష్టపడటం, అనుకున్న షాట్ వచ్చేవరకు రాజీపడకపోవడం జక్కన్న స్టైల్. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' విషయంలో మాత్రం ఓ ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. 'RRR' కంటే ఐదారు రెట్లు పెద్ద సినిమా తీస్తున్నప్పటికీ షూటింగ్ రోజులను తగ్గించగలిగారు. అదీ ఏకంగా 40 రోజులు కావడం విశేషం.

ఇక ఇంత భారీ ప్రాజెక్టులో సమయాన్ని ఎలా ఆదా చేశారనే డౌట్ హైలెట్ అవుతోంది. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాజమౌళి ఈ వివరాలను వెల్లడించారు. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కోసం 315 రోజులు పనిచేయగా, 'వారణాసి'కి 275 రోజులే పట్టినట్లు చెప్పారు. అయితే ఈసారి షూటింగ్‌కు వెళ్లకముందే పేపర్ వర్క్ ఎక్కువగా చేశారట. ప్రతి సన్నివేశాన్ని ఎలా తీయాలి, ఏయే ఏర్పాట్లు అవసరమనే విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడంతో సెట్స్ మీద సమయం ఆదా అయిందని వివరించారు.

నిజానికి 'వారణాసి' మేకింగ్ అంత సులభమైన వ్యవహారం కాదు. ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా, పురాణ కాలం ఇలా కథలో విభిన్నమైన ప్రపంచాలు కనిపించబోతున్నాయి. ఒక్కో ఎపిసోడ్‌ను తెరకెక్కించడం ఒక్కో సినిమా తీసినట్లుగా అనిపించిందని రాజమౌళి చెప్పారు. దాదాపు ఆరేడు సినిమాలను ఒకే సినిమాలో కలిపిన అనుభవం ఎదురైందట. ఇలాంటి ప్రాజెక్టులో షూటింగ్ రోజులు తగ్గడం నిర్మాతలకు కూడా కలిసొచ్చే అంశమే.

మరోవైపు గత జూన్‌లోనే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తయినట్లు రాజమౌళి వెల్లడించారు. అప్పటికి మిగిలిన మరికొన్ని సన్నివేశాల కోసం మరో 80 రోజులు అవసరమని చెప్పారు. అక్టోబర్ మూడో వారం నాటికి షూటింగ్ చివరి దశకు చేరుకుందని, ఇంకా పది రోజుల పని మాత్రమే మిగిలిందని తెలిపారు. అంటే ఏప్రిల్ రిలీజ్‌కు ముందు ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడక్షన్‌కు కేటాయించేలా ప్లాన్ చేసుకున్నారు.

అయితే షూటింగ్ రోజులు తగ్గినంత మాత్రాన సినిమా పని కూడా తగ్గిపోయిందని అనుకోలేం. ముఖ్యంగా 'వారణాసి'లో విజువల్ ఎఫెక్ట్స్‌కు భారీ ప్రాధాన్యం ఉంది. వేర్వేరు కాలాలు, ప్రాంతాలకు సంబంధించిన సన్నివేశాలను ఒకే కథలో చూపించాల్సి ఉంటుంది. పైగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌కు తగ్గట్లుగా సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో సెట్స్ మీద ఆదా చేసిన సమయం టెక్నికల్ వర్క్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది కీలకం.

2027 ఏప్రిల్ 7న 'వారణాసి' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో వచ్చే నెలల్లో టెక్నికల్ వర్క్, ప్రమోషన్లపై ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత వచ్చిన అనుభవాన్ని షూటింగ్ ప్లానింగ్‌లో ఉపయోగించుకున్న రాజమౌళి, ఈసారి రిలీజ్‌కు ముందే అన్ని పనులు పూర్తి చేయగలరా అనేది చూడాలి.

Tags:    
  • ssrajamouli 
  • maheshbabu 
  • varanasimovie 
  • ssmb29 
  • rrr 
  • priyankachopra 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS