• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాకెట్ రాకెట్స్ టీజర్.....

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

| డబ్బు సంపాదించాలనే ఆశ కొన్నిసార్లు మనుషులను ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తుందనే కథలు గతంలో చాలానే వచ్చాయి.

By - M Prashanth
Update: 2026-11-03 18:01 GMT

డబ్బు సంపాదించాలనే ఆశ కొన్నిసార్లు మనుషులను ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తుందనే కథలు గతంలో చాలానే వచ్చాయి. ఇప్పుడు అదే పాయింట్‌తో మరో సినిమా తెరకెక్కుతోంది. నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 'పాకెట్ రాకెట్స్' టీజర్ విడుదలైంది. అయితే రెగ్యులర్ క్రైమ్ కథలా కాకుండా యువకుల ఆశలు, విదేశాలకు వెళ్లాలనే కలలు, గ్యాంబ్లింగ్ చుట్టూ కథను నడిపించినట్లు కనిపిస్తోంది. టీజర్‌కు 'ది ఫస్ట్ హ్యాండ్' అనే పేరు పెట్టడం కూడా ఈ కాన్సెప్ట్‌కు సెట్ అయింది.




టీజర్ ప్రారంభంలోనే యువకుల మధ్య డబ్బు గురించి జరిగే డైలాగ్స్ హైలెట్ అయ్యాయి. ఒకవైపు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, మరోవైపు విదేశాలకు వెళ్లి జీవితాన్ని మార్చుకోవాలనే ఆశ కనిపిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంక ప్రస్తావన కూడా వస్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత డబ్బు సంపాదించేందుకు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారనేది కథలో కీలకంగా ఉండబోతోంది.

ముఖ్యంగా గ్యాంబ్లింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు టీజర్‌లో ఎక్కువగా ఉన్నాయి. డబ్బు సంపాదించడానికే ఆట ఆడకూడదని, పోగొట్టుకునే ధైర్యం ఉన్నప్పుడే ఆడాలనే డైలాగ్ తో జేడి చక్రవర్తి సర్ ప్రైజ్ ఇచ్చాడు. మరోవైపు గెలవడం మొదలుపెడితే వాళ్లు తిరిగి రారనే మాట కూడా ఉంది. దీంతో డబ్బు కోసం మొదలైన ఆట చివరికి ఎలాంటి సమస్యలకు దారితీసిందనే కోణంలో కథ సాగనున్నట్లు అర్థమవుతోంది.

టీజర్‌లో యూత్ కామెడీతో పాటు క్రైమ్ అంశాలను కూడా మిక్స్ చేశారు. అయితే కథ గురించి మరీ ఎక్కువగా బయటపెట్టలేదు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు, అసలు ఈ ఆట వెనుక ఉన్న వ్యక్తి ఎవరనే వివరాలను దాచిపెట్టారు. జేడీ చక్రవర్తి పాత్ర కూడా ఈ వ్యవహారంలో కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గ్యానీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ టోన్‌కు తగ్గట్లుగా ఉంది.

'కమిటీ కుర్రోళ్లు'తో గుర్తింపు తెచ్చుకున్న త్రినాధ్ వర్మ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. అతనితో పాటు నిర్మల్, శ్రియా కొంతం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే టీజర్‌లో ఒక్క నటుడిని మాత్రమే హైలైట్ చేయకుండా కథలోని పరిస్థితులను చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా డబ్బు కోసం యువకులు తీసుకునే నిర్ణయాలు, వాటి తర్వాత ఎదురయ్యే పరిణామాలపైనే సినిమా నడిచేలా ఉంది.

రుద్ర అత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిహారిక గతంలో 'కమిటీ కుర్రోళ్లు'తో గ్రామీణ కథను ఎంచుకోగా, ఈసారి పూర్తిగా అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లోకి వచ్చారు. టీజర్‌లో కాన్సెప్ట్‌ను పరిచయం చేసినప్పటికీ అసలు కథను ఎక్కువగా రివీల్ చేయలేదు. ముఖ్యంగా గ్యాంబ్లింగ్ ఎపిసోడ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ తరహా కంటెంట్ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి.


Full View


Tags:    
  • pocketrockkets 
  • niharikakonidela 
  • jdchakravarthy 
  • pocketrockketsteaser 
  • tollywood 

Similar News

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

Copyright @2026

Powered by Blink CMS