• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాన్ ఇండియాను దాటి పాన్...

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

| ఇప్పటివరకు ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. ఇంకా చాలా సినిమాలు ఈ స్థాయిలో తెరకెక్కుతున్నాయి.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-03 18:16 GMT

ఇప్పటివరకు ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. ఇంకా చాలా సినిమాలు ఈ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. కానీ సౌత్ లేదా.. తెలుగు సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో రాజమౌళి పేరు ముందుగా వినిపిస్తుంది. ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యాయి.

ఇప్పుడు రాజమౌళి మరోసారి అలాంటి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఎప్పటినుంచో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న మహాభారతం సినిమాపై ఇప్పుడు మరోసారి ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.

రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ.. రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తే మాత్రం దానిపై అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి. ఆయన కథను చెప్పే విధానం, భారీ విజువల్స్, పాత్రలను చూపించే తీరు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తాయి. దాంతో ఈ దర్శకుడు ఎప్పుడు మహాభారతం తీస్తారా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా నటుడు రాజీవ్ కనకాల ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ, రాజమౌళి తనతో మహాభారతం సినిమా గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

"ఎప్పటికైనా మహాభారతం తీస్తాను రాజా. చాలా డీటెయిల్‌గా తీస్తాను. అందులో ప్రతి స్టార్ ఉంటాడు. ప్రతి నటుడికి ఒక పాత్ర ఉంటుంది" అని రాజమౌళి చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

ఈ మాటలు ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మహాభారతం వంటి భారీ కథను రాజమౌళి తెరకెక్కిస్తే, అందులో దేశంలోని ప్రముఖ నటీనటులు కనిపించే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి. రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తే అది కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. బాహుబలి సినిమాతో భారతీయ సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి, ఈసారి అంతకుమించిన విజువల్ వండర్‌ను అందిస్తారనే అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రతి యాక్టర్ ఉంటారు అనడంతో.. రాజమౌళి ఈ ప్రాజెక్టుని ఎంత ఘనంగా తెరకెక్కించాలి అన్న ఐడియాలో ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది.

మహాభారతంలో ఎన్నో ముఖ్యమైన పాత్రలు, భావోద్వేగాలు, యుద్ధాలు, కుటుంబ సంబంధాలు ఉంటాయి. వీటన్నింటినీ తెరపై చూపించాలంటే భారీ బడ్జెట్‌తో పాటు చాలా సమయం కూడా అవసరం. రాజమౌళి ఈ కథను ఎంతో వివరంగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలి అంతే ఇంకా చాలా సంవత్సరాలు వేచి చూడక మాత్రం తప్పదు.

Tags:    
  • ssrajamouli 
  • mahabharata 
  • rajeevkanakala 
  • rajamoulima​​habharata 
  • mahabharatamovie 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS