• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాన్ ఇండియా సినిమాలకు.....

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

| వందల కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్, ప్రపంచ మార్కెట్.. ఇప్పుడు స్టార్ దర్శకుల సినిమాలన్నీ ఈ రేంజ్‌లోనే ఉంటున్నాయి.

By - M Prashanth
Update: 2026-11-03 19:30 GMT

వందల కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్, ప్రపంచ మార్కెట్.. ఇప్పుడు స్టార్ దర్శకుల సినిమాలన్నీ ఈ రేంజ్‌లోనే ఉంటున్నాయి. అయితే ఈ భారీ సినిమాల కథలు గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. చాలామంది దర్శకులు ప్రస్తుత కాలంలో జరిగే కథల కంటే గతంలో జరిగిన సంఘటనలు, పురాణాలు, కల్పిత ప్రపంచాల వైపే ఎక్కువగా వెళ్తున్నారు. ఒకప్పుడు మన చుట్టూ జరిగే కథలతో హిట్లు ఇచ్చిన దర్శకులు కూడా ఇప్పుడు భారీ కాన్వాస్ కోసం కాలాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. అసలు వర్తమానంలో జరిగే కథతో పాన్ ఇండియా సినిమా తీయడం అంత కష్టమా అనే డౌట్ వస్తోంది.

రాజమౌళి 'మగధీర'లో నాలుగు వందల ఏళ్ల వెనక్కి వెళ్లారు. 'బాహుబలి' కోసం ఓ కల్పిత రాజ్యాన్ని సృష్టించారు. 'ఆర్ఆర్ఆర్'లో బ్రిటిష్ కాలాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి'లో టైమ్ ట్రావెల్‌తో పాటు పురాణ కాలాన్ని కూడా చూపించబోతున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' కోసం 1970, 80ల నేపథ్యాన్ని తీసుకున్నారు. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో పీరియడ్ కథలకు మరింత క్రేజ్ పెరిగింది.

ఇక సుకుమార్ 'పుష్ప'ను 1990ల నేపథ్యంలో తెరకెక్కించారు. కొరటాల శివ కూడా ఎన్టీఆర్ 'దేవర' కోసం 1980, 90ల కాలాన్ని ఎంచుకున్నారు. నాగ్ అశ్విన్ మరో అడుగు ముందుకేసి 'కల్కి 2898 ఏడీ'లో భవిష్యత్తును పురాణాలతో కలిపారు. ఇలా దర్శకులందరూ వేర్వేరు కథలు చెప్పినా ఒక పోలిక మాత్రం కనిపిస్తోంది. భారీ సినిమా అనగానే ఇప్పటి సమాజంలో జరిగే సంఘటనల కంటే మరో కాలానికి సంబంధించిన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

దీనికి కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు. గత కాలం నేపథ్యంలో కథ రాసుకుంటే దర్శకుడికి కొత్త ప్రపంచాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. భారీ సెట్స్, ప్రత్యేకమైన ఆయుధాలు, హీరోకు భిన్నమైన గెటప్, పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్‌కు మంచి స్కోప్ దొరుకుతుంది. పైగా అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో జరిగే కథ అయితే మొబైల్ ఫోన్లు, టెక్నాలజీ, సోషల్ మీడియా వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కథలో చిన్న లాజిక్ మిస్సయినా ప్రేక్షకులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది.

అయితే ప్రస్తుతం జరిగే కథలతో భారీ విజయాలు రావనే పరిస్థితి లేదు. సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'తో ఆ విషయాన్ని చూపించారు. ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న 'స్పిరిట్' కూడా పోలీస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ప్రశాంత్ నీల్ స్టైల్ వేరు. టైమ్ తో సంబంధం లేకుండా 'సలార్'లోనూ గత చరిత్ర ఆధారంగా కాకుండా సొంతంగా సృష్టించిన ఖాన్సార్ ప్రపంచాన్ని చూపించారు. అంటే భారీ బడ్జెట్‌కు పీరియడ్ కథ తప్పనిసరి కాదు. దర్శకుడు ఎంచుకున్న కథలో ఎంత ఎమోషన్ క్లాష్ ఉందనేదే కీలకం.

మరోవైపు ప్రస్తుత కాలంలో జరిగే కథలకు ప్రాంతీయ నేపథ్యం కూడా కీలకంగా మారుతుంది. హైదరాబాద్‌లో జరిగే కథను ముంబై ప్రేక్షకులకు, అక్కడి కథను తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ చేయడం దర్శకులకు మరో ఛాలెంజ్. అదే పురాణాలు, చారిత్రక నేపథ్యాలు తీసుకుంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు కొంత పరిచయం ఉంటుంది. అయితే 'పుష్ప', 'కేజీఎఫ్' లాంటి సినిమాలు స్థానిక నేపథ్యంతోనే దేశవ్యాప్తంగా ఆదరణ పొందినవి. కానీ దర్శకులు ఇంకాస్త అడ్వాంటేజ్ గా న్యూ వరల్డ్ క్రియేట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇప్పటికే త్రివిక్రమ్ పురాణ నేపథ్యంతో ఎన్టీఆర్ సినిమా చేయడానికి సిద్ధమవుతుండగా, సుకుమార్ తదుపరి రామ్ చరణ్ ప్రాజెక్టులోనూ కృష్ణుడికి సంబంధించిన అంశాలపై ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమా కథపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. మరోవైపు రాజమౌళి 'వారణాసి'తో ఏకంగా వివిధ కాలాల్లోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతున్నారు. ఈ దర్శకులంతా గతంలో వర్తమాన కథలతోనూ ప్రేక్షకులను మెప్పించినవాళ్లే. ఇప్పుడు మాత్రం పెద్ద కాన్వాస్ కోసం కాలాన్ని మార్చుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇదే స్థాయి బడ్జెట్‌తో నేటి సమాజంలో జరిగే కథను ఎవరు ఎంచుకుంటారో చూడాలి.

Tags:    
  • panindiamovies 
  • tollywooddirectors 
  • indianacinema 
  • periodfilms 
  • mythologymovies 

Similar News

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS