ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!
| సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇంకా స్టార్ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇంకా స్టార్ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతకు విరుద్ధంగా.. ఆడవారిలో మార్పులు వస్తే ఇండస్ట్రీలో అవకాశాల రావు అనే కామెంట్లకు ధీటుగా తనదైన శైలిలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతోంది అంటే.. కచ్చితంగా ఆయా సినిమాలలో నటించిన నటీనటులు.. చిత్ర బృందం సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్ పేరిట పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వైరల్ చేస్తూ ఉంటారు. అయితే నయనతార మాత్రం ప్రమోషన్ కి రాదు అనే ముద్ర ఎప్పటినుంచో వేయించుకుంది. మధ్యలో మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి అనూహ్యంగా ప్రమోట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈమె.. ఆ తర్వాత వచ్చిన మరో చిత్రానికి ఆమె ప్రమోషన్ చేయలేదు. కానీ ఇప్పుడు వినూత్న పద్ధతిలో ఎవరూ ఊహించని విధంగా ప్రమోషన్ మొదలుపెట్టినట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ్ ఫాంటసీ భక్తి థ్రిల్లర్ చిత్రం మూకుత్తి అమ్మన్. ఇందులో నయనతార అమ్మవారిగా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అమ్మోరు తల్లి పేరిట రిలీజ్ చేసి పర్వాలేదు అనిపించుకున్నారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ 2 పేరిట నవంబర్ 6వ తేదీన దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. పైగా ఈ చిత్రానికి సుందర్. సి దర్శకత్వం వహిస్తుండడం, అటు రెజీనా కసాండ్రా విలన్ పాత్ర పోషిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా దునియా విజయ్ కూడా ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఊర్వశి, యోగి బాబు, అభినయ, రామచంద్రరాజు, స్నేహ , మీనా లాంటి భారీ తారాగణం ఇందులో భాగమవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
పైగా నయనతార లేడీ ఓరియంటెడ్ మూవీ గా వస్తున్న ఈ చిత్రాన్ని నయనతార స్వయంగా తన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై అవ్నీ సినిమాక్స్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు ఈ సినిమా ప్రమోషన్స్ లో నయనతార పాల్గొంటుందా? లేదా? అనే అనుమానాలు ఒకవైపు వ్యక్తం అవుతుంటే.. మరొకవైపు ఎవరు ఊహించని విధంగా ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది నయనతార. ఈ మేరకు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ పంచుకుంది నయనతార.
తాజాగా పూజ గది నుండి కొన్ని ఫోటోలను పంచుకుంది నయనతార. అందులో సాంప్రదాయంగా ప్లెయిన్ బ్లూ కలర్ చీరకి ఆరెంజ్ కలర్ బార్డర్ తో చక్కగా డిజైన్ చేసిన చీరను కట్టుకున్న ఈమె.. జుట్టును ముడిపెట్టి మల్లె పువ్వులు పెట్టుకొని చాలా నిండుగా సాంప్రదాయంగా కనిపించింది. ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. "మూకుత్తి అమ్మన్ 2.. రైజ్ ఆఫ్ మహాశక్తి.. ఈ దీపావళికి మీ అందరూ థియేటర్లో ఈ సినిమా చూడండి.. ఓం శక్తి" అంటూ క్యాప్షన్ జోడించింది. మొత్తానికైతే సినిమా విడుదల తేదీకి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నయనతార ఇలా ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రమోషన్ మొదలుపెట్టడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది ఇకపోతే ఈ సినిమా ఒకరోజు ముందుగానే అనగా నవంబర్ 5న ప్రీమియర్స్ వెయ్యనున్నారు.