ముఖంపై మచ్చలు.. దాపరికం లేని టాప్ హీరోయిన్
జాక్విలిన్ తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసిన ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి.;
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా హీరోయిన్లు తెరపైనో.. సోషల్ మీడియాలోనో కనిపించినప్పుడు ఎంతో పర్‌ఫెక్ట్‌గా.. మేకప్‌తో మెరిసిపోతుంటారు. కానీ జాక్విలిన్ మాత్రం ఇందుకు భిన్నంగా తన సహజ సిద్ధమైన అందాన్ని ప్రదర్శించడానికి ఏమాత్రం సంకోచించలేదు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోల్లో తన ముఖంపై ఉన్న నల్ల మచ్చలను దాచుకోకుండా మేకప్ లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
జాక్విలిన్ తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసిన ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. ``నన్ను మీరు బ్లాక్ అండ్ వైట్‌లో చూసినా.. నా ఆత్మ మాత్రం చాలా కలర్‌ఫుల్ అని తెలుసుకోండి`` అనే క్యాప్షన్‌తో జాకీ ఈ ఫోటోలను షేర్ చేశారు. ముఖంపై స్పష్టంగా కనిపిస్తున్న నల్ల మచ్చలతో ఆమె ఎంతో ధైర్యంగా కెమెరాకు పోజులివ్వడం విశేషం. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తన నిజాయితీని.. తన లోపాలను కూడా ప్రేమించే గుణాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు.
సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల అందం అంటే కేవలం ఫోటోగ్రఫిక్ జిమ్మిక్కులు.. మేకప్ మాయాజాలం అని చాలామంది భావిస్తుంటారు. అయితే జాక్విలిన్ ఈ ఫోటోల ద్వారా ఆ అంచనాలను పటాపంచలు చేశారు. వెండితెరపై మెరిసే అందాల వెనుక కూడా సామాన్యుల లాగే చర్మ సమస్యలు ఉంటాయని.. వాటిని చూసి ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరం లేదని ఈ శ్రీలంకన్ బ్యూటీ పరోక్షంగా సందేశమిచ్చారు. నిజమైన అందం అంటే పైపై మెరుగులు కాదని.. మనలోని ఆత్మవిశ్వాసమేనని జాకీ నిరూపించారు.
కెరీర్ పరంగా చూస్తే.. జాక్విలిన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన తదుపరి సినిమాల జాబితాలో `ఫతే` వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. సోను సూద్ సరసన జాక్విలిన్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని బాలీవుడ్ చిత్రాల్లో జాకీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివాదాలు ఎన్ని ఉన్నా.. వృత్తిపరంగా, వ్యక్తిత్వ పరంగా జాక్విలిన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
మొత్తానికి ముఖంపై నల్ల మచ్చలు ఉన్నా ఏమాత్రం దాపరికం లేకుండా తన సహజ సౌందర్యాన్ని ఆవిష్కరించిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ యువతకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. పర్‌ఫెక్షన్ కోసం వెంపర్లాడే నేటి కాలంలో, మనల్ని మనం ఎలా ఉన్నామో అలా స్వీకరించడం, ప్రేమించడం ఎంత ముఖ్యమో ఈ ఫోటోల ద్వారా చాటి చెప్పారు. అందుకే ఈ `నో మేకప్` లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రభాస్ సాహో లో బ్యాడ్ బోయ్ సాంగ్ లో నర్తించిన జాక్విలిన్ ప్రస్తుతం భారీ మల్టీస్టారర్ వెల్ కం టు ద జంగిల్ లో నటిస్తోంది.