బ్రేక‌ప్ కాంబినేష్ కి కార‌ణం త‌న‌యుడికీ తెలియ‌దు!

ఈ విష‌యంపై రాజ్ గానీ, కోటి గానీ ఎక్క‌డా స్పందించ‌లేదు. తాజాగా కోటి త‌న‌యుడు రాజీవ్ ని ఇదే విష‌యం ఆడిగి తే ఆ సంగ‌తి మాత్రం వారిద్ద‌రి మ‌ద్యే ఉంది త‌ప్ప త‌న‌కు కూడా ఏం తెలియ‌ద‌నేసాడు.;

Update: 2025-12-25 22:30 GMT

సంగీత ద్వ‌యం రాజ్-కోటి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఎన్నో హిట్ ఆల్బ‌మ్స్ వ‌చ్చాయి. `ప్ర‌ళ‌య గ‌ర్జ‌న` సినిమాతో ఇద్ద‌రి కెరీర్ ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి క‌లిసి ఎన్నో సినిమాల‌కు ప‌ని చేసారు. రాజ్ కోటి ఇద్ద‌ర్నీ చూసి వారిద్ద‌రు అన్న‌ద‌మ్ములా అనుకునేవారు. ఇద్ద‌రు కూడా ఒకేలా ఉండేవారు. క‌లిసి సినిమా ప్ర‌య‌త్నాలు చేయ‌డం...స‌క్సెస్ అవ్వ‌డం జ‌రిగింది. కానీ వారిద్ద‌రు కేవ‌లం స్నేహితులు మాత్ర‌మే. ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి ర‌క్త సంబంధం లేదు. కానీ ప‌రిశ్ర‌మ మాత్రం అన్న‌ద‌మ్ములుగానే ట్రీట్ చేస్తుంది.

దాదాపు ఇద్ద‌రు క‌లిసి 1995 వ‌ర‌కూ ప‌ని చేసారు. ఆ త‌ర్వాత స‌ప‌రేట్ అయ్యారు. అయితే కోటి స‌క్సెస్ అయినంత‌గా విడిపోయిన త‌ర్వాత‌ రాజ్ స‌క్సెస్ అవ్వ‌లేదు. ఎక్కువ‌గా సినిమాలకు కూడా రాజ్ ప‌ని చేయ‌లేదు. రాజ్ 1995లో `సిసింద్రీ` సినిమాకు సంగీతం అందించారు. ఆ త‌ర్వాత `భ‌ర‌త సింహం`, `రాముడొచ్చాడు`, `మృగం`, `బొబ్బ‌లి బుల్లోడు`, ` పంజ‌రం`, `ప్రేమంటే ఇదేరా`, `చిన్ని చిన్న ఆశ‌`, `ప్రేమ కోసం` సినిమాల‌కు సంగీతం అందించారు. రాజ్ మాత్రం అప్ప‌టికే పుల్ బిజీగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ సంగీత ద్వ‌యం ఏ కార‌ణంగా విడిపోయారు? అన్న‌ది ఇప్ప‌టికీ కూడా మిస్ట‌రీగానే ఉంది.

ఈ విష‌యంపై రాజ్ గానీ, కోటి గానీ ఎక్క‌డా స్పందించ‌లేదు. తాజాగా కోటి త‌న‌యుడు రాజీవ్ ని ఇదే విష‌యం ఆడిగి తే ఆ సంగ‌తి మాత్రం వారిద్ద‌రి మ‌ద్యే ఉంది త‌ప్ప త‌న‌కు కూడా ఏం తెలియ‌ద‌నేసాడు. కానీ క‌లిసి ఉన్నంత కాలం ఎంతో అన్యోన్యంగా ఉండేవార‌న్నారు. `అల్లుడా మ‌జాకా` స‌మ‌యంలో ఇద్ద‌రి విడిపోయి ఉండొచ్చ‌ని రాజీవ్ గెస్ చేసాడు. రాజ్ చివ‌రిగా `ల‌గ్న ప‌త్రిక` సినిమాకు సంగీతం అందించారు. ఆ త‌ర్వాత ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఆయ‌న వార‌సులు కూడా ఇండ‌స్ట్రీలో ఎక్క‌డా తెర‌పైకి రాలేదు. కోటి త‌న‌యుడు రాజీవ్ మాత్రం న‌టుడిగా కొన‌సాగుతున్నాడు.

హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. కానీ ఇంకా ఎదిగే ప్ర‌య‌త్నంలోనే ఉన్నాడు. అయితే ఇండ‌స్ట్రీలో కోటి త‌న అనుభ వాన్ని స్పూర్తిగా తీసుకోమ‌ని త‌న‌యుడిని ఎంతో ఇన్ స్పైర్ చేసార‌ని రాజీవ్ మాట‌ల్లో అర్ద‌మ‌వుతుంది. ఏ ప‌ని చేసినా? సీరియ‌స్ గా ఫోక‌స్డ్ గా చేసిన‌ప్పుడే స‌క్సెస్ వ‌స్తుందని తామంతా అలా క‌ష్ట‌ప‌డ్డ వాళ్లంగానే గుర్తు చేసార‌న్నాడు. రాజ్-కోటి ఇద్ద‌రు సంగీత దిగ్గ‌జం చ‌క్ర‌వ‌ర్తి వ‌ద్ద కొన్ని వంద‌ల సినిమాల‌కు అసిస్టెంట్ గా ప‌నిచేసిన వారే. అక్క‌డ రాటు దేలిన త‌ర్వాతే క‌లిసి ప్ర‌యాణంమొద‌లు పెట్టారు.

Tags:    

Similar News