ప‌వ‌న్ స్పీచ్ లాగే పార్తీబ‌న్ డ్రెస్ కూడా!

విలక్షణ నటుడు, దర్శకుడు పార్తీబన్ అంటేనే వైవిధ్యానికి మారుపేరు. ఆయన సినిమాలే కాదు. ఆయన వేసుకునే దుస్తులు కూడా ఎంతో విభిన్నంగా ఓ అంతరార్థాన్ని కలిగి ఉంటాయి.;

Update: 2026-03-16 18:33 GMT

విలక్షణ నటుడు, దర్శకుడు పార్తీబన్ అంటేనే వైవిధ్యానికి మారుపేరు. ఆయన సినిమాలే కాదు. ఆయన వేసుకునే దుస్తులు కూడా ఎంతో విభిన్నంగా ఓ అంతరార్థాన్ని కలిగి ఉంటాయి. తాజాగా జరిగిన `ఉస్తాద్ భగత్ సింగ్` వేడుకలో పార్తీబన్ ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా సినిమా ఈవెంట్లకు సెలబ్రిటీలు ఫార్మల్ సూట్లు లేదా సంప్రదాయ వస్త్రాల్లో అటెండ్ అవుతుంటారు. కానీ పార్తీబన్ మాత్రం ఓ సరికొత్త కాన్సెప్ట్ డ్రెస్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు.




ఆయన ధరించిన ఆ దుస్తుల మీద ఉన్న డిజైన్లను గమనిస్తే? అది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు. ఆ డ్రెస్‌పై ఉన్న రంగులు, గీతలు ఆయనలోని సృజనాత్మకతకు అద్దం పడుతున్నాయి. స్టేజ్ మీద ఆయన నడుచుకుంటూ వస్తుంటే? ప్రతి ఒక్కరి కళ్లు ఆయన ఆహార్యం పైనే ప్ర‌స‌రించాయి. తన సినిమాల్లో ప్రయోగాలు చేసినట్టే తన డ్రెస్సింగ్ విషయంలో కూడా ప్రయోక్త అని మరోసారి నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఆ డ్రెస్ మీద ఉన్న డిజైన్ పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌కు పార్తీబన్ విలక్షణతకు మధ్య ఒక వారధిలా అనిపించింది.

పార్తీబన్ ఎల్ల‌ప్పుడు ఆహార్యం ద్వారా ఓ సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో? ఆయన ధరించిన ఈ విభిన్నమైన డ్రెస్ ఒక చిన్న హింట్ ఇస్తోందని అభిమానులు విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ డ్రెస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పార్తీబన్ గారు ఏం చేసినా అందులో ఒక లాజిక్ ఉంటుంది. ఈ డ్రెస్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో సినిమా చూస్తే అర్థమవుతుందేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్ పక్కన ఉన్నప్పుడు కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, ఆకర్షణను ఈ డ్రెస్ ద్వారా పార్తీబన్ సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు.

మొత్తానికి `ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎంత హైలైట్ అయిందో? పార్తీబన్ డ్రెస్ కూడా అంతే చర్చనీయాంశమైంది. ఫ్యాషన్ ప్రపంచంలో కూడా పార్తీబన్ ఒక ట్రెండ్ సెట్టర్ అని ఈ ఒక్క ఈవెంట్‌తో అర్థమైపోయింది. మ‌రి ఈ విలక్షణ నటుడు వెండితెరపై పవన్‌తో కలిసి ఎలాంటి రచ్చకు తెర తీస్తారో చూడాలి. ఇటీవ‌ల కాలంలో పార్తీబ‌న్ పేరు వార్త‌ల్లోనూ అగ్ర‌ప‌థాన నిలిచిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ -త్రిష్ గురించి కామెంట్ చేయ‌డం ప్ర‌తిగా త్రిష కౌంట‌ర్ ఇవ్వ‌డం కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News