'యూత్' మూవీ.. 'చమికి' సాంగ్ తో మరింత బజ్!

ప్రేమ కథను కొత్త తరహాలో యూత్‌ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్‌ తో చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.;

Update: 2026-03-16 18:28 GMT

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రేమ కథను కొత్త తరహాలో యూత్‌ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్‌ తో చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పుడు అదే జానర్‌ లో తమిళంలో రూపొందిన మరో చిత్రం యూత్ త్వరలోనే తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది.




యువ నటుడు కెన్ కరునాస్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాను ఇదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు కూడా అందిస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఆ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించగా, అనిష్మ అనిల్ కుమార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటి దేవదర్శిని చేతన్, మలయాళ నటుడు సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

యూత్ బాగా అట్రాక్ట్ అయ్యే లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఆ సినిమా నుంచి తాజాగా విడుదలైన చమికి పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఎంతో వెయిట్ చేస్తున్న ఇయర్ లోనే బ్లాక్ బస్టర్ సాంగ్ వచ్చేసిందంటూ మేకర్స్ రిలీజ్ చేశారు. వైబ్ అవ్వడం స్టార్ట్ చేయండని పోస్ట్ చేశారు. ఆ పాటకు సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ అందించారు.

సాహిత్యాన్ని భాస్కరభట్ల రవికుమార్ అందించగా.. కెన్ కరునాస్, సింజిత్ ఎర్రమ్మిల్ ఆలపించారు. స్టూడియో వాతావరణంలో ఎక్కువగా చిత్రీకరించిన ఆ పాటలో హీరో హీరోయిన్ల మధ్య క్యూట్ లవ్ ట్రాక్ చూపించారు. సింపుల్ కంపోజిషన్, నేచురల్ విజువల్స్ సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విడుదలైన కొద్దిసేపటికే వైరల్ అవుతూ మంచి వ్యూస్ సంపాదిస్తోంది.

ఇటీవల ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేశారు. ఆ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ విడుదలైన తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇటీవలి కాలంలో మలయాళంలో రూపొందిన ప్రేమలు తెలుగు డబ్బింగ్‌ లో ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే యూత్ ఫుల్ కంటెంట్‌ తో వచ్చిన లిటిల్ హార్ట్స్ మంచి ఆదరణ పొందింది.

అదే తరహాలో యూత్‌ ను ఆకట్టుకునే ప్రేమ కథతో వస్తున్న యూత్ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. ఆ చిత్రాన్ని పారవతా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై కరుపయ్య సి. రామ్, సులోచన కుమార్ నిర్మించారు. తెలుగు విడుదల బాధ్యతలు ఈ2సీ టాకీస్ సంస్థ చేపట్టింది. ఏదేమైనా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, తాజాగా వచ్చిన చమికి పాటతో సినిమాపై యూత్‌ లో ఆసక్తి మరింత పెరుగుతోంది. మార్చి 26వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News