మోత కోలీవుడ్ లో మోగితే? సౌండింగ్ టాలీవుడ్ లో!
ఈ సంతోషం వెనుక ఉన్న అసలు కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ పాన్-ఇండియా చిత్రం `రాకా`.
దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త శబ్దం వినిపిస్తూ శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న `OM` చిత్రం నుంచి విడుదలైన `వీళ వీరా` పాట సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. తమిళ హీరో ధనుష్ సినిమా పాట హిట్ అయితే? తమిళ సంగీత ప్రియులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు ఆమూవ్ మెంట్ ను ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఇండస్ట్రీలో కొత్త ట్రెండింగ్ గా మారింది.
ఈ సంతోషం వెనుక ఉన్న అసలు కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ పాన్-ఇండియా చిత్రం `రాకా`. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా అట్లీ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్‌నే ఎంచుకున్నారు. అల్లు అర్జున్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న గ్లోబల్ స్టార్ సినిమాకు ఇంకా అనుభవం లేని కుర్రాడిని తీసుకుంటున్నారని గతంలో అభిమానుల్లో సందేహాలు ఉండేవి. కానీ ఇప్పుడు ధనుష్ సినిమాకు సాయి అందించిన మాస్.. ఎనర్జెటిక్ సాంగ్ విన్నాక బన్నీ ఫ్యాన్స్ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి.
సాయి అభ్యంకర్ స్వయంగా స్వరపరిచి పాడిన `వీళ వీరా` పాటలోని బీట్స్, ప్రెజెంటేషన్ శ్రోతలను ఆకట్టు కుంటున్నాయి. చిన్న పాటే ఈ స్థాయి ఊపు తెచ్చిందంటే? రేపు అల్లు అర్జున్ – అట్లీ లాంటి లార్జర్ ద్యాన్ లైఫ్ కాంబి నేషన్ కోసం సాయి ఎలాంటి విజ్యువల్ వండర్ మ్యూజిక్ అందిస్తారోనని అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రతిభను సరిగ్గా గుర్తించి యంగ్ బ్లడ్‌ను ప్రాజెక్ట్‌లోకి తెచ్చినందుకు అట్లీ విజన్‌ను నెటిజన్లు, ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ యంగ్ కంపోజర్‌గా ఎదుగుతున్న సాయి అభ్యంకర్ సరికొత్త సౌండింగ్‌తో క్లాస్, మాస్ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలరని ఈ పాటతో మరోసారి రుజువైంది. ఒకే ఒక్క పాటతో శ్రోతల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా అల్లు అర్జున్ సినిమా ఆల్బమ్‌పై ఉన్న ఆందోళనలను తుడిచేసి కొండంత నమ్మకాన్ని నింపడం విశేషం.
పాటల హిట్ కాంబినేషన్ల ప్రభావం బాక్సాఫీస్ ఓపెనింగ్స్‌పై ఎంతగానో ఉంటుంది. `రాకా` మూవీ వైబ్ పూర్తి స్థాయిలో మొదలు కాకముందే? మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ ఆధారంగా సోషల్ మీడియాలో ఈ స్థాయిలో హైప్ రావడం సినిమా ప్రమోషన్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతుంది. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌కి.. సాయి ఇచ్చే ట్రెండీ అండ్ మాస్ బీట్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి ధనుష్ సినిమాలో పాట.. టాలీవుడ్‌లో బన్నీ ఫ్యాన్స్‌కు పండుగ చేసుకునేంత కిక్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. యంగ్ మ్యూజిషియన్ సాయి అభ్యంకర్ క్రేజ్ రోజురోజుకూ రెట్టింపు అవ్వడంతో? రాబోయే రోజుల్లో `రాకా` ఆల్బమ్ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.