అన్ని ఇండస్ట్రీలు ఒక్కటై అద్భుతాన్ని బతికిద్దాం!

భార‌తీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే మ‌రో ప్రతిష్టాత్మక చిత్రంగా `రామాయణ` హైలైట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-10-20 12:18 GMT

భార‌తీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే మ‌రో ప్రతిష్టాత్మక చిత్రంగా `రామాయణ` హైలైట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో నటిస్తూ.. సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న‌ రాకింగ్ స్టార్ యశ్ తాజాగా సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దేశపు గొప్ప ఇతి హాసాన్ని గొప్ప‌ దృశ్యకావ్యంగా మలుస్తున్న తరుణంలో ప్రేక్షకాభిమానులు చిన్న చిన్న లోపాలను వెతకడం మానేసి అంతా ఒక్కటై ఈ అద్భుతాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఇండియ‌న్ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పే దిశగా ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతుంద‌ని తెలిపారు. అయితే ఈ స్థాయి విజువల్ గ్రాండియర్ సినిమాల విషయంలో టెక్నికల్ పరంగా జరిగే చిన్న చిన్న వీఎఫ్‌ఎక్స్ లోపాలను భూతద్దంలో పెట్టి చూడొద్ద‌ని కోరారు. ఇలాంటి ప్రయత్నాలను విమర్శించడం కంటే దేశపు సంస్కృతిని తెరపైకి తెస్తోన్న‌ బృహత్ ప్రయత్నాన్ని అంతా కలిసి రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమోష‌న‌ల్ అయ్యారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీస్ అన్నీ వేర్వేరు కాదని.. ప్రాంతీయ భేదాలను పక్కనపెట్టి మనమందరం ఒక్కటే అనే భావనతో ముందుకు రావాలని యశ్ అభిప్రాయపడ్డారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ అనే తేడాలు లేకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఇలాంటి అద్భుతాలను బతికించాలని ఆయన కోరారు. `అన్ని ఇండస్ట్రీలు ఒక్కటై ఈ అద్భుతాన్ని బతికిద్దాం.. ప్రపంచానికి మన సత్తా ఏంటో చూపిద్దాం` అంటూ యశ్ ఇచ్చిన పిలుపు సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

అలాగే నితీష్ తివారీ ఈ ప్రాజెక్ట్ కోసం యూనిట్ పడుతున్న కష్టాన్ని యశ్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇదొక‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదని దేశపు ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఎలాంటి ముదస్తు దురభిప్రాయాలు లేకుండా ఓపెన్ మైండ్‌తో థియేటర్లలో చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ మేకర్స్ పడిన కష్టం.. కళాకారుల అంకితభావం స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు.

ప్రస్తుతం పాన్-ఇండియా చిత్రాల విషయంలో సోషల్ మీడియాలో జరిగే నెగెటివిటీ.. ట్రోలింగ్ గురించి ప్రస్తా వించారు. ఇలాంటి అత్యున్నత కళాఖండాల విడుదలకు ముందు అనవసరమైన లోపాలను వెతకడం వల్ల మన చిత్ర పరిశ్రమ మనమే కిందికి లాక్కున్నట్టు అవుతుందని యశ్ పరోక్షంగా హెచ్చరించారు. మన వాళ్లు తీస్తున్న గొప్ప చిత్రాలను మనమే ముందుండి ప్రమోట్ చేసుకుంటేనే.. గ్లోబల్ మార్కెట్‌లో ఇండియన్ సినిమాకు అసలైన గౌరవం దక్కుతుందని అభిప్రాయ ప‌డ్డారు.

మొత్తానికి `రామాయణ` లాంటి మహా ప్రాజెక్ట్‌ను గ్లోబల్ స్టేజ్‌పై విజయవంతం చేయడానికి యశ్ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త చర్చకు దారితీశాయి. ప్రాంతీయ విభేదాలను వీడి అందరూ ఒకే కుటుంబంలా కలిసి పనిచేస్తే ప్రపంచాన్ని ఏలే అద్భుతాలను సృష్టించవచ్చు అనే య‌శ్ ఆలోచన ప్రతి సినీ అభిమానిని ఆలోచింపజేసేలా ఉంది. యశ్ పిలుపు మేరకు ప్రేక్షకులు ఈ విజువల్ వండర్‌ను ఎలా ఆదరిస్తారనేది చూడాలి.

Tags:    

Similar News