సాఫ్ట్ వేర్ 'ఇంటి' వాడవుతున్నాడంట.. యంగ్ హీరో పెళ్లి ఫిక్స్?
ఆ విషయాలపై తేజ సజ్జా నుంచి కానీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
సినిమాల్లో వరుస విజయాలు.. చేతినిండా ప్రాజెక్టులు.. ఇలాంటి సమయంలో ఓ యంగ్ హీరో పెళ్లి గురించి కూడా ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఆయనే తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మిరాయ్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ హీరో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తేజ సజ్జాకు కాబోయే భార్య సాఫ్ట్ వేర్ ఫ్యామిలీకి చెందిన యువతి అని టాక్ వినిపిస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు రీసెంట్ గా మాట్లాడుకుని ఆ సంబంధాన్ని ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. లవ్ మ్యారేజ్ కాదని, అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలుస్తోంది. అంతేకాదు.. డిసెంబర్ లో పెళ్లి ముహూర్తం కూడా చూసినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ విషయాలపై తేజ సజ్జా నుంచి కానీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అమ్మాయి ఎవరు, పెళ్లి ఎప్పుడనే విషయాలపై కూడా క్లారిటీ లేదు. అయితే కొన్ని రోజుల క్రితం తేజ సజ్జాకు ఓ జ్యువెలరీ ఈవెంట్ లో పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగా, ఆ సమయంలో ఆయన ఇచ్చిన ఆన్సర్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.
'త్వరలోనే మీ పెళ్లి జరగబోతోందని వార్తలు వస్తున్నాయి.. అందుకే జ్యువెలరీ డిజైన్స్ కూడా సిద్ధం చేస్తున్నారా?' అని ఓ రిపోర్టర్ అడిగారు. దీనికి తేజ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. 'ఇది నా పెళ్లి డిస్కషన్ కాదు. నేను మ్యారేజ్ చేసుకోబోతున్నానని ఎక్కడా చెప్పలేదు' అని స్పష్టం చేశారు. కానీ అది జరిగిన కొన్ని రోజులకే తేజ సజ్జా పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు తేజ సజ్జా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. హనుమాన్ మూవీతో వచ్చిన గుర్తింపును కొత్త కథలను ఎంచుకుంటున్నారు. ఆయన నటించిన జాంబీ రెడ్డి మంచి విజయం సాధించడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌గా జాంబీ రెడ్డి 2 తెరకెక్కనుంది. భారీ యాక్షన్, కామెడీతో ఆ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. 2027లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ కూడా రానుంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఆ సినిమా రూపొందుతోంది. ఇక సినిమాలతో పాటు తేజ ఓటీటీలోనూ సందడి చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ది ట్రైటర్స్ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తమిళ దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు గతంలో వెల్లడించారు. కోలీవుడ్లోకి అడుగుపెట్టే విషయాన్ని కూడా చూస్తున్నారు. ఇలా కెరీర్ పరంగా కొత్త అవకాశాలను అందుకుంటున్న తేజ సజ్జా.. నిజంగానే పెళ్లికి సిద్ధమవుతున్నారా? డిసెంబర్ లో పెళ్లి జరగనుందనే ప్రచారంలో నిజమెంత? అనే విషయాలపై అఫీషియల్ గా రెస్పాన్స్ వస్తేనే క్లారిటీ వస్తుంది.