భారతీయుడు విజయాన్ని మరిపించేలా శంకర్ కసరత్తులు!
కథనంలో లోపాలు, ప్రేక్షకుల అంచనాలను అందుకో లేకపోవడంతో శంకర్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలా నిరాశపరచడం శంకర్ కెరీర్లోనే పెద్ద మచ్చగా మిగిలిపోయింది.
విశ్వనటుడు కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో రిలీజ్అ యిన `భారతీయుడు` ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ క్రేజ్‌తో దశాబ్దాల తర్వాత వచ్చిన సీక్వెల్ `ఇండియన్ 2` మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కథనంలో లోపాలు, ప్రేక్షకుల అంచనాలను అందుకో లేకపోవడంతో శంకర్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలా నిరాశపరచడం శంకర్ కెరీర్లోనే పెద్ద మచ్చగా మిగిలిపోయింది.
అయితే ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. `ఇండియన్ 2`తో పాటు సమాంతరంగా షూటింగ్ జరుపుకున్న `ఇండియన్ 3`విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్నో వివాదాలు, లీగల్ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నడుమ నలిగిన పార్ట్ 3 ఎట్టకేలకు మళ్లీ రీ-స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన భాగం షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ శంకర్ మాత్రం ఈ చిత్రాన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడానికి సిద్ధంగా లేరు. రెండవ భాగం ఫలితం ఇచ్చిన షాక్ నుంచి బయటపడి మూడో భాగాన్ని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే పూర్తయిన ఫుటేజ్‌ను శంకర్ స్వయంగా మళ్లీ క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఎడిటింగ్ టేబుల్ వద్ద ప్రతి సన్నివేశాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడైనా చిన్న లోపం ఉన్నా దాన్ని సరిచేసే పనిలో పడ్డారు. అవసరమైతే కొన్ని కీలక సన్నివేశాలను రీ-షూట్ చేయడానికి ... విజువల్ ఎఫెక్ట్స్ ను మరింత నాణ్యంగా మార్చడానికి వెను కాడటం లేదు. దీంతో శంకర్ పై పనిభారం రెట్టింపు అయినా? అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని శంకర్ పట్టుదలతో ఉన్నారు.
శంకర్ ముందున్న ప్రధాన లక్ష్యం ఒకటే..`ఇండియన్ 2` ఇచ్చిన చేదు జ్ఞాపకాలను తుడిచిపెట్టి తొలి చిత్రం `భారతీయుడు` సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ప్రేక్షకులకు మళ్లీ గుర్తుచేయడం. శంకర్ మార్క్ సామాజిక సందేశం, కమల్ హాసన్ నట విశ్వరూపం ఈ చిత్రంలో మునుపటి కంటే శక్తివంతంగా ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విజయం శంకర్ భవిష్యత్ ప్రాజెక్టులకు.. ఆయన ప్రతిష్టకు అత్యంత కీలకంగా మారింది.
ఫ్రాంచైజీలోని మూడో భాగం కథపరంగా ఎంతో ఇంటెన్స్‌గా ఉంటుందని.. ముఖ్యంగా వీరసేకరన్ కాలంనాటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. `ఇండియన్ 2`లో లోపించిన ఎమోషన్, పవర్ ఫుల్ డైలాగులు `ఇండియన్ 3`లో పుష్కలంగా ఉంటాయని ఆశిస్తున్నారు. అందుకే శంకర్ రేపటి ఫలితం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
చివరిగా విమర్శకులకు తన పనితనంతోనే సమాధానం చెప్పాలని శంకర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని వస్తున్న `ఇండియన్ 3` ముస్తాబవుతుంది. శంకర్ పడుతున్న అదనపు శ్రమ, పట్టుదల ఫలిస్తే మాత్రం కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.