ఆటో జానీ అవతారమెత్తిన చిరు?
చిరు ‘శంకర్ దాదా’ తరహాలో నడుచుకుంటూ వచ్చి.. మురళీధర్ గౌడ్‌తో స్టైల్‌గా మాట్లాడుతున్న వీడియో ఇది.
మెగాస్టార్ చిరంజీవి అభిమానుల దృష్టంతా ఇప్పుడు ‘కాకా’ సినిమా మీదే ఉంది. ‘వాల్తేరు వీరయ్య’లో వింటేజ్ చిరును చూపించి బ్లాక్ బస్టర్ కొట్టిన మెగాస్టార్ వీరాభిమాని బాబీ కొల్లి ఈ సినిమాను రూపొందిస్తుండడం.. చిరు పుట్టిన రోజు కానుకగా విడుదలైన టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇది భారీ చిత్రమే అయినప్పటికీ.. శరవేగంగా చిత్రీకరణ జరుపుతూ సంక్రాంతికి రిలీజ్ చేసేదిశగా వడివడిగా అడుగులు వేస్తోంది బాబీ అండ్ టీం.
‘కాకా’ టీజర్లో కనిపించింది చిరు పాత్రకు సంబంధించిన ఒక కోణమే. ఇందులో ఆయన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని.. అభిమానులకు కనువిందు చేసే అవతారాల్లో ఆయన కనిపిస్తారని టీం చెబుతూ వస్తోంది. అందుకు తగ్గట్లే ఇప్పుడు ‘కాకా’ లొకేషన్ నుంచి లీకైన వీడియో ఒకటి మెగా ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది.
చిరు ‘శంకర్ దాదా’ తరహాలో నడుచుకుంటూ వచ్చి.. మురళీధర్ గౌడ్‌తో స్టైల్‌గా మాట్లాడుతున్న వీడియో ఇది. కొన్ని సెకన్ల నిడివే ఉన్నప్పటికీ.. అందులో చిరు యాక్ట్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. అందులో చిరు గెటప్ చూస్తే ‘రౌడీ అల్లుడు’లో ఆటో జానీ గుర్తుకు వస్తున్నాడు. చిరుకు బాబీ పెద్ద ఫ్యాన్ కావడంతో అతను వింటేజ్ మెగాస్టార్ యాక్ట్స్‌ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ‘వాల్తేరు వీరయ్య’లో కూడా అదే చేశాడు. ఇప్పుడు ‘కాకా’లోనూ అలాంటిదే ట్రై చేస్తున్నట్లున్నాడు.
టీజర్లో చూసింది వర్తమానంలో నడిచే పాత్ర అయితే.. ఆ క్యారెక్టర్‌కు ఒక భారీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందంటున్నారు. అందులో చిరు డిఫరెంటుగా కనిపిస్తాడట. దానికి సంబంధించిందే ఇప్పుడు లీక్ అయిన వీడియో కావచ్చు. ఇప్పటికే ‘కాకా’ చిత్రీకరణ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. వచ్చే నెలలో మొత్తం షూట్ పూర్తి చేసి.. డిసెంబరులో ప్రశాంతంగా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవాలని భావిస్తోంది టీం. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘కాకా’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.