బాలయ్యతో తేడా వస్తే అంతే.. సుమన్ మాటల వెనుక అర్థం?

ఎక్కువ మాట్లాడకుండా.. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం.. దూరంగా కూర్చొని, వాళ్ళు పిలిస్తేనే దగ్గరకు వెళ్లడం ఇలా ఉండేవాణ్ణి.

Update: 2026-10-20 05:43 GMT

ప్రముఖ సీనియర్ హీరో సుమన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,విలన్ గా తనదైన ముద్ర వేసుకొని విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఈ మధ్య సినిమాలలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే తాజాగా ఆయన కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం జయహో రామానుజ. శ్రీ రామానుజాచార్యుల గారి జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం.. 11వ శతాబ్దానికి చెందిన శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన తత్వవేత్త సాధువైన శ్రీ రామానుజాచార్యుల బయోపిక్ ఆధారంగా అక్టోబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో రాబోతున్న ఈ చిత్రం ఏకంగా ఆరు భాషలలో 2 గంటల 15 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకున్న ఈయన.. అలాగే బాలకృష్ణ తో తనకున్న అనుబంధం గురించి, ఆయనతో తేడా వస్తే ఏం జరుగుతుంది? అనే విషయాల గురించి వివరించారు.. ఇంటర్వ్యూలో భాగంగా సుమన్ మాట్లాడుతూ.." సినిమా ఇండస్ట్రీలో అందరితో కూడా నాకు మంచి సాన్నిహిత్యం ఉంది . అప్పట్లో శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ వీళ్ళ అందరితో కూడా నేను కొన్ని సినిమాలలో కలిసి పని చేశాను. నా బిహేవియర్ వల్ల నాతో కంఫర్టబుల్గా ఉంటుందనే ఫీలింగ్ తోనే వాళ్ళు ఒకటికి రెండు మూడు సినిమాల్లో నన్ను తీసుకున్నారు.

ఎక్కువ మాట్లాడకుండా.. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం.. దూరంగా కూర్చొని, వాళ్ళు పిలిస్తేనే దగ్గరకు వెళ్లడం ఇలా ఉండేవాణ్ణి. ఇక వాళ్ల దగ్గర నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. క్రమశిక్షణ, టైం కి షూటింగ్ కి రావడం , సెట్స్ కి వచ్చిన తర్వాత అధిక ప్రసంగం లేకుండా స్టోరీ , డైలాగ్స్, పెర్ఫార్మన్స్ గురించి మాత్రమే చర్చించడం ఇలాంటివన్నీ కూడా నేను వాళ్ళ నుంచే నేర్చుకున్నాను. అయితే మనం గుడికి వెళ్తే ఎలా ఉంటామో ..గుడి బయట ఎలా ఉంటామో.. వాళ్ళు కూడా సెట్స్ లో ఉన్నప్పుడు ఒకలా , బయట ఇంకోలా ఉండేవారు.. నేను అది కూడా వాళ్ళని చూసి ఫాలో అయ్యాను.

ఆ తర్వాత వచ్చిన జనరేషన్ లో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలతో నా ఏజ్ ఈక్వల్ గా ఉండేది. అందుకే వాళ్లతో కాస్త లిబర్టీ ఉండేది. కలిసినప్పుడు హలో, హాయ్ అంటూ పలకరించేవాళ్ళు. ఎంత మాట్లాడినా కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు అంటే మాత్రం దూరంగా ఉండేవాడిని . ముఖ్యంగా మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అనేది కాదు.. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేదే ముఖ్యం. అలా నాకు అందరితో మంచి ర్యాపో ఏర్పడింది. ఇక నేరుగా వెళ్లి వాళ్ళతో మాట్లాడగలిగే అంత చనువు కూడా నాకుంది అంటూ తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ డిఫరెంట్ మూడ్స్ కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయనకు చాలా పనులు ఉంటాయి. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ కి చైర్మన్.. ఒక యాక్టర్, ఒక పొలిటిషన్.. ఇవి కాకుండా వేరే కూడా ఉన్నాయి. ఆయనను మనం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే ఆయన చాలా ఫ్రెండ్లీ పర్సన్ . అక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడాలి . అనవసరమైన మాటలు మాట్లాడితే ఆయన ఇరిటేట్ అవుతారు. అందుకే నేనెప్పుడూ నా లిమిట్స్ లో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతాను. ఇప్పుడు మెయిన్ గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి చర్చిస్తున్నాం ..ఏం చేద్దాం.. ఎలా చేద్దాం.. ప్రభుత్వానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే అంశాలపైనే మాట్లాడుకుంటున్నాం అంటూ సుమన్ తెలిపారు.

Tags:    

Similar News