1000 కోట్ల క్లబ్ కు ఆ స్టార్లిద్దరు వెరీ లాంగ్!
ఈ క్రిస్మస్ సీజన్ లో 1000 కోట్ల క్లబ్ లో చేరిపో తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతే కాదు తెలుగు సినిమాలు `ఆర్ ఆర్ ఆర్`, `కల్కి` చిత్రాల వసూళ్లను కూడా `ధురంధర్` బీట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.;
బాలీవుడ్ లో 1000 కోట్ల క్లబ్లో చేరిన స్టార్లు ఎంత మంది? అంటే షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటిస్టార్లు మాత్రమే కనిపి స్తారు. వారిద్దరి చిత్రాలే ఆ క్లబ్ లో చేరాయి. `ధురందర్` విజయంతో రణవీర్ సింగ్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ సినిమా 920 కోట్లకు పైగా సాధించింది. ఈ క్రిస్మస్ సీజన్ లో 1000 కోట్ల క్లబ్ లో చేరిపో తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతే కాదు తెలుగు సినిమాలు `ఆర్ ఆర్ ఆర్`, `కల్కి` చిత్రాల వసూళ్లను కూడా `ధురంధర్` బీట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. `ధురంధర్` ఇంకా మరో భాగం కూడా ఉంది. మార్చిలో పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే? తెలుగు సినిమా రికార్డులన్నీ బ్రేక్ అయ్యే అవకాశం లేకపోలేదు.
అలాగే `యానిమల్` సినిమాతో రణబీర్ కపూర్ కూడా 1000 కోట్ల క్లబ్ కు దగ్గరకు వచ్చాడు. కానీ అందుకో లేకపోయాడు. తదుపరి `రామాయణం` రిలీజ్ అనంతరం ఆ క్లబ్ లో సునాయాసంగా చేరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జాబితాలో చేరాల్సిన సీనియర్ స్టార్లు ఎవరు ఉన్నారంటే? ప్రముఖంగా ఇద్దరు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎన్నో ప్రయోగాలు చేసే హృతిక్ రోషన్ కూడా ఇంకా 1000 కోట్ల క్లబ్ లో చేరలేదు. ఆయనతో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఇంకా ఆ నెంబర్ సాధించలేదు. వీరిద్దరి ఖాతాలో 500 కోట్ల వసూళ్ల సినిమాలు కూడా లేవు.
చాలా సినిమాలు ఆ దగ్గర వరకూ వచ్చాయి గానీ రీచ్ అవ్వలేదు. దీంతో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఇప్పుడు రెండు రకాల టార్గెట్ లను దాటాల్సి ఉంది. వారిప్పుడు ఏ సినిమా చేసినా? 500 కోట్ల క్లబ్ అనంతరం 1000 కోట్ల క్లబ్ లోనూ చేరాల్సి ఉంది. మరి వారిద్దరు అందుకు ఎలాంటి స్ట్రాటజీ అనుసరిస్తారు? అన్నది చూడాలి. `వార్ 2` సినిమాలో హృతిక్ తనతో పాటు తెలుగు స్టార్ ఎన్టీఆర్ ను భాగం చేసాడు. పాన్ ఇండియాలో ఆ చిత్రాన్ని రిలీజ్ చేసాడు. కానీ అంచనాలు అందుకోలేకపోయింది. సల్మాన్ ఖాన్ మాత్రం ఇంకా ఆ తరహా ప్రయత్నాలు చేయలేదు.
రీజనల్ మార్కెట్ ఫరిదిలోనే సినిమాలు చేస్తున్నాడు. `కిసీకా భాయ్ కిసీకా జాన్` లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని భాగం చేసాడు కానీ అది కేవలం క్యామియో రోల్ కే పరిమితం. ఓ కీలక పాత్రకు తీసుకోలేదు. అలా చేసి ఉంటే? సినిమాకు కలిసొచ్చేది. మరి భవిష్యత్ లో భాయ్ కూడా అలాంటి ఆలోచన చేసే అవకాశం లేకపోలేదు.తెలుగు సినిమా పాన్ ఇండియాలో సత్తా చాటుతోన్న తరుణంలో బాలీవుడ్ అంతా ఏకమయ్యే ఆలోచనలోనూ ఉంది. ఇప్పటికే అమీర్ ఖాన్ కూడా `మహాభారతం`పై సీరియస్ గా పని చేస్తోన్న సంగతి తెలిసిందే.