భ‌విష్య‌త్ ను అలా ప్లాన్ చేస్తే ఆటం బాంబే!

కొరియోగ్రాఫ‌ర్ శ్ర‌ష్టి వ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. కొరియోగ్రాఫ‌ర్ జానీ మాష్ట‌ర్ శిష్యురాలిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అటుపై చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న‌తో ఎంతో ఫేమ‌స్ అయింది.;

Update: 2026-03-04 13:30 GMT

కొరియోగ్రాఫ‌ర్ శ్ర‌ష్టి వ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. కొరియోగ్రాఫ‌ర్ జానీ మాష్ట‌ర్ శిష్యురాలిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అటుపై చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న‌తో ఎంతో ఫేమ‌స్ అయింది.

ఆ ఘ‌ట‌న ఆమె జీవితాన్నే మార్చేసింది. అప్ప‌టి వ‌ర‌కూ జానీ మాస్టార్ కు అసిస్టింట్ గా ప‌నిచేసిన‌ శ్ర‌ష్టి మాష్ట‌ర్ అయిపోయింది. కొరియోగ్రాప‌ర్ గా త‌న‌ని తాను ప్రూవ్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చింది. `పుష్ప`, `జైలర్`, `గేమ్ ఛేంజ‌ర్`,`విక్రాంత్ రోణ`, `మావీరన్` లాంటి సినిమాల్లో కొన్ని పాట‌ల‌కు కొరియోగ్ర‌ఫీ చేసింది.

శ్ర‌ష్టి ప్ర‌తిభావంతు రాలే. ఎంతో ట్యాలెంట్ ఉన్నా? బ‌య‌ట ప‌డ‌టానికి స‌మ‌యం ప‌డుతుంది? అన్న‌ట్లు ఆమె ప్ర‌తిభ ఓ ఘ‌ట‌న‌తో వెలుగు లోకివ‌చ్చింది. అప్ప‌టి నుంచి నేరుగా తానే సినిమాల‌కు కొరియోగ్ర‌ఫీ చేస్తోంది. చాలా మంది ద‌ర్శ‌కులు పిలిచి మ‌రీ ఛాన్సులిస్తున్నారు. హీరోలు కూడా ఆమె ప‌ట్ల సానుకూలంగా ఉంటున్నారు. ఒక‌టి రెండు పాట‌లు ఇచ్చి ప‌రిశ్ర‌మ‌లో ప్రోత్స‌హిస్తున్నారు. అప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ రెట్టింపు అయింది. శ్ర‌ష్టి వీడియోల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. యూ ట్యూబ్ షాట్స్ తోనూ అల‌రిస్తోంది.

అలాగే ఓ సినిమాలో కూడా లీడ్ రోల్ పోషించింది. కానీ ఆ సినిమా గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. తాజాగా `ధ‌ర్మ‌స్థ‌ల నియోజ‌క వ‌ర్గం` అనే సినిమాలో శ్ర‌ష్టి `న్యాయం చేయ‌రా దేవుడా` అంటూ ఓ ప్ర‌త్యేక గీతంలో న‌టిస్తోంది. అంటే పాట‌లో న‌టించ‌డం. ఈ అమ్మ‌డు ఇంత వ‌ర‌కూ హీరోయిన్ల‌కు ఐటం పాట‌లు కంపోజ్ చేయ‌డం మిన‌హా తానే ఐటం గాళ్ల్ గా మార‌లేదు. ధ‌ర్మ‌స్త‌ల నియోజ‌క వ‌ర్గం సినిమాలో అవ‌కాశం రావ‌డంతో ఛాన్స్ తీసుకుంది. ఐటం భామ‌గా శ్ర‌ష్టి వ‌ర్మ అన్ని ర‌కాలుగా అర్హురాలే. అందం, అభిన‌యం తో ఐటం భామ‌గా ప‌క్కాగా యాప్ట్ అవుతుంది.

ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు భ‌విష్య‌త్ ను ఐటం భామ‌గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. శ్ర‌ష్టి వ‌ర్మ‌కున్న‌ డాన్సింగ్ స్కిల్స్ కు, ఛ‌రిష్మాకు చాలా ఈజీగా న‌ర్త‌కిగా క‌నెక్ట్ అవుతుంది. ఒక్క స్టార్ హీరో సినిమాలో అవ‌కాశం వ‌చ్చిందంటే? రాత్రికి రాత్రే రాత మారిపోతుంది. అస‌లే ఐటం భామల కోసం ప్ర‌తీసారి ముంబై భామ‌ల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. శ్ర‌ష్టి లాంటి వారు స‌క్సెస్ అయితే? ముంబై బాట ప‌ట్టాల్సిన అవ‌స‌రం త‌గ్గుతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో శ్రష్టి వర్మ ఒక కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. డైనమిక్ పర్సనాలిటీ , డ్యాన్స్ నైపుణ్యంతో హౌస్‌లో సందడి చేసింది.

Tags:    

Similar News