KVN ప్రొడక్షన్స్ కి అసలు ఏం జరుగుతోంది?
ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న KVN ప్రొడక్షన్స్ సంస్థ తమిళంలో విజయ్‌తో జన నాయగన్, కన్నడంలో యష్‌తో `టాక్సిక్` మూవీని నిర్మించింది.;
కన్నడ ఇండస్ట్రీలో KVN ప్రొడక్షన్స్ పేరుమోసిన డిస్ట్రిబ్యూషన్ కంపనీ. ధృవ్ సర్జా కథానాయకుడిగా నటించిన `పొగరు` నుంచి అజిత్ నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` వరకు ఎన్నో క్రేజీ సినిమాలని, ఆర్ఆర్ఆర్, యానిమల్, సీతారమం, కల్కి 2898ఏడీ, కంగలాన్, దేవర వంటి `పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లని కన్నడ ప్రేక్షకులకు అందించింది. చిన్న సినిమాలతో ప్రొడక్షన్ రంగంలోకి ప్రవేశించి ఈ ఏడాది భారీ పాన్ ఇండియా, ప్రెస్టీజియస్ ఫిల్మ్స్‌ని అందించబోతోంది. ఒకేసారి కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టి మూడు భాషల్లోనూ సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది.
ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న KVN ప్రొడక్షన్స్ సంస్థ తమిళంలో విజయ్‌తో జన నాయగన్, కన్నడంలో యష్‌తో `టాక్సిక్` మూవీని నిర్మించింది. ఈ రెండు సినిమాల రిలీజ్‌లు వాయిదాపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. KVN ప్రొడక్షన్స్ సంస్థ విషయంలో అసలు ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. తమిళంలో తొలి ప్రయత్నంగా స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా నిర్మించిన మూవీ `జన నాయగన్`. హెచ్ వినోద్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయన చివరి సినిమాగా దీన్ని నిర్మించారు.
తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా విజయ్ స్టార్‌డమ్‌కు అనుగునంగా మార్పులు చేసి అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. జనవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెన్సార్ వివాదం కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. జూన్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మూవీతో పాటు కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో `టాక్సిక్`ని నిర్మించారు. క్రేజీ హీరోయిన్స్ నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా నటించారు.
గ్లింప్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేసిన `టాక్సిక్` దేశ వ్యాప్తంగా వైరల్ కావడం తెలిసిందే. అంతే కాకుండా `కేజీఎఫ్ 2` తరువాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ కోసం సగటు సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసిన టీమ్ ఈమూవీని మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టింది. అయితే తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పిడిన పరిస్థితుల నేఫథ్యంలో `టాక్సిక్` రిలీజ్‌ని మేకర్స్ వాయిదా వేశారు. జూన్ 4న రిలీజ్ చేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించారు.
వరుపగా తమిళ, కన్నడ భాషల్లో భారీ సినిమాలతో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది KVN ప్రొడక్షన్స్ సంస్థ. ఏది జరిగినా మన మంచికే అన్నట్టుగా రెండు సినిమాలు వాయిదా పడటం కూడా ఆ సంస్థకు మంచే జరిగింది. కారణం `జన నాయగన్` హడావిడిగా రిలీజై ఆ తరువాత వివాదం వల్ల ఆగిపోతే నష్టాలొచ్చేవి. అలా జరక్కుండా రిలీజ్ వాయిదా పడటం మంచే జరిగింది. ఇక `టాక్సిక్` సడన్‌గా వాయిదాపడటం కూడా మంచిదే. ఎందుకంటే దీన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
గ్లోబల్ రిలీజ్ కోసం మార్చి 19ని ఎంచుకున్నారు. అయితే అనూహ్యంగా ఇజ్రాయెల్- ఇరాన్ వార్ జరగడం, గల్ఫ్ దేశాల్లోనూ యుద్ధ వాతావరణం ఉండటంతో సినిమాపై కలెక్షన్‌ల ప్రభావం పడే అవకాశం ఉంది. అది గమనించారు కాబట్టే మార్చి 19న కాకుండా జూన్ 4న రిలీజ్ చేస్తున్నారు. దీంతో రెండు సినిమాల రిలీజ్‌లు KVN ప్రొడక్షన్స్ సంస్థకు పెద్ద ఇబ్బందిని కలిగించే అవకాశం కనిపించడం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న KVN ప్రొడక్షన్స్ సంస్థ ఫైనల్‌గా మార్చి 14న క్రేజీ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తోంది. దీనికి బాబి దర్శకుడు. పవర్ ఫుల్ స్టోరీతో ఇందులో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చిరు కనిపించనున్నాడు.