గుండు విలన్ ఎంత సంతోషంగానంటే?
తాజాగా ఓ తమిళ విలన్ ఎంత సంతోషంగా ఉన్నాడో తెలిస్తే? జీవితమంటే ఇలా ఉండాలి అని ప్రతీ నటుడికీ అనిపిస్తుందేమో.;
డబ్బున్న వాళ్లంతా సంతోషంగానూ లేరు. డబ్బులేని వాళ్లు అంతా బాధలోనూ లేరు. ఇంకా చెప్పాలంటే డబ్బు ఉన్న వాడి కంటే లేని వాడే సంతోషంగా ఉన్నాడు? అన్నది వాస్తవం. ఉన్నడబ్బుని కాపాడుకునే టెన్షన్ లో డబ్బున్నవాడు ఉంటాడు. లేని వాడికి అలాంటి టెన్సన్స్ ఏవీ ఉండవు. అన్నీంటికి ధనమేరా? మూలం అన్నది అంతే వాస్తవం అనిపిస్తుంది. సినిమాల్లో వందల కోట్లు..వేల కోట్లు సంపాదించిన వారెంత మంది ఉంది. అదే సినిమా లో రోజుకు 500ల రూపాయలు సంపాదించిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువగా సంతోషంగా ఉన్నది ఎవరు? అంటే ఆ 500 సంపాదించిన వాడే అన్నది నిజం.
తాజాగా ఓ తమిళ విలన్ ఎంత సంతోషంగా ఉన్నాడో తెలిస్తే? జీవితమంటే ఇలా ఉండాలి అని ప్రతీ నటుడికీ అనిపిస్తుందేమో. అతడే మొట్ట రాజేంద్రన్ అలియాస్ గుండ్ విలన్. రాజేంద్రన్ నటించిన చాలా సినిమాల్లో గుండుతోనే కనిపిస్తాడు. ఆ నునుపు గుండె అతడికి ఓ ఐడెంటిటీ లాంటింది. చిత్ర పరిశ్రమలో సాదారణ ఫైటర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత సినిమాల్లో సైడ్ విలన్ పాత్రలు పోషిచాడు. అక్కడ నుంచి మెయిన్ విలన్ గా ప్రమోట్ అయ్యాడు. ఆ తర్వాత ఏకంగా హీరో రేంజ్ ఇమేజ్ నే సంపాదించాడు. ఇప్పటి వరకూ దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించాడు.
అతడు లేని స్టార్ హీరో సినిమా ఉండదు. కోలీవుడ్ లో ఏ హీరో నటించినా అందులో రాజేంద్రన్ తప్పనిసరిగా ఉండాల్సిందే.అంతగా రాజేంద్రన్ ప్రభావం తమిళ పరిశ్రమలో ఉంటుంది. రాజేంద్రన్ కంటే ముందు..తర్వాత చాలా మంది విలన్ నటులొచ్చారు. కానీ ఎవరు రాజేంద్రన్ కు మాత్రం పోటీగా లేరు. అతడికి అతడే పోటీగా నిలిచాడు. మరో పదేళ్ల పాటు, రాజేంద్రన్ కెరీర్ కి తిరుగులేదు. మరి అతడి వయసు ఎంతో తెలుసా? 67 ఏళ్లు నిండాయి. ఒక కుమార్తె, ముగ్గురు కొడుకులు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు చేసాడు.
వాళ్లకి పిల్లలు ఉన్నారు. వారితో ఇప్పుడు రాజేంద్రన్ ఎంతో సంతోషంగా ఉంటున్నన్నాడు. షూటింగ్ అనంతరం ఇంటికెళ్లిన తర్వాత మనవలతోనే ఆడుకుంటానన్నాడు. టెన్షన్ పడటం అన్నది తన డిక్షనరీలోనే లేదన్నాడు. సినిమా సెట్స్ లో ఉన్నా? ఇంట్లో ఉన్నా ఒకేలా ఉంటానన్నాడు. కానీ ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తానన్నాడు. అదే తనకు టెన్షన్ నుంచి రిలీఫ్ ఇస్తుందన్నాడు. అలాగే ఎంత సంపాదించినా ఆ డబ్బుకు మాత్రం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనన్నాడు. తానేమి డబ్బులో పుట్టి పెరగలేదని...అదంతా మధ్యలోనే వచ్చిందని..అలాగే వెళ్లిపోతుందన్నాడు. మరి సినిమా ఇండస్ట్రీలోకి వారసుల్ని తీసుకురాలేదంటే? ఇదంతా వాళ్లకెందుకు మంచి చదువులు చదువుకుని ఉద్యోగం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారన్నాడు.